India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నిజామాబాద్‌లో అక్రమంగా మొరం తరలిస్తున్న టిప్పర్‌ను సీజ్ చేసినట్లు ఐదో టౌన్ ఎస్ఐ గంగాధర్ తెలిపారు. టౌన్ పరిధిలో అక్రమంగా మొరం తరలిస్తుండగా వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ చిన్న కొండయ్య, యజమాని నర్సయ్యపై కేసు నమోదు చేసినట్లుగా ఎస్ఐ వెల్లడించారు. గతంలో మొరం అక్రమ రవాణా చేసిన పలువురిని తహశీల్దార్ ఎదుట హాజరుపరచగా రూ.5 లక్షల పూచీకత్తుపై సంవత్సరం వరకు బైండోవర్ విధించినట్లు ఎస్ఐ వివరించారు.
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న హైదరాబాద్‌లో తలపెట్టనున్న మహిళా శంఖారావం సభ పోస్టర్‌ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారం తన నివాసంలో ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి 14 నెలలు అయినా మహిళలకు ప్రతి నెల రూ.2500 ఇవ్వడం లేదని, రేవంత్ రెడ్డి మహిళలకు రూ.35 వేల చొప్పున బాకీ పడ్డారన్నారు. ప్రతీ మహిళా బ్యాంకు ఖాతాలో రూ.35వేలు జమ చేయాలన్నారు.
తమ అసమర్థతతో ఇప్పటికే గురుకులాల వ్యవస్థను భ్రష్టు పట్టించిన కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నిర్వహణను గాలికొదిలేసిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారం Xలో విమర్శించారు. ఎల్లారెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన నిర్వాహకులు లేక భోజనం కోసం విద్యార్థులు ఎండలో కి.మీ. నడవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. పాఠశాల ఆవరణలోనే భోజనం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు.
నిజామాబాద్‌లో ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో రెండో దశ చివరి రోజు ప్రయోగ పరీక్షలు జరుగుతున్న పరీక్ష కేంద్రాలను బుధవారం DIEO రవికుమార్ తనిఖీ చేశారు. ప్రయోగ పరీక్షలు జరుగుతున్న పలు ప్రైవేటు కళాశాలలు, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలను ఆయన తనిఖీ చేశారు. ప్రతి పరీక్ష కేంద్రంలో కెమెరాలు పని చేస్తున్న విషయాన్ని స్వయంగా DIEO పరిశీలించారు.
వర్ని మండలం జాకోరా ఎక్స్ రోడ్డు వద్ద బుధవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మరణించాడు. స్థానికులు 108కు, పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికే వ్యక్తి మృతి చెందినట్లు 108 సిబ్బంది తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం బోధన్ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వివరించారు. వ్యక్తిని గుర్తించిన వారు వర్ని పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని ఎస్‌ఐ రమేశ్ పేర్కొన్నారు.
వరంగల్ వచ్చే ధైర్యం లేక రాహుల్ గాంధీ పారిపోయారని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. హామీలపై ప్రజలు నిలదీస్తారనే రాహుల్ గాంధీ వరంగల్ పర్యటనను రద్దు చేశారని విమర్శించారు. వరంగల్ డిక్లరేషన్‌పై రైతులు ప్రశ్నిస్తారని రాహుల్ భయపడ్డారన్నారు. ఇచ్చిన మాట తప్పితే ప్రజలు ఊరుకోరని, మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు ఎక్కడా తిరగలేని పరిస్థితి ఏర్పడుతుందన్నారు.
విచారణ నిమిత్తం తీసుకెళ్లిన ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన NZBలో కలకలం రేపింది. గూపన్పల్లిలో ఓ డాక్టర్ షెడ్‌లో పని చేస్తున్న బోధన్ మండలం కల్దుర్కికి చెందిన రాజును ముగ్గురు వ్యక్తులు వచ్చి ఓ చోరీ కేసు విషయంలో విచారణ కోసం తీసుకెళ్లినట్లు అతడి భార్య లక్ష్మి తెలిపారు. కాగా అనంతరం అతడు గడ్డి మందు తాగడని, దీంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో కోళ్లకు హైలీ పాథోజెనిక్ అవెన్ ఫ్లూయాంజా వైరస్ సోకిందని నిర్ధారణ అయ్యింది. కాగా కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లం కోళ్ల ఫామ్‌లో ఒకే సారి 8 వేలకుపైగా కోళ్లు మృతిచెందడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది. కోళ్ల దిగుమతికి అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడంతో అధికారులు కట్టడిపై ఫోకస్ పెట్టారు.
ఇంటికి తాళం వేసి కుటుంబం కుంభమేళాకు వెళ్లగా గుర్తు తెలియని దుండగులు ఇంటి తాళం పగులగొట్టి ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన నిజామాబాద్‌లో జరిగింది. కంఠేశ్వర్ బైపాస్ రోడ్‌లో నివాసం ఉండే శేఖర్ కుటుంబంతో కలిసి సోమవారం కుంభమేళాకు వెళ్లారు. కాగా అదే రాత్రి దొంగలు తాళం పగలగొట్టి ఇంట్లోని 2 తులాల బంగారం, 40 వేల నగదు అపహరించినట్లు బాధితుడు తెలిపారు.
నిజామాబాద్‌లో అనారోగ్యంతో సీనియర్ ఫొటో జర్నలిస్టు రమణ మృతి చెందాడు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఆయన పలు వార్త పత్రికల్లో ఫొటోగ్రాఫర్‌గా పనిచేశారు. కాగా ఆయన మృతి పట్ల జర్నలిస్టు సంఘాల నాయకులు, ప్రెస్ క్లబ్ సభ్యులు నివాళులర్పించారు.
Sorry, no posts matched your criteria.