News January 9, 2025

డ్రెస్సులపై కామెంట్స్.. హీరోయిన్ ఘాటు రిప్లై

image

హీరోయిన్ హనీరోజ్‌ను వేధించిన బాబీని పోలీసులు <<15102782>>అరెస్టు చేయగా<<>>, మలయాళ కామెంటేటర్ రాహుల్ ఈశ్వర్ అతనికి మద్దతుగా నిలిచారు. ఆమె ధరించే డ్రెస్సులపై విమర్శిస్తూ ఇలాంటి కామెంట్స్ సమాజంలో సహజమేనన్నారు. దీనిపై హీరోయిన్ ఫైరయ్యారు. ‘మీకు భాషపై పట్టుంది. కానీ మహిళల దుస్తుల విషయంలో మాత్రం కంట్రోల్ తప్పుతున్నారు. ఎలాంటి వస్త్రధారణ మీ స్వీయనియంత్రణకు భంగం కలిగిస్తుందో ఎవరు అంచనా వేయగలరు?’ అని ప్రశ్నించారు.

News January 9, 2025

కాసేపట్లో చంద్రబాబు ప్రెస్‌మీట్

image

తిరుపతి తొక్కిసలాట ఘటనపై TTD అధికారులతో AP CM చంద్రబాబు సమీక్ష ముగిసింది. దేవస్థాన అధికారుల పనితీరుపై సీఎం అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అటు భేటీ వివరాలను కాసేపట్లో ప్రెస్‌మీట్‌లో చంద్రబాబు వెల్లడించే అవకాశముంది.

News January 9, 2025

Rs.3961CR బకాయిలు: TGపై గ్లోబల్ లిక్కర్ కంపెనీల ఒత్తిడి

image

బకాయిలు వెంటనే చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వంపై గ్లోబల్ ఆల్కహాల్ కంపెనీలు ఒత్తిడి తెస్తునట్టు తెలిసింది. డియాజియో, పెర్నాడ్ రికార్డ్, కాల్స్‌బర్గ్ వంటి కంపెనీలకు ప్రభుత్వం $466m (Rs.3961CR) బాకీ పడింది. దీంతో ఎన్నడూలేని విధంగా Heineken ఈ వారం ఆల్కహాల్ సరఫరాను సస్పెండ్ చేసినట్టు సమాచారం. రూ.900 కోట్ల బకాయిలు చెల్లించకపోవడంతో కింగ్‌ఫిషర్ బీర్లు ఉత్పత్తి చేసే UBL సరఫరాను బంద్ చేయడం తెలిసిందే.

News January 9, 2025

రేపు కలెక్టర్లతో సీఎం రేవంత్ సమావేశం

image

TG: సీఎం రేవంత్ రెడ్డి రేపు మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో కలెక్టర్లతో భేటీ కానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి తర్వాత పలు పథకాలను ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతు భరోసా, రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు విషయంలో ఆయన వారితో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

News January 9, 2025

INDIA కూటమి కేవలం లోక్‌సభ ఎన్నికల కోసమే: కాంగ్రెస్

image

ఇండియా కూట‌మి కేవ‌లం లోక్‌స‌భ ఎన్నిక‌ల కోసం ఏర్పాటైంది త‌ప్ప, అసెంబ్లీ ఎన్నిక‌లకు ఉద్దేశించిన‌ది కాద‌ని కాంగ్రెస్ స్ప‌ష్టం చేసింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో INDIA మిత్ర‌ప‌క్షాలు ఆప్‌న‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తూ కాంగ్రెస్‌ను ప‌ట్టించుకోక‌పోవ‌డంతో కూట‌మి కుదేలైన‌ట్టే అనే విమ‌ర్శ‌లు వినిపించాయి. ఢిల్లీలో పార్టీకి ఏళ్లుగా ఉన్న ప‌ట్టు వ‌ల్ల‌ ఒంటరిగా బ‌రిలో దిగాలని కోరుకుంటున్నట్టు INC పేర్కొంది.

News January 9, 2025

భూకంపం తర్వాత 646 ప్రకంపనలు

image

ఈ నెల 7న టిబెట్-నేపాల్ రీజియన్‌లో 7.1 తీవ్రతతో వచ్చిన భూకంపం ధాటికి దాదాపు 126 మంది చనిపోగా, 188 మంది గాయపడ్డారు. భూకంపం తర్వాత నిన్న మధ్యాహ్నం వరకు ఏకంగా 646 ప్రకంపనలు సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో నివాసాలు కూలిపోయి వేలాది మంది నిరాశ్రయులయ్యారని తెలిపారు. ప్రస్తుతం వారికి 4,300 టెంట్లను సరఫరా చేసినట్లు పేర్కొన్నారు.

News January 9, 2025

అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పా: KTR

image

TG: ఫార్ములా-ఈ రేసింగ్ కేసు విచారణలో భాగంగా ఏసీబీకి సహకరించినట్లు మాజీ మంత్రి కేటీఆర్ విచారణ అనంతరం వెల్లడించారు. వాళ్లు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానని తెలిపారు. మళ్లీ ఎన్నిసార్లు విచారణకు పిలిచినా వెళ్తానని మాజీ మంత్రి స్పష్టం చేశారు. ఇది లొట్టపీసు కేసు అని, ఎలాంటి అవినీతి లేదని KTR మరోసారి ఉద్ఘాటించారు.

News January 9, 2025

ముగిసిన కేటీఆర్ విచారణ

image

TG: ఫార్ములా-ఈ రేసు కేసులో మాజీ మంత్రి KTRపై ఏసీబీ అధికారుల విచారణ ముగిసింది. అనుమతులు, నిధుల బదీలీ వంటి అంశాలపై ఆయన్ను అధికారులు సుమారుగా 7 గంటల పాటు ప్రశ్నించారు. ఏసీబీ జాయింట్ డైరెక్టర్, ఏసీపీ, సీఐ ఈ విచారణలో పాల్గొన్నారు. కేటీఆర్ తరఫు న్యాయవాదిని పక్క గది వరకు అనుమతించారు.

News January 9, 2025

ఇందిరమ్మ ఇళ్లపై BIG UPDATE

image

TG: ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి గ్రీవెన్స్ మాడ్యూల్‌ను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సచివాలయంలో ప్రారంభించారు. ఇళ్ల ఎంపికలో ఏమైనా సమస్యలు ఎదురైతే <>indirammaindlu.telangana.gov.in<<>>కు ఫిర్యాదు చేయాలని సూచించారు. గ్రామాల్లో MPDO, పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్ ద్వారా అధికారులకు ఫిర్యాదులు వెళ్తాయన్నారు. మొదట నివాస స్థలం ఉన్న వారికి ఇళ్లు నిర్మిస్తామని, 2వ దశలో స్థలంతో పాటు ఇళ్లు నిర్మిస్తామన్నారు.

News January 9, 2025

సీఎం చంద్రబాబుతో టీటీడీ ఛైర్మన్ భేటీ

image

AP: సీఎం చంద్రబాబుతో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు సమావేశమయ్యారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో జరుగుతున్న ఈ భేటీలో నిన్న రాత్రి జరిగిన తొక్కిసలాట ఘటనపై ప్రధానంగా చర్చిస్తున్నారు. అలాగే రానున్న రోజుల్లో వైకుంఠ ఏకాదశి సందర్భంగా టోకెన్లు జారీ చేసే ప్రక్రియలో మార్పులు చేసే అవకాశం ఉంది. ఈ సమావేశంలో టీటీడీ ఈవో, కలెక్టర్, ఎస్పీ, టీటీడీ జేఈవోలు పాల్గొన్నారు.