News March 21, 2024

TODAY HEADLINES

image

* AP: చంద్రబాబు రాజకీయ వికలాంగుడు: మంత్రి పెద్దిరెడ్డి
* వైసీపీని ఇంటికి సాగనంపాలి: చంద్రబాబు
* జగన్, ఆయన సైన్యానికి ఇవే ఆఖరి రోజులు: లోకేశ్
* పవన్ ఎంపీగా పోటీచేస్తే పిఠాపురం నుంచి బరిలోకి దిగుతా: SVSN శర్మ
* TG: నష్టపోయిన రైతులను ఆదుకుంటాం: మంత్రి తుమ్మల
* లోక్‌సభ ఎన్నికల ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో పలు ఎంట్రన్స్ పరీక్షలు వాయిదా

News March 20, 2024

త్వరగా నిద్ర రావాలంటే..

image

నిద్రలేమితో చాలా రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. రాత్రి 7-9 గంటల నిద్ర అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.
*గది శుభ్రంగా ఉండాలి. దోమలు రాకుండా చూడాలి
*పది నిమిషాలు నచ్చిన పుస్తకం చదవండి. శ్రావ్యమైన సంగీతం వినండి
*నిద్ర పోవడానికి గంట ముందే ఫోన్ పక్కనపెట్టేయండి
*అనవసరమైన ఆలోచనలు పెట్టుకోకండి
*రాత్రిపూట కాఫీ, టీ తాగొద్దు.

News March 20, 2024

72 గంటల పాటు కేవలం నీళ్లు, బ్లాక్ కాఫీనే తాగా : పృథ్వీరాజ్

image

సినీ నటుడు పృథ్వీరాజ్ కీలక పాత్రలో తెరకెక్కిన సినిమా ‘ఆడు జీవితం: ది గోట్ లైఫ్’. ఈ నెల 28న ఈ మూవీ థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా కోసం 31 కేజీల బరువు తగ్గిన పృథ్వీ.. కొన్ని సార్లు 72 గంటల పాటు ఆహారం తీసుకోకుండా ఉన్నట్లు తెలిపారు. ఆ సమయంలో కొన్ని మంచినీళ్లు, బ్లాక్ కాఫీ మాత్రమే తాగినట్లు పేర్కొన్నారు. శారీరకంగా మార్పు రావడానికి మానసికంగా సిద్ధంగా ఉండాలని చెప్పారు.

News March 20, 2024

ఇతరులతో పోలిస్తే ఆయన డిఫరెంట్: జహీర్

image

టీమ్ ఇండియా మాజీ సారథి ధోనీ ఆలోచించకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోడని మాజీ బౌలర్ జహీర్ ఖాన్ అన్నారు. ఇతర ఆటగాళ్లతో పోలిస్తే ధోనీ డిఫరెంట్ అని చెప్పారు. రిటైర్మెంట్ తర్వాత ఏం చేయాలో ముందే నిర్ణయించుకున్నాడని తెలిపారు. జీవితంలో క్రికెట్ ఓ భాగమేనని గుర్తించి.. అందుకు అనుగుణంగా తన జీవితాన్ని తీర్చిదిద్దుకున్నాడన్నారు.

News March 20, 2024

తండ్రిని మోసం చేసిన కూతురు

image

రాజస్థాన్‌లో ఓ యువతి కిడ్నాప్ వ్యవహారం తల్లిదండ్రులతో పాటు పోలీసులకు చెమటలు పట్టించింది. శివ్‌పురికి చెందిన కావ్య స్నేహితులతో కలిసి ఫారిన్ ట్రిప్ వెళ్లేందుకు డబ్బులు లేకపోవడంతో డ్రామాకు తెరతీసింది. చేతులకు కట్లు వేయించుకుని తండ్రికి ఫొటోలు పంపి బెదిరించింది. రూ.30 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. కేంద్రమంత్రి సింధియా సైతం ఆ యువతిని త్వరగా కాపాడాలని పోలీసులను ఆదేశించారు. చివరకు నాటకం బయటపడింది.

News March 20, 2024

100 రోజుల్లోనే రూ.16,400 కోట్ల అప్పు: BRS

image

TG: రేవంత్ రెడ్డి సర్కారు 100 రోజుల్లోనే రూ.16,400 కోట్ల అప్పు చేసిందని BRS విమర్శించింది. ‘తెచ్చిన అప్పులన్నీ ఎక్కడికి పోతున్నయ్? కాంగ్రెస్ ఖజానాలోకా.. లేక రేవంత్ జేబులోకా?’ అని ట్వీట్ చేసింది. ఇన్ని కోట్ల అప్పులు చేసినా పూర్తిస్థాయిలో రైతుబంధు అందజేయలేదని, పెన్షన్లు పెంచలేదని పోస్ట్ చేసింది.

News March 20, 2024

సర్ఫరాజ్ తండ్రితో నేను క్రికెట్ ఆడా: రోహిత్

image

టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. తన చిన్నతనంలో సర్ఫరాజ్ ఖాన్ తండ్రి నౌషద్ ఖాన్‌తో కలిసి కంగా లీగ్‌లో ఆడానని తెలిపారు. సర్ఫరాజ్ తండ్రి ఆ సమయంలో చాలా ఫేమస్ అని గుర్తు చేశారు. సర్ఫరాజ్‌ను ఈ స్థాయికి తీసుకొచ్చేందుకు సూచనలు ఇచ్చిన ఆయనకు రోహిత్ అభినందనలు తెలిపారు.

News March 20, 2024

‘లెజెండ్’ మళ్లీ వస్తోంది

image

టాలీవుడ్‌లో రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతోంది. గతంలో సూపర్ హిట్ కొట్టిన సినిమాలు ఇప్పుడు బాక్సాఫీసు వద్ద మళ్లీ రిలీజ్ అయి సందడి చేస్తున్నాయి. నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన ‘లెజెండ్’ చిత్రం తాజాగా రీరిలీజ్‌కు సిద్ధమైంది. ఈ నెల 30న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. 2014 ఎన్నికలకు ముందు విడుదలైన ఈ చిత్రం పొలిటికల్ డైలాగ్‌లతో భారీ హిట్ కొట్టిన విషయం తెలిసిందే.

News March 20, 2024

క్యాన్సిల్ టికెట్లతో వందల కోట్ల ఆదాయం

image

వెయిటింగ్ లిస్ట్‌లో ఉండి క్యాన్సిల్ అయిన టికెట్ల ద్వారా భారత రైల్వేకు వందల కోట్లలో ఆదాయం వస్తోంది. 2021 నుంచి జనవరి 2024 వరకు ఈ క్యాన్సిల్ అయిన టికెట్ల ద్వారా రైల్వే శాఖకు ఏకంగా రూ.1229.85 కోట్ల ఆదాయం సమకూరిందట. ఈ సమయంలో 128 మిలియన్ల కంటే ఎక్కువ వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్‌లు రద్దయ్యాయి. ఈ విషయం సమాచార హక్కు చట్టం ద్వారా వెల్లడైంది. పండుగల సమయంలోనే రైల్వే ఖజానాకు రూ.కోట్లలో ఆదాయం వచ్చింది.

News March 20, 2024

IPL 2024: సూర్య స్థానంలో ఆడేది ఎవరు?

image

NCA ఫిట్‌నెస్ టెస్టులో ఫెయిలైన సూర్య కుమార్ యాదవ్‌కు రేపు మరోసారి టెస్ట్ జరగనుంది. ఒకవేళ అతను ఫిట్‌నెస్ నిరూపించుకోలేకపోతే IPL సీజన్ మొత్తానికి దూరం కానున్నారు. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ తుది జట్టులో అతడి స్థానంలో ఎవరాడుతారనే దానిపై చర్చ మొదలైంది. నేహాల్ వధేరా, విష్ణు వినోద్‌లలో ఒకరికి చోటు దక్కే అవకాశముంది. గత సీజన్‌లో రాణించిన వధేరాకే మొగ్గు చూపే ఛాన్సుందని క్రీడావర్గాలు చెబుతున్నాయి.