India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
NZB కమిషనరేట్ ఆర్మూరు, బోధన్ డివిజన్ పరిధిలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు, మిలాద్ ఉన్ నబీ పండుగ ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో చేసుకోడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ సీపీ కల్మేశ్వర్ కృతజ్ఞతలు తెలిపారు. గణేష్ నిమజ్జన వేడుకలకు పోలీసు శాఖ ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు సైతం చేసిందని దీనికి ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు సీపీ పేర్కొన్నారు. అన్ని మతాల పెద్దలు స్వచ్చందంగా సహకరించారని వెల్లడించారు.
నిజామాబాద్ జిల్లాకు చెందిన భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ డీఎస్పీగా బుధవారం బాధ్యతలు తీసుకున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆమెను డీఎస్పీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు నిఖత్ బుధవారం డీజీపీ జితేందర్‌ను కలిసి తన జాయినింగ్ ఆర్డర్ అందజేశారు.
వర్షాకాలం ఉండడంతో పాముల సంచారం అధికమైంది. పాము కాటుకు గురై.. మృతి చెందుతున్న ఘటనలు నిజామాబాద్ జిల్లాలో ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. గడ్డి పొదలు, పొలం గట్లను స్థావరం చేసుకుని ఉన్న పాములు రైతులను కాటేస్తున్నాయి. ఎక్కువ శాతంమంది నాటువైద్యంపై ఆధారపడి.. ప్రాణాలు కాపాడే విలువైన సమయాన్ని చేజేతులా జారవిడుస్తున్నారు. వైద్యాధికారులు ప్రజలకు అవగాహన కల్పించడం లేదన్న అపవాదు ఉంది.
నిజామాబాద్‌కు చెందిన ప్రముఖ బాక్సింగ్ క్రీడాకారిణి నిఖత్ జరీన్ కు రాష్ట్ర ప్రభుత్వం డీఎస్పీ పోస్టు ఇచ్చింది. ఈమేరకు బుధవారం రాష్ట్ర డీజీపీ జితేందర్ నిఖత్ జరీన్‌కు డీఎస్పీగా నియామక ఉత్తర్వులు అందజేశారు. ఇటీవల జరిగిన అంతర్జాతీయ బాక్సింగ్ చాంపియన్ షిప్ పోటీల్లో ఆమె ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు గ్రూప్ 1 పోస్టు అయిన డీఎస్పీగా నిఖత్ జరీన్ నియమించింది.
ఉమ్మడి NZB జిల్లాలోనే కనీవినీ ఎరగని రీతిలో రికార్డ్ స్థాయిలో గణేశ్ లడ్డూ వేలం జరిగింది. పిట్లంలోని ముకుందర్ రెడ్డి కాలనీ గణపయ్య చేతిలోని లడ్డూ.. ఏకంగా రూ.501,000 లక్షలు పలికింది. పిట్లం కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీపీ సరిత, సూరత్ రెడ్డి ఈలడ్డూను సొంతం చేసుకున్నారు. గతేడాది ఇక్కడి లడ్డూ 3.60 లక్షలు పలికింది. మీ గ్రామాల్లో వినాయక మండపాల్లో వేలం పలికిన లడ్డూ ధరను కామెంట్‌లో తెలుపండి.
కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో మిగిలిన PGCRT, CRT, PETలతో పాటు అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో CRT ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతించినట్లు NZB జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ తెలిపారు. సబ్జెక్టుల వారీగా ఖాళీలు deonizamabad.in వెబ్సైట్‌లో అందుబాటులో ఉంచామన్నారు. జాబితాతాలో పేరున్న అభ్యర్థులు ఈ నెల 19న కలెక్టరేట్‌లోని సమగ్ర శిక్ష కార్యాలయానికి సర్టిఫికేట్ పరిశీలనకు రావాలన్నారు.
పిట్లం మండల కేంద్రంలోని ముకుంద రెడ్డి కాలనిలో ఏర్పాటు చేసిన గణనాథుడి వద్ద మంగళవారం రాత్తి మహా లడ్డూ ప్రసాదాన్ని వేలం వేశారు. హోరా హోరీగా సాగిన వేలం పాటలో మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు మాజీ ఎంపీపీ సరిత, సూరత్ రెడ్డి దంపతులు రూ.5,01,000కు లడ్డూను దక్కించుకున్నారు. అనంతరం గణేశ్ మండలి సభ్యులు వారిని ఘనంగా సన్మానించి లడ్డూ ప్రసాదం అందజేశారు.
కేంద్ర డిఫెన్స్ మినిస్టర్ రంజిత్ సింగ్‌ను నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని డిఫెన్స్ మినిస్టర్ నివాస గృహంలో కలిసి పలు అంశాలపై చర్చించారు. ఎంపీ అరవింద్ చేసే ప్రతి కార్యక్రమాల విషయంలో డిఫెన్స్ మినిస్టర్ సలహా సూచనలను తీసుకునే నేపథ్యంలో ఆయనతో కలిసి ఫ్లవర్ బొకే అందజేసి శాలువాతో సత్కరించారు.
హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మంగళవారం జరిగిన జాతీయ సమైఖ్యత దినోత్సవ కార్యక్రమంలో కేటిఆర్‌ను KMR మాజీ ZP ఛైర్మన్ దఫెదర్ రాజు మర్యాదపూర్వకంగా కలిశారు. కేటిఆర్‌తో కలిసి జెండా ఆవిష్కరణ చేశారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పాలభిషేకం చేశారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా మాజీ ZP ఛైర్మన్ దఫెదర్ రాజు, NZB మాజీ జిల్లా ఛైర్మన్ దాదన్నగారి విట్టల్ రావు, కామారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడు ముజీబుద్దిన్ ఉన్నారు.
వినాయక నిమజ్జనోత్సవాన్ని పురస్కరించుకుని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, NZB అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం దుబ్బ ప్రాంతంలోని సార్వజనిక్ గణేశ్ మండలి వద్దకు చేరుకొని కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. ప్రశాంత వాతావరణంలో నిమజ్జనోత్సవాలు జరుపుకోవాలని కలెక్టర్, సీపీ సూచించారు.
Sorry, no posts matched your criteria.