News January 9, 2025

కేంద్రం నుంచి నిధుల విషయంలో నో క్లారిటీ: కర్ణాటక

image

కేంద్రం గత ఏడాది 70 ఏళ్లు దాటిన వారికి ఆయుష్మాన్ భారత్(ABPMJAY) పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ప్రకారం ఇంట్లో 70 ఏళ్లు దాటిన వారు ఇద్దరు ఉన్నా ఈ పథకం వర్తిస్తుంది. కాగా ఈ పథకానికి నిధుల కేటాయింపు విషయంలో కేంద్రం నుంచి ఎలాంటి స్పష్టత లేదని పలు రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి. వీటిలో కర్ణాటక కూడా ఉండగా కేంద్రం నుంచి క్లారిటీ లేకనే పథకం అమలు చేయట్లేదని పేర్కొంది.

News January 9, 2025

ఆ హీరోతో మల్టీస్టారర్ చేస్తా: రామ్ చరణ్

image

సీనియారిటీ పరంగా సూపర్ స్టార్ మహేశ్ బాబుతో మల్టీస్టారర్ చేస్తానని హీరో రామ్ చరణ్ చెప్పారు. ఇప్పటికే ఈ హీరో ఎన్టీఆర్‌తో RRRలో నటించిన సంగతి తెలిసిందే. ఓ షోలో RC తన ఇష్టాయిష్టాలను వెల్లడించారు. తనతో నటించిన హీరోయిన్లలో సమంత బెస్ట్ అని తెలిపారు. అక్కాచెల్లెళ్లలో తనకు సుస్మిత అక్క అంటే ఇష్టమని పేర్కొన్నారు. భార్య ఉపాసన అంటే భయం లేకున్నా ఉన్నట్లుగా నటిస్తానని అన్నారు.

News January 9, 2025

నేడు తిరుపతికి పవన్ కళ్యాణ్

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ మధ్యాహ్నం తిరుపతి వెళ్లనున్నారు. తొక్కిసలాటలో గాయపడిన బాధితులను ఆయన పరామర్శిస్తారు. పవన్ తిరుమల వెళ్లేందుకు ఇవాళ్టి తన పర్యటనలు అన్నీ రద్దు చేసుకున్న విషయం తెలిసిందే.

News January 9, 2025

తిరుపతి ఘటనపై రాష్ట్రపతి దిగ్భ్రాంతి

image

తిరుపతిలో టికెట్ల జారీ కేంద్రాల వద్ద తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మరణాలు చోటు చేసుకోవడం బాధించినట్లు ట్వీట్ చేశారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాగా ఈ ఘటనలో ఆరుగురు మరణించగా 40 మంది గాయపడ్డారు.

News January 9, 2025

మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్?

image

TG: అభయహస్తం పథకంలోని రూ.385 కోట్ల నిధులను మహిళలకు తిరిగివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. 2009లో అభయహస్తం పథకంలో భాగంగా మహిళలు రోజుకు రూపాయి చొప్పున ఆరేళ్లపాటు చెల్లించారు. ఈ నిధులను గత ప్రభుత్వం ఇతర అవసరాలకు వినియోగించినట్లు సర్కార్ గుర్తించింది. 2022 నాటికి ఆ డబ్బులు వడ్డీతో కలిపి రూ.545 కోట్లకు చేరాయి. ఇప్పుడు వీటిని తిరిగివ్వాలని రేవంత్ సర్కార్ యోచిస్తున్నట్లు సమాచారం.

News January 9, 2025

పవన్, లోకేశ్ పర్యటనలు రద్దు

image

AP: తిరుమల తొక్కిసలాట ఘటన నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లా పర్యటన రద్దు అయింది. గ్రీన్ కో రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టును పవన్ పరిశీలించాల్సి ఉంది. అలాగే అనివార్య కారణాల వల్ల మంత్రి నారా లోకేశ్ కర్నూలు పర్యటన కూడా రద్దైనట్లు అధికారులు తెలిపారు. లోకేశ్ ఇవాళ కర్నూలులో పలు కళాశాలల సందర్శనతోపాటు మంత్రి భరత్ కుమార్తె రిసెప్షన్‌ వేడుకల్లో పాల్గొనాల్సి ఉంది.

News January 9, 2025

టీమ్ ఇండియాకు గుడ్ న్యూస్?

image

వన్డే వరల్డ్ కప్‌లో తర్వాత గాయంతో క్రికెట్‌కు దూరమైన మహ్మద్ షమీ తిరిగి జట్టుతో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగే వన్డే సిరీస్‌లో ఆయన రీఎంట్రీ ఇస్తారని క్రిక్ బజ్ కథనం పేర్కొంది. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లోనే ఆయన ఆడుతారని భావించినా ఫిట్‌నెస్ లేమితో జట్టులోకి రాలేదు. ఇంగ్లండ్‌తో సిరీస్‌కు బుమ్రాకి రెస్ట్ ఇవ్వడంతో షమీ టీమ్‌లోకి వస్తే భారత బౌలింగ్ పటిష్ఠం కానుంది.

News January 9, 2025

తొక్కిసలాటకు కారణం అదే: టీటీడీ ఈవో

image

AP: డీఎస్పీ గేటు తీసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే తొక్కిసలాట ఘటన జరిగి ఉంటుందని టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడించారు. దీనిపై విచారణ తర్వాత పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉందన్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందుతోందని స్విమ్స్ వైద్యులు చెప్పారు. ఎవరి ప్రాణాలకూ ముప్పు లేదని, 2-3 రోజుల్లో అందరూ డిశ్చార్జ్ అవుతారని తెలిపారు.

News January 9, 2025

తిరుపతి తొక్కిసలాట.. సీఎం రాజీనామా చేయాలి: రోజా

image

AP: తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఆరుగురి చావుకు కారణమైన సీఎం చంద్రబాబు వెంటనే రాజీనామా చేయాలని వైసీపీ నేత రోజా డిమాండ్ చేశారు. అధికార యంత్రాంగాన్ని సీఎం పర్యటనకు వినియోగించుకున్నారని మండిపడ్డారు. ప్రభుత్వానికి సామాన్యులంటే ఇంత నిర్లక్ష్యమా అని ప్రశ్నించారు. ఈ ఘటనలో టీటీడీ ఛైర్మన్, ఈవో, ఎస్పీ, ఇతర అధికారులపై కేసు నమోదు చేయాలన్నారు. దీనిపై ఉన్నత స్థాయి విచారణ జరపాలన్నారు.

News January 9, 2025

ఈ నెల 25 తర్వాత సేవలన్నీ నిలిపేస్తాం: ఆశా

image

AP: బకాయిలు చెల్లించకపోతే NTR వైద్య సేవ నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో ఈ నెల 25 తర్వాత వైద్య సేవలన్నీ నిలిపేస్తామని ఏపీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆశా) తెలిపింది. ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్‌తో జరిగిన భేటీలో ఆశా ప్రతినిధులు మాట్లాడుతూ రూ.500కోట్లు విడుదల చేయడం వల్ల ప్రయోజనం ఉండదని, రూ.1000కోట్లు విడుదల చేస్తేనే ఆందోళన విరమిస్తామన్నారు. 6వ తేదీ నుంచి ఓపీ, EHS సేవలు నిలిపేసిన విషయం తెలిసిందే.