Nizamabad

News October 3, 2024

నిజామాబాద్: కృష్ణా EXPRESSకి 50 ఏళ్లు

image

కృష్ణా EXPRESSకి 50 ఏళ్లు పూర్తయ్యాయి. అక్టోబరు 2, 1974లో సికింద్రాబాద్ నుంచి విజయవాడకి డీజిల్ ఇంజిన్‌తో లాంఛనంగా ప్రారంభించారు. ఇరు ప్రాంతాల మధ్య కృష్ణా నది ఉండటం వల్లే దానికి ‘కృష్ణాఎక్స్‌ప్రెస్’ అనే పేరును పెట్టారు. అప్పట్లో పగటిపూట నడిచే మొట్టమొదటి ఎక్స్‌ప్రెస్ రైలు ఇదే. ప్రస్తుతం ADB నుంచి NZB మీదుగా TPT వరకు నడుస్తోంది. కృష్ణా ఎక్స్‌ప్రెస్‌తో మీకున్న అనుబంధం ఎలాంటిదో కామెంట్ చేయండి.

News October 3, 2024

NZB: గోదావరిలో దూకి వ్యక్తి సూసైడ్

image

జీవితంపై విరక్తి చెంది వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం బాసరలో చోటుచేసుకుంది. ఎస్ఐ గణేశ్ వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా నవీపేట మండల కేంద్రానికి చెందిన దత్తు (45) ఆరునెలల కిందట ఆయన యాసిడ్ తాగాడు. ఆసుపత్రిలో చికిత్స చేయించినా నయం కాకపోవడంతో జీవితంపై విరక్తి చెంది గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

News October 3, 2024

NZB: ఢిల్లీ పోలీసులమంటూ బెదిరించి.. నిట్టనిలువునా దోచారు!

image

పోలీసులమని బెదిరించి లక్షలు కాజేసిన ఘటన NZB జిల్లాలో జరిగింది. బాధితుల ప్రకారం.. ‘పోలీసులం మాట్లాడుతున్నాం.. డ్రగ్స్, మనీ లాండరింగ్ కేసులో ఉన్నావు.. అరెస్ట్ చేయడానికి ఢిల్లీ పోలీసులు వస్తున్నారు’ అని కామారెడ్డికి చెందిన కిషన్ రావుకు ఫోన్ చేశారు. దీంతో భయపడిన బాధితుడు సైబర్ నేరగాళ్ల అకౌంట్‌కు రూ.9,29,000 బదిలీచేశాడు. మోసమని గ్రహించి 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు.

News October 3, 2024

NZB: డీఎస్సీ సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు 220 మంది హాజరు

image

డీఎస్సీ-2024 అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన బుధవారం ప్రారంభమైంది.ఈ మేరకు నిజామాబాద్ జిల్లాలో విద్యాశాఖ అధికారులు ఆయా జిల్లాల అభ్యర్థుల ధ్రువపత్రాలు పరిశీలించారు. మొదటిరోజు 220 మంది అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు. ఈ నెల 5 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కొనసాగుతుందని, అభ్యర్థుల మొబైల్ ఫోన్లు, ఈమెయిల్‌కు సమాచారం వచ్చిన వారు మాత్రమే హాజరుకావాలని అధికారులు సూచించారు.

News October 2, 2024

నిజామాబాద్ జిల్లా ప్రత్యేక అధికారిగా డాక్టర్ శరత్

image

నిజామాబాద్ జిల్లా ప్రత్యేక అధికారిగా డాక్టర్ శరత్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 10 ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమించిందన్నారు. ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో ఉమ్మడి జిల్లా అభివృద్ధి పనులు జరుగుతాయని పేర్కొన్నారు.

News October 2, 2024

బోధన్: రైలు బోగీలో ఉరేసుకొని వ్యక్తి సూసైడ్

image

బోధన్ రైల్వేస్టేషన్‌లో ఆగి ఉన్న ప్యాసింజర్ రైలులోని బోగీలో గుర్తుతెలియని వ్యక్తి మంగళవారం రాత్రి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే ఎస్ఐ సాయి రెడ్డి తెలిపారు. మృతుడి వయసు సుమారు 50 సంవత్సరాలు ఉంటుందన్నారు. రైల్వే మేనేజర్ నవీన్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాన్నారు. మృతుడి వివరాలు తెలిసినవారు రైల్వే స్టేషన్‌లో సంప్రదించాలని ఎస్ఐ వెల్లడించారు.

News October 2, 2024

కామారెడ్డి: రూ.10 లక్షలతో పోస్టల్ ఉద్యోగి పరార్

image

రూ.10లక్షల పెన్షన్ డబ్బులతో పోస్టల్ ఉద్యోగి పరారైన ఘటన బీబీపేట్‌లో చోటుచేసుకుంది. తుజాలాపూర్ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్‌గా పనిచేసే దేవిసోత్ బిక్యానాయక్ పోస్ట్ ఆఫీస్ డబ్బును పక్కదారి పట్టించి గతంలో సస్పెండ్ అయ్యాడు. కాగా గతనెల 30న ఇస్సానగర్, తుజాలాపూర్ గ్రామాలకు చెందిన పెన్షన్ డబ్బును తీసుకొని పరారయ్యాడు. మంగళవారం గ్రామస్థులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు SI ప్రభాకర్ వెల్లడించారు.

News October 2, 2024

NZB: బస్సు పైన ప్రమాదకరంగా ప్రయాణం

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా దసరా సెలవులు రావడంతో మంగళవారం బస్‌స్టాండ్‌లు విద్యార్థులు, ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. బస్సులు ప్రయాణికులతో రద్దీగా మారడంతో కొందరు ప్రమాదకరంగా బస్సు మీదకు ఎక్కి ప్రయాణించారు. కాగా పండుగ నేపథ్యంలో బస్సు సర్వీసులు పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు.

News October 2, 2024

NZB కలెక్టర్‌తో మంత్రి పొంగులేటి, సీఎస్ సమీక్ష

image

రాష్ట్రంలో ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారి కోసం ప్రయోగాత్మకంగా ఈ నెల 3 నుంచి పైలట్ ప్రోగ్రాం కింద చేపట్టనున్న ప్రయోగాత్మక సర్వేను పక్కగా జరిపించాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సూచించారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా జిల్లాల కలెక్టర్లతో సమీక్ష జరిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, తదితరులు పాల్గొన్నారు.

News October 1, 2024

NZB: GREAT.. అప్పుడు సర్పంచ్‌గా.. ఇప్పుడు ఉపాధ్యాయుడిగా..!

image

చదువుకు వయసుతో నిమిత్తం లేదని నిరూపించాడు. రాజకీయంలో జిల్లాస్థాయిలో తనదైన ముద్ర వేసుకొని ఇప్పుడు డీఎస్సీలో మంచి ర్యాంకు సాధించి మన్ననలు పొందుతున్నాడు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో బీఈడీ పూర్తి చేసిన నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మాజీ సర్పంచ్(2013) నంద అనిల్ నిన్న విడుదలైన డీఎస్సీ ఫలితాల్లో జిల్లా స్థాయిలో 7వ ర్యాంకు సాధించాడు. సాంఘిక శాస్త్రం విభాగంలో స్కూల్ అసిస్టెంట్‌గా ఎంపిక కానున్నాడు.