News March 13, 2025

ఆమెతో డేటింగ్‌లో ఉన్నా: స్టార్ హీరో

image

గౌరీ స్ప్రత్‌తో డేటింగ్‌‌లో ఉన్నట్లు బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ ప్రకటించారు. తన 60వ బర్త్‌డే సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు. 25 ఏళ్లుగా గౌరీతో ఫ్రెండ్‌షిప్ చేస్తున్నట్లు వెల్లడించారు. బెంగళూరుకు చెందిన ఆమె ఆమిర్ ప్రొడక్షన్ బ్యానర్‌లో పనిచేస్తున్నారు. గౌరీకి ఆరేళ్ల కొడుకు ఉన్నాడు. 2021లో తన భార్య కిరణ్ రావుతో ఆమిర్ విడాకులు తీసుకున్నారు. అంతకుముందు రీనా దత్తాను పెళ్లి చేసుకొని విడిపోయారు.

News March 13, 2025

ఆసీస్ కెప్టెన్ ఉంటే.. SRHకు కప్ పక్కా..!

image

IPL 2025 కోసం SRH సన్నద్ధమవుతోంది. ఇప్పటికే ఆటగాళ్లు HYD చేరుకుని ప్రాక్టీస్ ప్రారంభించారు. కాగా ఆస్ట్రేలియా క్రికెటర్ SRHకు కెప్టెన్‌గా ఉంటే టైటిల్ కచ్చితంగా వస్తుందంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. 2009లో గిల్‌క్రిస్ట్ సారథ్యంలో (దక్కన్ ఛార్జర్స్), 2016లో వార్నర్ నాయకత్వంలో టైటిల్ సాధించిందని గుర్తు చేసుకుంటున్నారు. ఈసారి కమిన్స్ కెప్టెన్‌గా ఉండటంతో టైటిల్ పక్కా అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

News March 13, 2025

8 ఏళ్లలోపు పిల్లలు ఈ ఐస్‌క్రీమ్ తినొద్దు: UK సైంటిస్టులు

image

రంగులు కలిపే ముద్ద ఐస్‌లను పిల్లలు ఎంతో ఇష్టంగా సేవిస్తుంటారు. అయితే, గ్లిజరాల్ కలిగిన ఈ స్లష్ ఐస్‌ను 8ఏళ్ల లోపు చిన్నారులు తినడం ప్రమాదకరమని UK పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. పరిశోధనలో పిల్లలు స్లషీ ఐస్ సేవించిన వెంటనే అస్వస్థతకు గురవడంతో అత్యవసర చికిత్స అందించాల్సి వచ్చిందని తెలిపారు. గ్లిజరాల్ వల్ల పిల్లలు స్పృహ కోల్పోతున్నారన్నారు. 8-11ఏళ్లలోపు పిల్లలు ఎప్పుడైనా ఒకటి తినొచ్చని సూచించారు.

News March 13, 2025

రేపు వైన్స్ బంద్

image

హోలీ పండుగ సందర్భంగా హైదరాబాద్‌లో రేపు(14న) మద్యం షాపులు బంద్ కానున్నాయి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు షాపులు మూసివేయాలని పోలీస్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం సేవించి బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. రోడ్డుపై వెళ్లే వారిపై రంగులు చల్లొద్దని, గుంపులుగా ర్యాలీలు నిర్వహించొద్దని పోలీసులు ఆదేశించారు.

News March 13, 2025

IPL: హ్యారీ బ్రూక్‌పై రెండేళ్ల నిషేధం

image

ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ హ్యారీ బ్రూక్‌పై బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆయన ఐపీఎల్‌లో రెండేళ్లు ఆడకుండా నిషేధం విధించింది. దీంతో బ్రూక్ ఐపీఎల్ ఆడే అవకాశం లేదు. 2028 ఐపీఎల్‌లో మాత్రమే ఆడే ఛాన్స్ ఉంది. కాగా ఇటీవల ఐపీఎల్ 2025 నుంచి తప్పుకుంటున్నట్లు బ్రూక్ ప్రకటించారు. దీంతో ఐపీఎల్ రూల్ ప్రకారం సరైన కారణం లేకుండా టోర్నీ నుంచి తప్పుకుంటే రెండేళ్ల నిషేధం విధిస్తారు.

News March 13, 2025

దస్తగిరికి భద్రత పెంపు

image

AP: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకేసులో అప్రూవర్ దస్తగిరికి ప్రభుత్వం భద్రత పెంచింది. గతంలో ఆయనకు 1+1 సెక్యూరిటీ ఉండగా ఇకపై 2+2కు గన్‌మెన్లను కేటాయించినట్లు ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. వివేకా హత్య కేసులో సాక్షులు అనుమానాస్పదంగా మృతి చెందుతున్న నేపథ్యంలో తనకు భద్రత కల్పించాలని ఆయన ఇటీవల విన్నవించారు. దీంతో సెక్యూరిటీ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

News March 13, 2025

రూపాయి గుర్తు ఎలా రూపొందించారంటే..

image

దివంగత ఆర్థిక మంత్రి ప్రణబ్ 2009 కేంద్ర బడ్జెట్ సమయంలో రూపాయికి గుర్తు సూచించాలని ఓపెన్ కాంపిటిషన్ ప్రకటించారు. 3331 డిజైన్లలో 5 షార్ట్ లిస్ట్ చేసి DMK మాజీ MLA కుమారుడు, ప్రొఫెసర్ ఉదయ్ పంపినది ఎంపిక చేశారు. ఇది దేవనాగరి లిపి र “ra”, లాటిన్ ఇంగ్లిష్‌లో నిలువు గీత లేని Rను పోలి ఉంటుంది. ₹లో 2 సమాన అడ్డగీతలు అసమానతల్లేని సంపద పంపిణీని సూచిస్తాయి.
PS: గతంలో Rs, Re, రూ. అని భిన్న రూపాయి సూచకాలుండేవి.

News March 13, 2025

అక్కడి మహిళలు 10 మందిని పెళ్లి చేసుకునే సంప్రదాయం: మంత్రి

image

ఉత్తర భారతంలో ఒక స్త్రీ 10మందిని వివాహం చేసుకునే సంప్రదాయం ఉందని తమిళనాడు మంత్రి మురుగన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అదే దక్షిణ భారతంలో అటువంటి కల్చర్ లేదన్నారు. జనాభా నియంత్రణ విధానాన్ని పక్కాగా అమలు చేయడంతో ఇక్కడి జనాభా తగ్గిందని, కానీ నార్త్ ఇండియాలో ఒకరు 10మందికి పైగా పిల్లల్ని కన్నారన్నారు. తమిళ సంస్కృతిని హేళన చేసేలా ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే వారి నాలుక చీరేస్తానని మంత్రి హెచ్చరించారు.

News March 13, 2025

సీఎం చంద్రబాబు పేరు సూర్యబాబు అవుతుందేమో: RRR

image

AP: అసెంబ్లీలో సీఎం చంద్రబాబుపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోలార్ విద్యుత్‌పై చర్చ సందర్భంగా ‘సూర్యశక్తిని ఒడిసిపడుతున్నందుకు సీఎం చంద్రబాబు పేరు ఇక సూర్యబాబుగా మారుతుందేమో’ అని అన్నారు. వెంటనే స్పందించిన సీఎం ‘మీరేదో నాకు కరెంట్ షాక్ ఇవ్వాలనుకుంటున్నారు’ అని నవ్వుతూ అన్నారు. దీంతో సభలోని మిగతా సభ్యులూ నవ్వారు.

News March 13, 2025

2100 నాటికి భారత జనాభా 153కోట్లు!

image

ఇండియాలో ప్రస్తుతం 140+ కోట్ల జనాభా ఉన్నట్లు అంచనా. అయితే, 2100 నాటికి ఇది 153.3 కోట్లకు చేరుతుందని UN పాపులేషన్ డివిజన్ పేర్కొంది. దీంతో మోస్ట్ పాపులేటెడ్ కంట్రీగా ఇండియా మారనుంది. చైనాలో మాత్రం జననాల రేటు పడిపోయి అక్కడి జనాభా 77 కోట్లకు చేరుతుందని తెలిపింది. ఆ తర్వాత నైజీరియాలో 54 కోట్లు, పాకిస్థాన్‌లో 48 కోట్లు, కాంగోలో 43కోట్లు, అమెరికా 39కోట్ల మంది జనాభాకు చేరుకుంటుందని వెల్లడించింది.