India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
లింగంపేటలో పరంపర ఫౌండేషన్, రైన్ వాటర్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో నాగన్న బావి పునరుద్ధరణ పనులను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ఎస్పీ సింధు శర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రాచీన కట్టడాలకు పరంపర ఫౌండేషన్ ఆధ్వర్యంలో పూర్వ వైభవం తీసుకురావడం అభినందనీయమని కొనియాడారు. ప్రాచీన కట్టడాలు పునరుద్ధరణ చేయడంవల్ల భావితరాలకు పూర్వకాలం చరిత్ర తెలిసే వీలు కలుగుతుందని తెలిపారు.
రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను NZB ఎంపీ అర్వింద్ దిల్లీలోని కేంద్రమంత్రి కార్యాలయంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో రైల్వేకి సంబంధించి, పెండింగ్‌లో ఉన్న పలు అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఆర్వోబీల నిర్మాణం పనులను వేగవంతం చేసేలా అధికారులకు సూచనలను ఇవ్వాలని కోరారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ తెలిపారు.
నిజామాబాద్ జిల్లా ఆలూరు మండల కేంద్రంలో శుక్రవారం పిచ్చి కుక్కలు స్వైరవిహారం చేశాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పిచ్చికుక్కల దాడిలో ఏడుగురు గాయపడ్డారని చెప్పారు. గాయాలైన వారిని మొదటగా దేగాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారని స్థానికులు పేర్కొన్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఈనెల 28 జాతీయ మెగా లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ప్రజలు వినియోగించుకోవాలని ఎస్పీ సింధుశర్మ అన్నారు. రాజీపడ దగిన కేసులలో జిల్లాలోని అన్ని కోర్టులో క్రిమినల్ కాంపౌండబుల్ కేసులు, సివిల్ తగాదా కేసులు, ఆస్తి విభజన కేసులు, కుటుంబపరమైన నిర్వాహణ కేసులు, వైవాహిక జీవితానికి సంబంధించిన కేసులు, బ్యాంకు రికవరీ, విద్యుత్ చౌర్యం, చెక్ బౌన్స్ కేసులు పరిష్కారించుకోవచ్చని ఆమె సూచించారు.
నిరంతరం వార్తలు రాసే పాత్రికేయులకు చట్టాలపై అవగాహన ఉంటే ప్రజలకు ఉపయోగపడే వీలుంటుందని సీపీ కల్మేశ్వర్ అన్నారు. నిజామాబాద్‌లో నూతన న్యాయ చట్టాలపై శుక్రవారం ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ప్రజలు చట్టాలను తమ చేతుల్లో లోకి తీసుకోవద్దని తెలిపారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే పోలీసులను సంప్రదించాలని చెప్పారు. వీడీసీల పేరిట చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.
లింగంపేటలోని నాగన్న మెట్ల బావిని నేడు కలెక్టర్, ఎమ్మెల్యే ప్రారంభించనున్నారు. కాగా ఈ బావికి చాలా ప్రత్యేకతలున్నాయి. పాపన్నపేట సంస్థాన కాలంలో జాక్సాని నాగన్న అనే వ్యక్తి 18 వ శతాబ్దంలో నిర్మించాడని స్థానిక కైఫియత్తులో లిఖించబడింది. ఈ నిర్మాణాన్ని ఉపరితలం నుంచి 100 అడుగుల లోతు వరకు ఐదు అంతస్తులుగా రాతితో అందంగా నిర్మించారు. మరీ ఇలాంటి పురాతన బావులు మీ గ్రామంలో ఉన్నాయా.. ఉంటే కామెంట్ చేయండి
నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (GGH)లో డాక్టర్ పేరిట రూ.90 వేలు విలువ చేసే కొత్త ఫోన్‌ను గుర్తు తెలియని వ్యక్తి అపహరించుకుపోయాడు. నగరంలోని ఒక సెల్ ఫోన్ షాపుకు డాక్టర్ పేరిట ఫోన్ చేసి GGHకు ఫోన్ తెస్తే తీసుకుంటానని నమ్మబలికి రప్పించి సూపరింటెండెంట్ రూం ఎదురుగా కూర్చోబెట్టాడు. లోపల సార్‌కు ఫోన్ చూయించి వస్తానని ఫోన్‌తో సహా పరారయ్యాడు. దీనిపై వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
యువతీ ప్రేమకు నిరాకరించిందని యువకుడు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనా ఖానాపూర్ శివారులో చోటుచేసుకుంది. స్థానికంగా ఉండే గౌతమ్ కాంబ్లె (26) ఓ యువతిని ప్రేమించాడు. ఇందుకు యువతి నిరాకరించడంతో మనస్తాపానికి గురై ఖానాపూర్ శివారులో చెట్టుకు ఉరి వేసుకున్నాడు. స్థానికులు నిజామాబాద్ రూరల్ పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలో ఎంఎడ్ 2వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. ఈనెల 28 నుంచి అక్టోబర్ 3 వరకు పరీక్షలు కొనసాగుతాయని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం.అరుణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు విశ్వవిద్యాలయ వెబ్ సైట్‌ను సంప్రందించాలని సూచించారు.
NZB కమిషనరేట్ ఆర్మూరు, బోధన్ డివిజన్ పరిధిలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు, మిలాద్ ఉన్ నబీ పండుగ ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో చేసుకోడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ సీపీ కల్మేశ్వర్ కృతజ్ఞతలు తెలిపారు. గణేష్ నిమజ్జన వేడుకలకు పోలీసు శాఖ ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు సైతం చేసిందని దీనికి ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు సీపీ పేర్కొన్నారు. అన్ని మతాల పెద్దలు స్వచ్చందంగా సహకరించారని వెల్లడించారు.
Sorry, no posts matched your criteria.