India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
లాయర్‌తో ACB విచారణకు హాజరు అయ్యేందుకు అనుమతించాలన్న KTR వినతిని హైకోర్టు తోసిపుచ్చింది. లాయర్‌ను ఆయనతో పాటు కూర్చోబెట్టలేమని స్పష్టం చేసింది. దూరంగా ఉండి లాయర్ గమనించేందుకు మాత్రం పర్మిషన్ ఇస్తామని KTR లంచ్ మోషన్ పిటిషన్‌పై విచారణలో తెలిపింది. వెంట వెళ్లే ముగ్గురు లాయర్ల పేర్లను ఇవ్వాలని మాజీ మంత్రి కౌన్సిల్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను సాయంత్రం గం.4కు వాయిదా వేసింది.
తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం పథకాన్ని అమలు చేసేందుకు ఇంటర్ విద్యా కమిషనరేట్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఈనెలలోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలను సమర్పించనున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని 424 జూనియర్ కళాశాలల్లో లక్షన్నరకు పైగా స్టూడెంట్స్ చదువుతున్నారు. కాగా ఏపీలోని జూనియర్ కాలేజీల్లో ఇటీవలే ఈ స్కీమ్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే.
TG: అల్లు అర్జున్ విడుదలకు సంబంధించి జైళ్ల శాఖలో ఎలాంటి లోపం లేదని డీజీ సౌమ్య మిశ్రా స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారమే ఆయనను రిలీజ్ చేశామన్నారు. గత నెల 13న బన్నీని పోలీసులు అరెస్ట్ చేయగా, అదే రోజు కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మధ్యంతర బెయిల్ ఆన్‌లైన్‌లో ఆలస్యంగా అప్‌లోడ్ కావడంతో ఆయనను ఆ రోజు రాత్రి జైల్లోనే ఉంచి తర్వాతి రోజు విడుదల చేశారు. దీంతో పోలీసులు కావాలనే అలా చేశారని ఆరోపణలు వచ్చాయి.
అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇన్‌స్టా పోస్ట్ వైరలవుతోంది. కెనడా పీఎంగా జస్టిన్ ట్రూడో రాజీనామా చేయడంతో ‘ఓహ్ కెనడా’ అంటూ ఓ మ్యాప్‌ను షేర్ చేశారు. ఇది అమెరికాలో కెనడా విలీనం అయినట్లు ఉంది. కెనడా విస్తీర్ణం 99.84 లక్షల చదరపు కిలోమీటర్లు కాగా, USAది 98.33 లక్షలు. ఈ రెండు కలిస్తే 1.98 కోట్ల చ.కి.మీల విస్తీర్ణంతో అమెరికా ప్రపంచంలోనే అతిపెద్దదిగా మారనుంది. ప్రస్తుతం రష్యా విస్తీర్ణంలో అతిపెద్దది.
AP: కార్యకర్తలను వేధించిన వారిని చట్టం ముందు నిలబెడతామని వైసీపీ అధినేత జగన్ అన్నారు. కార్యకర్తలను ఇప్పటివరకు ఒకలా చూశాం.. ఇకపై మరోలా చూసుకుంటామని చెప్పారు. జెండా మోసిన వారందరికీ భరోసాగా ఉంటామన్నారు. ఇవాళ తాడేపల్లిలో నెల్లూరు జిల్లా వైసీపీ నేతలతో జగన్ సమావేశమయ్యారు. ప్రభుత్వ వ్యతిరేకత రావడానికి కనీసం ఏడాదైనా పడుతుందని కానీ ఆరు నెలలకే కూటమి ప్రభుత్వం తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటోందన్నారు.
TG: సీఎం ఆదేశాలతో రూ.2,600 కోట్లతో గ్రామీణ రహదారులు నిర్మిస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు. కొత్త రహదారుల నిర్మాణ అంచనాలు పక్కాగా ఉండాలని, ఇష్టారీతిన అంచనాలను సవరించొద్దని స్పష్టం చేశారు. పనులు సరిగా చేయని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెడతామని, నాసిరకం పనులకు ఎన్ఓసిలిచ్చే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహానగరాల్లో రోడ్లు మెరిసినట్టుగానే పల్లెల్లోనూ రహదారులు మెరవాలన్నారు.
మన్మోహన్‌ను పట్టించుకోకుండా రాజ్‌ఘాట్లో ప్రణబ్‌ముఖర్జీకి స్మారకం నిర్మించడం BJP డర్టీ పాలిటిక్స్‌కు నిదర్శనమని కాంగ్రెస్ MP డానిష్ అలీ విమర్శించారు. ఇది దేశ ఎకానమీని సంస్కరించిన MMSను అవమానించడమేనని అన్నారు. సంఘ్‌పై ప్రేమ వల్లే ప్రణబ్‌కు స్మారకం నిర్మిస్తున్నారని ఆరోపించారు. RSS ఫౌండర్ హెగ్డేవార్‌ను ఆయన ‘ధర్తీపుత్ర’గా కీర్తించారని, సావర్కర్ చిత్రాన్ని పార్లమెంటులో పెట్టించారని విమర్శించారు.
‘ప్రీమియం రేట్ సర్వీస్ స్కామ్’పై యూజర్లకు రిలయన్స్ జియో వార్నింగ్ ఇచ్చింది. +91 మినహా మరే ప్రిఫిక్స్‌తో ఇంటర్నేషనల్ కాల్స్ వచ్చినా జాగ్రత్తపడాలని ఈమెయిల్స్ పంపింది. రీసెంటుగా ISD నంబర్లతో మిస్డ్ కాల్స్ వస్తున్నాయి. ఆత్రుత కొద్దీ కాల్ బ్యాక్ చేస్తే నిమిషానికి రూ.200-300 వరకు ఛార్జ్ అవుతోంది. స్కామర్లు కస్టమర్ల జేబులకు ఇలా కత్తెరేస్తుండటంతో ఇంటర్నేషనల్ కాల్ బ్లాకింగ్ పెట్టుకోవాలని JIO సూచించింది.
TG: మాజీ మంత్రి KTRపై ఏసీబీకి మరో ఫిర్యాదు అందింది. రూ.7,380 కోట్ల ORR టోల్ టెండర్లలో అవినీతి జరిగిందని వనపర్తి జిల్లా వాసి యుగంధర్ ఫిర్యాదు చేశారు. క్విడ్ ప్రో కో జరిగిందని ఆరోపించారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదే వ్యవహారంపై KTRతో పాటు KCRపైనా ఈడీకి ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఫార్ములా-ఈ కేసులో కేటీఆర్ A-1గా ఉన్నారు.
ఉన్నత విద్యాసంస్థల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాలు, పదోన్నతులకు తప్పనిసరి అయిన నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్(NET)ను తొలగించాలని UGC సిఫార్సు చేసింది. స్టాఫ్ నియామకాలకు సంబంధించి డ్రాఫ్ట్ ముసాయిదా నిబంధనలను రిలీజ్ చేసింది. FEB 5లోపు వీటిపై అభిప్రాయాన్ని సమర్పించాలని స్టేక్ హోల్డర్లను కోరింది. కొత్త రూల్స్ ప్రకారం NET రాయకుండానే ME/MTECHలో 55% మార్క్స్ సాధించిన వారు స్టాఫ్ పోస్టులకు అర్హత సాధిస్తారు.
Sorry, no posts matched your criteria.