Warangal

News March 15, 2025

వరంగల్: నేటీ నుంచి అంగన్వాడీలకు ఒంటిపూట

image

రాష్ట్రంలో ఎండలు మండుతున్న వేల అంగన్వాడీ కేంద్రాలలో ఒంటిపూట బడులు నిర్వహించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ అలియాస్ సీతక్క శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలల తరహాలోనే శనివారం నుంచి అంగన్వాడీ కేంద్రాలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు నడపాలని మంత్రి సూచించారు.

News March 14, 2025

వరంగల్: హోలీ వేడుకల్లో కలెక్టర్ శారద

image

టీఎన్జీవో నాయకుల ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా హోలీ పర్వదినాన్ని పురస్కరించుకొని హోలీ శుభాకాంక్షలు తెలిపారు. హోలీ వేడుకలలో కలెక్టర్ కుటుంబంతో కలిసి పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రశాంత వాతావరణంలో హోలీ పండుగ జరుపుకోవాలని సూచించారు.

News March 14, 2025

రాయపర్తి: చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి

image

రాయపర్తి మండలం మైలారం గ్రామానికి చెందిన వెంకన్న (38) చేపల వేటకు వెళ్లి నీట మునిగి మృతి చెందాడు. ఎస్సై శ్రవణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ మత్స్యకారులతో కలిసి వెంకన్న గురువారం సాయంత్రం తాళ్లకుంటలోకి చేపలు పట్టేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో వల కాళ్లకు చుట్టుకుని నీట మునిగి మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రవణ్ కుమార్ వివరించారు.

News March 14, 2025

వరంగల్: నగర ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన మేయర్  

image

హోలీ పండుగ సందర్భంగా నగర మేయర్ గుండు సుధారాణి నగర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ ఆప్యాయత సంతోషాల హరివిల్లుగా, శాంతి సౌభ్రాతృత్వానికి ప్రత్యేకంగా నిలిచే ఈ హోలీ పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలన్నారు. సహజ సిద్ధమైన రంగులతో సాంప్రదాయ పద్ధతులతో ఈ రంగుల పండుగను ఆనందంతో సంతోషంగా జరుపుకోవాలని మేయర్ ఆకాంక్షించారు. 

News March 14, 2025

వరంగల్: హోలీ శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్

image

హోలీ పండుగను పురస్కరించుకొని వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద జిల్లా ప్రజలకు హోలీ వేడుక శుభాకాంక్షలు తెలియజేశారు. రాగద్వేషాలకు అతీతంగా అందర్నీ ఒకటి చేసే ఈ హోలీ పండుగ వేడుక ప్రజలందరి జీవితాలలో సంతోషంతో వెలుగులో నింపాలని ఆకాంక్షించారు. జిల్లా ప్రజలు ఆనంద ఉత్సాహాలతో హోలీ వేడుకలు జరుపుకోవాలని అన్నారు. సహజ రంగులను వినియోగిస్తూ సాంప్రదాయబద్ధంగా పోలి నిర్మించుకోవాలని కలెక్టర్ కోరారు. 

News March 14, 2025

WGL: బాల్యంలో ఈ పూలతోనే హోలీ (PHOTO)

image

వరంగల్‌ల్లో ఓ చెట్టుకు విరబూసిన పూలు మన బాల్యాన్ని గుర్తుచేస్తున్నాయి. ఒంటిపూట బడికెళ్తుంటే రోడ్డు పక్కనే ఇవి గుబాలించేవి. ఈ పూల మకరందం రుచిచూసి మైమరచిన బాల్యం మళ్లీ గుర్తొస్తోంది. పండగొస్తుంది అనే సంబరంలో ఎండలో తిరిగి ఈ పూలను ఒకరోజు ముందే సేకరించేవాళ్లం. నీటిలో ఉడికించి రంగు ఊరిన నీళ్లతో ఆడిన హోలీ బాల్యంలో ఓ మధురజ్ఞాపకమే. ఈ ఏడాదైనా మోదుగ పూలతో హోలీ జరుపుకోండి. HAPPY HOLI

News March 13, 2025

హోలీ పండుగ.. వరంగల్ సిటీలో పోలీసుల నజర్

image

హోలీ పండుగను పురస్కరించుకొని వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో పోలీసులు ప్రత్యేక బందోబస్త్ ఏర్పాటు చేయాలని వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ అదేశించారు. హోలీ వేళ ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తించే వారితో పాటు.. మహిళలు, యువతులపై వారి అనుమతి లేకుండా రంగులు జల్లే వారిపై పోలీసులు నజర్ పెట్టాలన్నారు. ట్రై సిటీ పరిధిలో ముమ్మరంగా పెట్రోలింగ్ చేస్తూ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

News March 13, 2025

MHBD: ప్రేమగా మారిన మూగ పరిచయం

image

మూగవారే.. అయితేనేం. ప్రేమించుకున్నారు. వివాహంతో ఒక్కటయ్యారు. MHBD జిల్లా గార్ల మండలానికి చెందిన అశ్విన్‌సాయి, తూర్పుగోదావరి(ఏపీ) జిల్లాకు చెందిన బుజ్జి ఇద్దరు మూగవారే. రెండేళ్ల క్రితం ఏర్పడిన వీరి పరిచయం ప్రేమగా చిగురించింది. ఇంట్లో పెద్దలను ఒప్పించి బుధవారం గార్లలో వివాహం చేసుకున్నారు. అందరికీ ఆదర్శంగా నిలిచారు.

News March 13, 2025

ప్రభలతో దద్దరిల్లనున్న కొమ్మాల!

image

హోలీ రోజు జరిగే గీసుగొండ కొమ్మాల జాతరకు తరలివచ్చే ఎడ్ల బండ్లు, రాజకీయ ప్రభలకు దశాబ్దాల చరిత్ర ఉంది. వేలాది భక్తులు ప్రభ బండ్లను ఊరేగింపుగా తీసుకొస్తారు. హోలీ రోజు, నిండు పౌర్ణమి సందర్భంగా భక్తులు, రాజయకీయ నాయకులు ఎడ్లబండ్లు, ఒంటె, ఏనుగు, గుర్రం, మేక వంటి ప్రభలతో ఇక్కడికి వస్తుంటారు. పోటీ పడి మరీ ప్రభలను ఎత్తులో నిర్మిస్తుంటారు. వరంగల్ నుంచి కూడా ఇక్కడకు ఎడ్లబండ్లపై వస్తుండటం విశేషం.

News March 13, 2025

HNK: ఇనుపరాతి గుట్ట భూములపై అధికారులతో కలెక్టర్ సమీక్ష

image

హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని ముప్పారం, దేవునూరు గ్రామాల్లో విస్తరించి ఉన్న ఇనుపరాతి గుట్ట పరిధిలో ఫారెస్ట్ అధికారులు గుర్తించిన వ్యవసాయ పట్టా భూములపై జిల్లా కలెక్టర్ ప్రావీణ్య వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ భూముల సర్వే, సంబంధిత రైతుల గుర్తింపు, తదితర వివరాలను సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

error: Content is protected !!