India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఈ నెల 17, 18న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో గ్రూప్ -3 పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో కలెక్టర్ డాక్టర్ సత్య శారద సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రూప్-3 పరీక్ష రాసే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి ఆగిన అభివృద్ధిని కొనసాగించే బాధ్యత నాది అని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ట్వీట్ చేశారు. నిత్యం వరంగల్ పశ్చిమ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తూ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకుంటున్నామని, నగర అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక ఫోకస్ పెట్టారని చెప్పారు.
ఎన్నో ఏళ్ల కళగా ఉన్న కాజిపేట బ్రిడ్జి పనులు వేగంగా జరుగుతున్నాయని, మార్చి నెలలో బ్రిడ్జి అందుబాటులో వస్తుందని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. కాజీపేటలో కావ్య మాట్లాడుతూ.. ఈనెల 21న రైల్వే జీఎంని కలిసి పెండింగ్‌లో ఉన్న రైల్వే సమస్యలతో పాటు కాజీపేట రైల్వే బస్టాండ్ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కి నేడు మిర్చి తరలివచ్చింది. ఈ క్రమంలో తేజ మిర్చి క్వింటాకు మంగళవారం రూ.16,500 రాగా.. నేడు రూ.16వేలకు పడిపోయింది. అలాగే 341 రకం మిర్చి క్వింటాకు నిన్నటిలాగే రూ.15వేలు పలికింది. మరోవైపు వండర్ హాట్ మిర్చి నిన్నటితో పోలిస్తే ఈరోజు రూ.300 ధర పెరిగింది. నిన్న రూ.13,200 ధర రాగా.. నేడు రూ.13,500కి పెరిగింది.
నవంబర్ 14 బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణలోని బాలబాలికలకు రాష్ట్ర పంచాయతీరాజ్ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. నేటి బాలలే రేపటి పౌరులని దేశ భవిష్యత్తు బాలల చేతుల్లో ఉందని సీతక్క అన్నారు. బాలల సంరక్షణకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని అన్నారు.
జనగాం జిల్లాలో దారుణం జరిగింది. స్థానికుల వివరాలు.. రఘునాథ్‌పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం గ్రామంలో బుధవారం అర్ధరాత్రి పర్వత యోగేందర్ అనే వ్యక్తి గంపల పరశరాములుపై గొడ్డలితో దాడి చేయడంతో మృతి చెందాడు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని నిందితుడిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఉమ్మడి WGL జిల్లా వ్యాప్తంగా చలి పంజా విసురుతోంది. జిల్లాలో ఉదయం, రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో చలితో ప్రజలు బయటికి రావాలంటే జంకుతున్నారు. అలాగే, పొగమంచు సైతం ప్రయాణికులను తీవ్ర ఇబ్బంది పెడుతోంది. చలి నేపథ్యంలో వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణులు, శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బంది పడేవారు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
భారత తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని.. దేశానికి వారు అందించిన సేవలను, త్యాగాలను మంత్రి కొండా సురేఖ స్మరించుకున్నారు. పిల్లలే ఈ దేశ భవిష్యత్తు అని గట్టిగా నమ్మిన వ్యక్తి జవహర్ లాల్ నెహ్రూ అని మంత్రి అన్నారు. పిల్లలకు సరైన విద్య, శిక్షణ, సంరక్షణ ఉంటే వారు దేశానికి మూలస్తంభాలుగా నిలుస్తారని భావించి ఆ దిశగా కార్యాచరణను అమలుచేసిన దార్శనికుడు నెహ్రూ అని మంత్రి తెలిపారు.
HYD నుంచి సీఎస్ శాంతి కుమారి నేడు ధాన్యం కొనుగోలు, పత్తి పంట కొనుగోలు, సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే, గ్రూప్-3 పరీక్షల నిర్వహణ తదితర అంశాలపై HNK జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 12.86 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా 7.2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం తరలించామని, మరో 5.6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఉందని అధికారులన్నారు.
రాష్ట్రంలోని పిల్లలకు మంత్రి సీతక్క బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మన దేశంలో ఉన్న ప్రతి బిడ్డా ఆనందంగా ఉండాలనే నెహ్రూ ఆకాంక్ష రూపమే బాలల దినోత్సవమని పేర్కొన్నారు. దేశాన్ని వెనకబాటుతనం నుంచి వికాసం వైపు నడిపించిన దార్శనికుడిగా నెహ్రూను చిరకాలం ప్రజలు గుర్తు పెట్టుకుంటారని, నెహ్రూ చలవతోనే ప్రపంచ పటంలో దేశానికి ప్రత్యేక స్థానం దక్కిందన్నారు.
Sorry, no posts matched your criteria.