News May 30, 2024

వివేకానంద రాక్ మెమోరియల్‌ చరిత్ర ఇదే!

image

తమిళనాడులోని కన్యాకుమారిలో వివేకానంద <<13340790>>రాక్<<>> మెమోరియల్‌కు ఎంతో ప్రత్యేకత ఉంది. 1892లో స్వామి వివేకానంద.. ఈ ప్రాంతంలో ధ్యానం చేశారు. ఓ రాయిపై మూడు రోజుల పాటు ధ్యానం చేసిన అనంతరం ఆయనకు జ్ఞానోదయం అయిందని చెబుతారు. తదనంతరం వివేకానంద గౌరవార్థం ఈ మెమోరియల్‌ను సముద్ర మట్టానికి 17 మీటర్ల ఎత్తులో 1970లో నిర్మించారు. అప్పటి రాష్ట్రపతి వీవీ గిరి దీన్ని ప్రారంభించారు. ఈ ప్రదేశం సుమారు 6 ఎకరాల విస్తీర్ణంలో ఉంది.

News May 30, 2024

ముగిసిన ప్రధాని మోదీ ప్రచారం

image

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో గతకొన్ని రోజులుగా ప్రధాని మోదీ చేస్తున్న ప్రచారానికి నేడు తెరపడింది. ఆఖరి విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా పంజాబ్‌లోని హోషియార్‌పుర్‌లో పర్యటించిన మోదీ అక్కడ చివరి ప్రసంగం చేశారు. నిర్విరామ ప్రచారం నుంచి సేదతీరేందుకు మోదీ కన్యాకుమారిలోని ధ్యానమండపంలో జూన్ 1 వరకు ధ్యానం చేస్తారు. కాగా 200కుపైగా ప్రచార సభల్లో పాల్గొన్న మోదీ, 80 ఇంటర్వ్యూలు ఇచ్చారు.

News May 30, 2024

రేపు రాష్ట్రానికి తిరిగి రానున్న జగన్

image

AP: విదేశీ పర్యటన ముగించుకుని సీఎం జగన్, భారతి దంపతులు రేపు రాష్ట్రానికి రానున్నారు. ఇవాళ రాత్రి వారు లండన్‌ నుంచి తిరుగు ప్రయాణం కానున్నారు. రేపు ఉదయం గన్నవరం విమానాశ్రయానికి వారు చేరుకోనున్నారు. కాగా ఎన్నికలతో బిజీబిజీగా గడిపిన జగన్ ఈ నెల 17న లండన్ పర్యటనకు వెళ్లారు. అక్కడి నుంచి కుమార్తెలతో కలిసి ఫ్రాన్స్, స్విట్జర్లాండ్‌లో ఆయన పర్యటించారు. 15 రోజుల అనంతరం రాష్ట్రానికి పయనమవుతున్నారు.

News May 30, 2024

హైదరాబాద్ అంటే భాగ్యలక్ష్మి టెంపుల్: బండి

image

TG: ప్రజాపాలన అని చెప్పుకుంటున్న కాంగ్రెస్.. అధికారిక చిహ్నం, రాష్ట్ర గీతం మార్పుపై ప్రజాభిప్రాయం తీసుకుందా అని BJP MP బండి సంజయ్ ప్రశ్నించారు. సమస్యలను పక్కదారి పట్టించడంలో BRS, కాంగ్రెస్ రెండూ ఒకటేనని విమర్శించారు. చార్మినార్ అంటే HYD అంటున్న KCR కొడుకును అక్కడున్న భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి వెళ్లకుండా అడ్డుకున్నదేమిటని ప్రశ్నించారు. HYD అంటే భాగ్యలక్ష్మి టెంపుల్ అని బండి స్పష్టం చేశారు.

News May 30, 2024

ట్రేడ్ వర్గాల దృష్టి ఈ ఐదు రంగాలపైనే!

image

ఎన్నికల ఫలితాలపై స్టాక్ మార్కెట్ల జోష్ ఆధారపడి ఉన్న నేపథ్యంలో ఐదు ప్రధాన రంగాలు ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. విద్యుత్, మౌలికవసతులు, పర్యాటకం, రియల్టీ, ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ డిజైన్ & మాన్యుఫాక్చరింగ్ రంగాలపై ఇన్వెస్టర్లు దృష్టిసారించినట్లు తెలుస్తోంది. విద్యుత్ రంగంలో రూ.4.75లక్షల కోట్లతో నేషనల్ ఎలక్ట్రిసిటీ ప్లాన్ అమలు సహా ఇతర రంగాల్లో కేంద్రం భారీగా వెచ్చించనుండటమే కారణం.

News May 30, 2024

INDvsPAK మ్యాచ్​కు ఉగ్ర ముప్పు!

image

న్యూయార్క్​ వేదికగా జూన్ 9న జరగనున్న భారత్, పాక్ మ్యాచ్​కు ఉగ్ర ముప్పు పొంచి ఉన్నట్లు సమాచారం. మ్యాచ్ సమయంలో అలజడి సృష్టించే అవకాశం ఉండటంతో భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు నాసౌ కౌంటీ పోలీస్​ కమిషనర్​ పాట్రిక్​ తెలిపారు. డ్రోన్ దాడులకూ అవకాశం ఉన్నందున మ్యాచ్​ జరుగుతున్న ప్రాంతాన్ని నో ఫ్లై జోన్‌గా ప్రకటించారు. మరోవైపు ఈ మ్యాచ్‌కు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేయాలని న్యూయార్క్​ గవర్నర్​ ఆదేశాలిచ్చారు.

News May 30, 2024

ఎంతమంది ఏజెంట్లను అనుమతిస్తారు?

image

నియోజకవర్గానికి ఒక కౌంటింగ్ హాల్‌ను కేటాయిస్తారు. ఆ హాల్‌లో ఎన్ని టేబుళ్లు ఏర్పాటు చేయాలనేది అధికారులు నిర్ణయిస్తారు. ఒక్కో అభ్యర్థి టేబుల్‌కు ఒకరి చొప్పున ఏజెంట్లను నియమించుకోవచ్చు. ఉదాహరణకు 14 టేబుళ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయిస్తే ఒక అభ్యర్థి 14 మంది ఏజెంట్లను నియమించుకోవచ్చు. వీరికి అదనంగా రిటర్నింగ్ అధికారి టేబుల్ వద్ద ఒక ఏజెంట్, పోస్టల్ బ్యాలెట్ల పరిశీలనకు కౌంటింగ్ ఏజెంట్లను నియమించుకోవాలి.

News May 30, 2024

కోహ్లీతో నా రిలేషన్ ప్రజలకు ‘మసాలా’ కాదు: గంభీర్

image

కోహ్లీతో తన బంధం గురించి దేశం తెలుసుకోవాల్సిన అవసరం లేదని గంభీర్ చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘టీమ్ గెలుపు కోసం అభిప్రాయం వ్యక్తం చేసే హక్కు నాకెంత ఉందో అతనికీ అంతే ఉంటుంది. మా బంధం ప్రజలకు మసాలా(ఎంటర్‌టైన్‌మెంట్) అందించడం కోసం కాదు. వాస్తవికతకు ఓ అభిప్రాయానికి వ్యత్యాసం ఉంటుంది’ అని పేర్కొన్నారు. 2023 ఐపీఎల్‌లో వీరి మధ్య మాటల యుద్ధం జరగగా ఈ ఏడాది ఇద్దరూ కలిసిపోయిన విషయం తెలిసిందే.

News May 30, 2024

ప్రధాని పదవి గౌరవాన్ని మోదీ తగ్గిస్తున్నారు: మన్మోహన్

image

గతంలో ఏ ప్రధాని కూడా మోదీలా ద్వేషపూరిత వ్యాఖ్యలు చేయలేదని మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్‌సింగ్ ఆరోపించారు. ‘PM పదవి గౌరవాన్ని తగ్గించిన మొదటి ప్రధాని మోదీ. ఒక వర్గమే లక్ష్యంగా అన్‌పార్లమెంటరీ వ్యాఖ్యలు చేస్తున్నారు. బీజేపీ హయాంలో రైతుల నిరసనలు జరిగాయి. రైతుల ఆదాయాన్ని పెంచుతానన్న హామీని మోదీ మరిచిపోయారు’ అని మన్మోహన్‌ విమర్శించారు.

News May 30, 2024

PSపై దాడి: 16 మంది జవాన్లపై కేసు

image

పోలీస్ స్టేషన్‌పై దాడి చేసిన ఘటనలో 16 మంది భారత జవాన్లపై కేసు నమోదైంది. ఈ ఘటన జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో జరిగింది. ఓ కేసు దర్యాప్తులో భాగంగా ఆర్మీ సైనికుడి ఇంటిపై స్థానిక పోలీసులు దాడి చేశారు. ఈ విషయం తెలుసుకున్న సహచర సైనికులు PSపై దాడి చేసి పోలీసులను తీవ్రంగా కొట్టగా ఎస్ఐతో సహా ఐదుగురు పోలీసులు గాయపడ్డారు. దాడికి పాల్పడిన 16 మంది జవాన్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.