News July 5, 2024

కోహ్లీ, రోహిత్ స్థానాలను భర్తీ చేసేది వీరేనా?

image

టీ20లకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరి స్థానాలను ఎవరు భర్తీ చేస్తారనేదానిపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. వీరి స్థానాలను యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్ భర్తీ చేస్తారని అత్యధిక మంది నెటిజన్లు భావిస్తున్నారు. అభిషేక్ శర్మ, కేఎల్ రాహుల్‌కు కూడా వీరి స్థానాలను భర్తీ చేసే సామర్థ్యం ఉందని చెబుతున్నారు. మరి మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేయండి.

News July 5, 2024

ఏపీలో హైవేల నిర్మాణంపై కేంద్రమంత్రితో చర్చించిన సీఎం

image

AP: ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న పలు హైవేల నిర్మాణంపై చర్చించారు. అనంతపురం-అమరావతి, హైదరాబాద్ -అమరావతి హైవేల నిర్మాణం త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కేంద్రమంత్రులు రామ్మోహన్, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాస వర్మ, రాష్ట్ర ఆర్థికమంత్రి పయ్యావులతో పాటు ఎంపీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

News July 5, 2024

ఖైదీని కలిసేందుకు జగన్ రూ.25 లక్షలు ఖర్చు చేశారు: హోం మంత్రి

image

AP: పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి మాజీ సీఎం జగన్ రూ.25 లక్షలు ఖర్చు చేశారని హోం మంత్రి అనిత ఆరోపించారు. హెలికాప్టర్‌లో జగన్ నెల్లూరు జైలుకు వెళ్లారన్నారు. పిన్నెల్లిని కలిసేందుకు ములాఖత్‌లు అయిపోయినా.. మానవతా దృక్పథంతో జగన్‌కు అనుమతిచ్చామన్నారు. పిన్నెల్లి ఈవీఎంలు పగులగొట్టడం, దాడులు చేయడం సీసీ టీవీల్లో రికార్డయ్యాయని.. అయినా జగన్ అక్రమంగా అరెస్ట్ చేశారనడం దారుణమన్నారు.

News July 5, 2024

జులై 5: చరిత్రలో ఈరోజు

image

1927: నవలా రచయిత, జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత రావూరి భరద్వాజ జననం
1906: తెలుగు సినిమా నిర్మాత, దర్శకుడు ఘంటసాల బలరామయ్య జననం
1978: హీరో కళ్యాణ్ రామ్ జన్మదినం
1995: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి. సింధు జన్మదినం
2017: సంఘసేవకురాలు కంచర్ల సుగుణమణి మరణం
అంతర్జాతీయ సహకార సంఘ దినోత్సవం.

News July 5, 2024

BIG BREAKING: కాంగ్రెస్‌లో చేరిన ఆరుగురు ఎమ్మెల్సీలు

image

TG: బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆరుగురు BRS MLCలు కాసేపటి క్రితం CM రేవంత్ నివాసంలో కాంగ్రెస్‌లో చేరారు. MLCలు ప్రభాకర్ రావు, దండే విఠల్, దయానంద్, బస్వరాజు సారయ్య, భాను ప్రకాశ్, ఎగ్గే మల్లేశంలకు CM రేవంత్, ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఉదయం నుంచి అమావాస్య ఉండటంతో అర్ధరాత్రే పార్టీలో చేరారు. ఈ చేరికతో శాసనమండలిలో కాంగ్రెస్ బలం 12కి చేరింది.

News July 5, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: జులై 05, శుక్రవారం
ఫజర్: తెల్లవారుజామున 4:25 గంటలకు
సూర్యోదయం: ఉదయం 5:47 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:21 గంటలకు అసర్: సాయంత్రం 4:57 గంటలకు మఘ్రిబ్: సాయంత్రం 6:55 గంటలకు ఇష: రాత్రి 8.16 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News July 5, 2024

వైసీపీ మాజీ ఎమ్మెల్యేకు 14 రోజుల రిమాండ్

image

AP: కర్నూలు జిల్లా కోడుమూరు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత జరదొడ్డి <<13564155>>సుధాకర్‌<<>>కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను పోలీసులు జిల్లా జైలుకు తరలించారు. తన ఇంట్లో పని చేసే బాలికతో గతంలో సుధాకర్ అసభ్యంగా ప్రవర్తించిన వీడియో వైరల్ కావడంతో ఇటీవల టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇవాళ ఉదయం ఆయనను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పర్చారు.

News July 5, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News July 5, 2024

ఎయిర్‌పోర్టు నుంచి ఇంటికి బయల్దేరిన సీఎం రేవంత్

image

AP: ఢిల్లీ నుంచి సీఎం రేవంత్ శంషాబాద్ ఎయిర్ పోర్టుకి చేరుకున్నారు. అక్కడ నుంచి ఇంటికి బయల్దేరారు. కాసేపట్లో ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఆయన సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఇప్పటికే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి సీఎం ఇంటికి చేరుకున్నారు.

News July 5, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.