News May 30, 2024

ఫలితాల తర్వాత విజయోత్సవ ర్యాలీలు నిర్వహించొద్దు: సీఈవో

image

AP: ఓట్ల లెక్కింపు సమయంలో అలజడులు సృష్టిస్తే తక్షణమే అరెస్ట్ చేస్తామని సీఈవో ముకేశ్ కుమార్ మీనా హెచ్చరించారు. రాజకీయ పార్టీల అభ్యర్థులు, ఏజెంట్లు ఈ విషయాన్ని గమనించాలన్నారు. మచిలీపట్నంలో ఏర్పాటు చేస్తున్న ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఫలితాల తర్వాత విజయోత్సవ ర్యాలీలు నిర్వహించొద్దని ఆదేశించారు. కొన్ని గ్రామాల్లో పోలీస్ పికెటింగ్ ఉంటుందని ఆయన తెలిపారు.

News May 30, 2024

రాచరికపు అవశేషమైన మీసాన్నీ కొరిగెయ్యండి: గంటా చక్రపాణి

image

తెలంగాణ రాష్ట్ర చిహ్నం, గేయాన్ని మార్చే నిర్ణయాన్ని ప్రొఫెసర్ గంటా చక్రపాణి తప్పుబట్టారు. రాష్ట్రంలో రాచరిక ఆనవాళ్లకు చోటు లేదని చెబుతూ సీఎం రేవంత్ వీటిని మారుస్తున్నారని చెప్పారు. అలాగే రాచరికపు అవశేషం, పౌరుషం ఫ్యూడలిజపు ప్రతిరూపం అయిన మీసాన్ని కూడా కొరిగెయ్యండి అంటూ Xలో పోస్ట్ చేశారు. మార్పుల విషయంలో ఇప్పటికే పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

News May 30, 2024

జూన్ 1 వచ్చేస్తోంది.. ఇవి మర్చిపోవద్దు!

image

* ఉచితంగా ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకోవడానికి జూన్ 14 వరకే అవకాశం ఉంది.
* ఇకపై ప్రతినెలా 1న చమురు కంపెనీలు గ్యాస్ సిలిండర్ ధరలను సవరిస్తాయి.
* జూన్ 1 నుంచి డ్రైవింగ్ లైసెన్స్ కోసం RTOకి వెళ్లాల్సిన అవసరం లేదు. డ్రైవింగ్ స్కూల్‌కు వెళ్లి లైసెన్స్‌కి అర్హత సాధించవచ్చు.
* మైనర్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే రూ.25 వేల వరకు ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది.

News May 30, 2024

కౌంటింగ్ ఏజెంట్లు EVMల దగ్గరికి వెళ్లవచ్చా?

image

ఓట్ల లెక్కింపును కౌంటింగ్ ఏజెంట్లు కౌంటింగ్ గదిలో ఉండి పర్యవేక్షించవచ్చు. కానీ, వారు EVMల దగ్గరికి వెళ్లడం, ఆపరేట్ చేయడం కుదరదు. EVM ఉన్న ప్రతి కౌంటింగ్ టేబుల్‌ చుట్టూ బారికేడ్లు ఉంటాయి. ఓట్ల లెక్కింపును చూసేందుకు ఏజెంట్ల కోసం అన్ని సౌకర్యాలు ఉంటాయి. కౌంటింగ్ ఏజెంట్‌ను అభ్యర్థులు నియమించుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగులు ఏజెంట్‌గా వ్యవహరించలేరు. <<-se>>#ELECTIONS2024<<>>

News May 30, 2024

వివేకానంద రాక్ మెమోరియల్‌ చరిత్ర ఇదే!

image

తమిళనాడులోని కన్యాకుమారిలో వివేకానంద <<13340790>>రాక్<<>> మెమోరియల్‌కు ఎంతో ప్రత్యేకత ఉంది. 1892లో స్వామి వివేకానంద.. ఈ ప్రాంతంలో ధ్యానం చేశారు. ఓ రాయిపై మూడు రోజుల పాటు ధ్యానం చేసిన అనంతరం ఆయనకు జ్ఞానోదయం అయిందని చెబుతారు. తదనంతరం వివేకానంద గౌరవార్థం ఈ మెమోరియల్‌ను సముద్ర మట్టానికి 17 మీటర్ల ఎత్తులో 1970లో నిర్మించారు. అప్పటి రాష్ట్రపతి వీవీ గిరి దీన్ని ప్రారంభించారు. ఈ ప్రదేశం సుమారు 6 ఎకరాల విస్తీర్ణంలో ఉంది.

News May 30, 2024

ముగిసిన ప్రధాని మోదీ ప్రచారం

image

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో గతకొన్ని రోజులుగా ప్రధాని మోదీ చేస్తున్న ప్రచారానికి నేడు తెరపడింది. ఆఖరి విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా పంజాబ్‌లోని హోషియార్‌పుర్‌లో పర్యటించిన మోదీ అక్కడ చివరి ప్రసంగం చేశారు. నిర్విరామ ప్రచారం నుంచి సేదతీరేందుకు మోదీ కన్యాకుమారిలోని ధ్యానమండపంలో జూన్ 1 వరకు ధ్యానం చేస్తారు. కాగా 200కుపైగా ప్రచార సభల్లో పాల్గొన్న మోదీ, 80 ఇంటర్వ్యూలు ఇచ్చారు.

News May 30, 2024

రేపు రాష్ట్రానికి తిరిగి రానున్న జగన్

image

AP: విదేశీ పర్యటన ముగించుకుని సీఎం జగన్, భారతి దంపతులు రేపు రాష్ట్రానికి రానున్నారు. ఇవాళ రాత్రి వారు లండన్‌ నుంచి తిరుగు ప్రయాణం కానున్నారు. రేపు ఉదయం గన్నవరం విమానాశ్రయానికి వారు చేరుకోనున్నారు. కాగా ఎన్నికలతో బిజీబిజీగా గడిపిన జగన్ ఈ నెల 17న లండన్ పర్యటనకు వెళ్లారు. అక్కడి నుంచి కుమార్తెలతో కలిసి ఫ్రాన్స్, స్విట్జర్లాండ్‌లో ఆయన పర్యటించారు. 15 రోజుల అనంతరం రాష్ట్రానికి పయనమవుతున్నారు.

News May 30, 2024

హైదరాబాద్ అంటే భాగ్యలక్ష్మి టెంపుల్: బండి

image

TG: ప్రజాపాలన అని చెప్పుకుంటున్న కాంగ్రెస్.. అధికారిక చిహ్నం, రాష్ట్ర గీతం మార్పుపై ప్రజాభిప్రాయం తీసుకుందా అని BJP MP బండి సంజయ్ ప్రశ్నించారు. సమస్యలను పక్కదారి పట్టించడంలో BRS, కాంగ్రెస్ రెండూ ఒకటేనని విమర్శించారు. చార్మినార్ అంటే HYD అంటున్న KCR కొడుకును అక్కడున్న భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి వెళ్లకుండా అడ్డుకున్నదేమిటని ప్రశ్నించారు. HYD అంటే భాగ్యలక్ష్మి టెంపుల్ అని బండి స్పష్టం చేశారు.

News May 30, 2024

ట్రేడ్ వర్గాల దృష్టి ఈ ఐదు రంగాలపైనే!

image

ఎన్నికల ఫలితాలపై స్టాక్ మార్కెట్ల జోష్ ఆధారపడి ఉన్న నేపథ్యంలో ఐదు ప్రధాన రంగాలు ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. విద్యుత్, మౌలికవసతులు, పర్యాటకం, రియల్టీ, ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ డిజైన్ & మాన్యుఫాక్చరింగ్ రంగాలపై ఇన్వెస్టర్లు దృష్టిసారించినట్లు తెలుస్తోంది. విద్యుత్ రంగంలో రూ.4.75లక్షల కోట్లతో నేషనల్ ఎలక్ట్రిసిటీ ప్లాన్ అమలు సహా ఇతర రంగాల్లో కేంద్రం భారీగా వెచ్చించనుండటమే కారణం.

News May 30, 2024

INDvsPAK మ్యాచ్​కు ఉగ్ర ముప్పు!

image

న్యూయార్క్​ వేదికగా జూన్ 9న జరగనున్న భారత్, పాక్ మ్యాచ్​కు ఉగ్ర ముప్పు పొంచి ఉన్నట్లు సమాచారం. మ్యాచ్ సమయంలో అలజడి సృష్టించే అవకాశం ఉండటంతో భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు నాసౌ కౌంటీ పోలీస్​ కమిషనర్​ పాట్రిక్​ తెలిపారు. డ్రోన్ దాడులకూ అవకాశం ఉన్నందున మ్యాచ్​ జరుగుతున్న ప్రాంతాన్ని నో ఫ్లై జోన్‌గా ప్రకటించారు. మరోవైపు ఈ మ్యాచ్‌కు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేయాలని న్యూయార్క్​ గవర్నర్​ ఆదేశాలిచ్చారు.