News June 9, 2024

కూటమికి 57%, వైసీపీకి 28% పోస్టల్ ఓట్లు

image

AP: రాష్ట్రంలోని 25 MP సెగ్మెంట్లలో 5.24 లక్షల పోస్టల్ ఓట్లు పోలవగా, ఇందులో 4.14 లక్షల ఓట్లు ఎన్నికల విధుల్లోని ఉద్యోగులవి. వీటిలో అత్యధికంగా NDAకు 2.86 లక్షలు(57.10%), YCPకి 1.41 లక్షలు(28.11%), ఇండియా కూటమికి 30,386(6.05%) ఓట్లు దక్కాయి. దీన్నిబట్టి ఉద్యోగుల్లో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. పార్టీలకు నమోదైన పోస్టల్ ఓట్ వివరాలను పైన ఫొటోలో చూడొచ్చు.

News June 9, 2024

అప్పుడు 11thలో ఫెయిల్.. ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్

image

మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రియాల్ యాదవ్ ఇండోర్ డిప్యూటీ కలెక్టర్‌గా నియమితులయ్యారు. ఇటీవల విడుదలైన MPPSC ఫలితాల్లో ఆమె ఆరో ర్యాంక్ సాధించారు. రైతు బిడ్డ అయిన ఆమె తాను టెన్త్ వరకు స్కూల్ టాపర్ అని, 11వ తరగతిలో ఫిజిక్స్‌లో ఫెయిల్ అయ్యానని తెలిపారు. ఇప్పటివరకు లైఫ్‌లో అదే తన తొలి, చివరి ఫెయిల్యూర్ అని పేర్కొన్నారు. డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తూనే UPSC పరీక్షలకు ప్రిపేర్ అవుతానని చెప్పారు.

News June 9, 2024

ఇలాంటి అరాచకాలు దారుణం: YS షర్మిల

image

APలో YSR విగ్రహాలపై అల్లరి మూకలు చేస్తున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు రాష్ట్ర PCC చీఫ్ షర్మిల వెల్లడించారు. ‘ప్రజాస్వామ్యంలో ఇలాంటి అరాచకాలు అత్యంత దారుణం. ఇది పిరికిపందల చర్య. తెలుగు ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్న YSR పేరు చెరపలేని ఒక జ్ఞాపకం. అలాంటి నేతకు నీచ రాజకీయాలు, గెలుపు ఓటములు ఆపాదించడం తగదు. YSRను అవమానించే చర్యలకు పాల్పడేవారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి’ అని ఆమె డిమాండ్ చేశారు.

News June 9, 2024

డాక్టర్ చదువుపై విద్యార్థుల్లో క్రేజ్

image

డాక్టర్ అవ్వాలనుకునే యువత సంఖ్య దేశంలో గణనీయంగా పెరుగుతోంది. నీట్ పరీక్ష రాస్తున్న విద్యార్థుల సంఖ్య పెరుగుదలే ఇందుకు నిదర్శనం. 2019లో దేశంలో 15,19,375 మంది విద్యార్థులు నీట్‌కు అప్లై చేయగా 14,10,755 మంది పరీక్ష రాశారు. 2024 నాటికి రిజిస్ట్రేషన్లు 24,06,079కి చేరగా.. 23,33,297 మంది ఎగ్జామ్ రాశారు. 2019తో పోలిస్తే వీరి సంఖ్య 9,22,542 పెరిగింది. అంటే ఏడాదికి సగటున 1.53 లక్షల చొప్పున పెరగడం విశేషం.

News June 9, 2024

T20 WC: 39 రన్స్‌కే ఆలౌట్

image

టీ20 WCలో భాగంగా వెస్టిండీస్‌తో మ్యాచులో ఉగాండా 39 రన్స్‌కే ఆలౌటైంది. టీ20 WC చరిత్రలో ఇదే అత్యల్ప స్కోర్. 2014WCలో నెదర్లాండ్స్ 39 రన్స్ చేయగా, ఆ రికార్డును ఉగాండా ఇప్పుడు సమం చేసింది. కాగా తాజా మ్యాచులో వెస్టిండీస్ 134 రన్స్ తేడాతో గెలిచింది. ఆ జట్టు ప్లేయర్లలో చార్లెస్ 44, రస్సెల్ 30 రన్స్‌తో రాణించగా, అకేల్ హోసేన్ 5 వికెట్లతో అదరగొట్టారు.

News June 9, 2024

INDvsPAK: ఆ సీటుకు రీసేల్‌లో రూ.1.46 కోట్లు!

image

T20WCలో ఇవాళ న్యూయార్క్ వేదికగా IND-PAK మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. టికెట్లను రీసేల్‌కు పెడుతున్నారు. ఓ వ్యక్తి సెక్షన్ 252లోని 20వ వరుసలో 30వ సీటును ఏకంగా $1.75 లక్షల(₹1.46 కోట్లు)కు ఓ వెబ్‌సైట్‌లో బేరం పెట్టాడు. అయితే దాన్ని ఎవరూ కొనుగోలు చేయలేదు. కాగా నసావు స్టేడియంలో టికెట్ రేట్లు $1,500-$10,000 మధ్య ఉన్నాయి.

News June 9, 2024

రామ్మోహన్, పెమ్మసానికి కంగ్రాట్స్: గల్లా జయదేవ్

image

AP: TDP MPలు కింజారపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌లకు మాజీ MP గల్లా జయదేవ్ శుభాకాంక్షలు తెలిపారు. ‘కేంద్రమంత్రిగా ఎంపికైన రామ్మోహన్ నాయుడు, సహాయ మంత్రిగా ఎంపికైన పెమ్మసాని చంద్రశేఖర్ కొత్త బాధ్యతల్లో దేశాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తారని ఆశిస్తున్నా. ఎంపీగా గెలిచిన తొలిసారే దేశానికి సేవ చేయబోతున్న పెమ్మసానిని చూసి గుంటూరు, ఏపీ ప్రజలు గర్వపడుతున్నారు’ అని గల్లా Xలో పోస్ట్ చేశారు.

News June 9, 2024

తాళ్లూరు నువ్వులకు అంతర్జాతీయ గుర్తింపు

image

AP: ప్రకాశం(D) తాళ్లూరు నువ్వులకు అరుదైన గుర్తింపు దక్కింది. అంతర్జాతీయ స్థాయిలో 140 దేశాల్లో అమ్ముకునేందుకు అవసరమైన ఇండ్ గ్యాప్ సర్టిఫికెట్‌ను పొందింది. ఇటీవల శివరామపురం గ్రామానికి చెందిన రైతులు 150 క్వింటాళ్ల నువ్వులను ఎక్స్‌పోర్ట్ చేయగా, పరీక్షల్లో మంచి ఉత్పత్తులుగా నిర్ధారణ అయింది. గత రబీలో ఎకరాకు ₹12వేలు ఖర్చు పెట్టిన రైతులు మేలైన సాగు పద్ధతులతో ₹40 వేల నుంచి ₹50వేల వరకు దిగుబడి సాధించారు.

News June 9, 2024

టీడీపీకి 4 కేంద్ర మంత్రి పదవులు.. తెరపైకి కొత్త పేర్లు?

image

AP: కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో టీడీపీ కీలకంగా మారింది. దీంతో ఆ పార్టీకి కేంద్ర మంత్రి పదవులపై రోజుకొక అంశం తెరపైకి వస్తోంది. మోదీ 3.O కేబినెట్‌లో TDPకి 4 బెర్తులు దక్కొచ్చని NDTV పేర్కొంది. వారిలో రామ్మోహన్ నాయుడు(శ్రీకాకుళం), హరీశ్(అమలాపురం), దగ్గుమల్ల ప్రసాద్(చిత్తూరు) పేర్లు వినిపిస్తున్నాయని తెలిపింది. ఇవాళ మోదీ ప్రమాణస్వీకారం తర్వాత బెర్తులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది.

News June 9, 2024

మోదకొండమ్మ ఉత్సవాలు ప్రారంభం

image

AP: మన్యం దేవతగా విరాజిల్లుతున్న మోదకొండమ్మ ఉత్సవాలు పాడేరులో ప్రారంభమయ్యాయి. ఇవాళ తెల్లవారుజామున అమ్మవారి విగ్రహం, పాదాలను ఊరేగింపుగా తీసుకొచ్చి ప్రతిష్టించారు. నేటి నుంచి మూడు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించనున్నారు. భక్తులు పెద్దఎత్తున రానుండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనిని రాష్ట్ర గిరిజన జాతరగా గుర్తించింది.