News June 16, 2024

త్వరలోనే వాస్తవాలు బయటపడతాయి: యడియూరప్ప

image

అనవసరమైన గందరగోళాన్ని సృష్టించేందుకే తనపై పోక్సో <<13434208>>కేసు<<>> నమోదు చేశారని కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప అన్నారు. త్వరలోనే ఈ కేసులో వాస్తవాలు బయటపడతాయని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 17న CID విచారణకు హాజరవుతానని చెప్పారు. ఈ కేసులో తాను ఎవరిని తప్పుపట్టడం లేదని, కాలమే అన్నింటిని నిర్ణయిస్తుందని తెలిపారు. తనపై కుట్రలు చేసిన వారికి ప్రజలే బుద్ధి చెప్తారని పేర్కొన్నారు.

News June 16, 2024

జూన్ 16: చరిత్రలో ఈరోజు

image

*1963: అంతరిక్షంలో ప్రయాణించిన తొలి మహిళగా వాలంటీనా తెరిస్కోవా(సోవియట్ యూనియన్) రికార్డు.
*1917: తెలుగు కవి నముడూరు అప్పలనరసింహం జననం.
*1949: సంస్కృత పండితుడు విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి జననం.
*1950: బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి జననం.
*1905: రచయిత మల్లాది రామకృష్ణశాస్త్రి జననం.

News June 16, 2024

వారి పెళ్లిలో పాత్రలు కడిగాడు.. కట్ చేస్తే

image

‘పంచాయత్’ వెబ్ సిరీస్‌తో పేరు తెచ్చుకున్న నటుడు ఆసిఫ్ ఖాన్ తన జీవితంలో సినిమా కష్టాలు పడినట్లు తెలిపారు. సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ పెళ్లి జరిగిన హోటల్లో పాత్రలు కడిగినట్లు పాడ్ కాస్ట్‌లో చెప్పుకొచ్చారు. కెరీర్ ప్రారంభంలో కాస్టింగ్ ఏజెంట్లు తనను అవమానపరిచారని గుర్తు చేశారు. సినీ పరిశ్రమలోకి వచ్చిన తొలినాళ్లలో కాస్టింగ్ డైరెక్టర్‌గా, సూపర్ స్టార్ల సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్‌గానూ చేసినట్లు తెలిపారు.

News June 16, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News June 16, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: జూన్ 16, ఆదివారం
ఫజర్: తెల్లవారుజామున 4:20 గంటలకు
సూర్యోదయం: ఉదయం 5:42 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:17 గంటలకు
అసర్: సాయంత్రం 4:54 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6:52 గంటలకు
ఇష: రాత్రి 8.14 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News June 16, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News June 16, 2024

శుభ ముహూర్తం

image

తేది: జూన్ 16, ఆదివారం జ్యేష్ఠమాసం
శు.దశమి: తెల్లవారుజామున 04:43 గంటలకు
హస్త: ఉ.11:12 గంటలకు
దుర్ముహూర్తం: సా.04:53-05:45గంటల వరకు
వర్జ్యం: రా.08:05-09:51 గంటల వరకు

News June 16, 2024

TODAY HEADLINES

image

➥AP:నామినేటెడ్ పోస్టులు త్వరలో భర్తీ చేస్తాం: CM చంద్రబాబు
➥AP:త్వరలో కొత్త ఐటీ పాలసీ: నారా లోకేశ్
➥రెండున్నరేళ్లలో అమరావతిని నిర్మిస్తాం: మంత్రి నారాయణ
➥టీడీపీ-వైసీపీ మధ్య ‘ఫర్నిచర్’ వార్
➥TG: హోంగార్డుల నియామకం చేపట్టాలి: సీఎం రేవంత్
➥TG:రాజకీయ కక్షతోనే ఈఆర్సీ కమిషన్: KCR
➥TG:రాష్ట్రంలో 20 మంది ఐఏఎస్‌ల బదిలీ
➥T20WC: వర్షం కారణంగా భారత్-కెనడా మ్యాచ్ రద్దు

News June 16, 2024

త్వరలో వందేభారత్ స్లీపర్ ట్రయల్ రన్

image

వందేభారత్ స్లీపర్ రైళ్లను తీసుకొచ్చే ప్రక్రియను రైల్వే వేగవంతం చేసింది. ఈ ఏడాది ఆగస్టుకల్లా ఈ రైళ్ల ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు వందేభారత్‌లో సీటర్లు మాత్రమే ఉన్న సంగతి తెలిసిందే. స్లీపర్ బెర్తులతో కూడిన రైళ్లు అందుబాటులోకి వస్తే దూర ప్రయాణాలు చేసేవారు పడుకునేందుకు వీలు కలగనుంది. వీటిలో సేవలు మరింత అత్యున్నతంగా ఉంటాయని అధికారులు చెబుతున్నారు.

News June 15, 2024

ఎన్డీఏ ప్రభుత్వం.. మూడు చక్రాల రిక్షా: ఉద్ధవ్ ఠాక్రే

image

కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం మూడు చక్రాల రిక్షా మాదిరి ఉందని శివసేన(UBT) అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఎద్దేవా చేశారు. గతంలో మహారాష్ట్రలో తమ మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని ఇదే విధంగా బీజేపీ పోల్చిందని.. ఇప్పుడు వాళ్లదీ అదే పరిస్థితి అని అన్నారు. ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నాళ్లు అధికారంలో ఉంటుందో తెలియదన్నారు. గతంలో తమ పార్టీని విడిచి వెళ్లిన నేతలను తిరిగి చేర్చుకోబోమని తేల్చి చెప్పారు.