India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: ‘ఆడుదాం ఆంధ్ర’పై ACB విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. గత వైసీపీ ప్రభుత్వం నిర్వహించిన ‘ఆడుదాం ఆంధ్ర’లో అవకతవకలు ఉన్నాయనే ఆరోపణలపై నిన్న అసెంబ్లీలో చర్చ జరిగింది. ప్రభుత్వం కేటాయించినవే కాకుండా జిల్లాల్లోని నిధులూ వినియోగించినట్లు పలువురు సభ్యులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ACB విచారణ చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ప్రభుత్వ హయాంలో క్రీడాశాఖ మంత్రిగా RK రోజా బాధ్యతలు నిర్వర్తించారు.

అమెరికాలో పాకిస్థాన్‌కు షాక్! తుర్క్‌మెనిస్థాన్‌లోని పాక్ అంబాసిడర్ KK అహ్‌సన్ వాగన్‌ను లాస్ ఏంజెలిస్ విమానాశ్రయం నుంచే వెనక్కి పంపించేసింది. సరైన వీసా, ప్రయాణ పత్రాలు ఉన్నప్పటికీ ప్రవేశం నిరాకరించింది. వీసా రిఫరెన్సులు వివాదాస్పదంగా ఉన్నట్టు US ఇమ్మిగ్రేషన్ గుర్తించినట్టు తెలిసింది. ‘అంబాసిడర్ కేకే వాగన్‌ను అమెరికా తిప్పిపంపింది. ఇమ్మిగ్రేషన్ సమస్యే కారణం’ అని పాక్ ఫారిన్ మినిస్ట్రీ తెలిపింది.

ఉత్తర్ ప్రదేశ్ మంత్రి రఘురాజ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హోలీ రంగులు పడొద్దు అనుకునేవాళ్లు టార్పాలిన్ హిజాబ్ ధరించాలని సూచించారు. ‘మీ దుస్తులు, టోపీలు శుభ్రంగా ఉండాలనుకుంటే టార్పాలిన్ హిజాబ్ ధరించండి లేదా ఇంటి నుంచి బయటకు రాకండి’ అని సూచించారు. ‘హోలీని అడ్డుకోవాలని ప్రయత్నిస్తే జైలుకెళ్లాలి లేదంటే రాష్ట్రం విడిచిపోవాలి. లేదంటే యముడి దగ్గరకు వెళ్లాల్సిందే’ అని హెచ్చరించారు.

TG: ఇవాళ్టి ఇంటర్ ఫస్టియర్ బోటనీ, మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్లలో తప్పులు దొర్లినట్లు తెలుస్తోంది. దీంతో తప్పులు సరిచేసి విద్యార్థులకు తెలపాలని ఇంటర్ బోర్టు ఆదేశించినట్లు సమాచారం. ఇప్పటికే సెకండియర్ ఇంగ్లిష్ ప్రశ్నపత్రం ముద్రణలో ఏడో ప్రశ్న అస్పష్టంగా ఉండటంతో, ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేసిన విద్యార్థులకు 4 మార్కులు కలుపుతామని ఇంటర్ బోర్డు ప్రకటించిన సంగతి తెలిసిందే.

AP: ప్రముఖ సంగీత విద్వాంసులు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్(76) అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. తిరుపతిలోని హరిశ్చంద్ర శ్మశానవాటికలో ఆయనకు కుమారులు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. గరిమెళ్ల ఆదివారం గుండెపోటుతో చనిపోగా, ఆయన ఇద్దరు కుమారులు నేడు అమెరికా నుంచి తిరుపతి చేరుకొని అంత్యక్రియలు పూర్తి చేశారు. TTD ఆస్థాన గాయకుడిగా గరిమెళ్ల ఎన్నో అన్నమయ్య సంకీర్తనలకు స్వరకల్పన చేసిన విషయం తెలిసిందే.

పిల్లలు ఉన్నవారి మెదడు యవ్వనంగా ఉంటుందని ఓ అధ్యయనంలో తేలింది. అలాగే త్వరగా వృద్ధాప్యం చెందదని రట్జర్స్ సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ హ్యూమన్ బ్రెయిన్ ఇమేజింగ్ రీసెర్చ్‌లో తేలింది. ఇందులో 37 వేల మంది తల్లిదండ్రులు పాల్గొన్నారు. అలాగే పిల్లల్ని కనడం, పెంచడం ఒత్తిడితో కూడుకున్నదనేదీ ఓ అపోహ అని తేలింది. మరోవైపు తండ్రుల ఆరోగ్యంపై పిల్లల ప్రభావం ఉంటుందని 17వేల మంది పురుషులు పాల్గొన్న అధ్యయనంలో వెల్లడైంది.

AP: వచ్చే విద్యాసంవత్సరం ఆరంభం (జూన్ 12) నుంచి స్కూల్ యూనిఫామ్‌లు మారనున్నాయి. కొత్త యూనిఫామ్‌లకు మంత్రి లోకేశ్ ఆమోదం తెలిపారని MLA ఆదిరెడ్డి శ్రీనివాస్ ట్వీట్ చేశారు. ఏ రాజకీయ పార్టీలకు సంబంధించిన రంగులు, గుర్తులు లేకుండా రూపొందించిన ఈ దుస్తులు చూడముచ్చటగా ఉన్నాయని పేర్కొన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి కిట్‌లో భాగంగా స్టూడెంట్లకు యూనిఫామ్, బ్యాగు, బెల్ట్ ప్రభుత్వం ఉచితంగా అందించనుంది.

AP: విజయవాడ వరద బాధితులకు సాయంపై శాసనమండలిలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా వరద బాధితులకు వైసీపీ అధినేత జగన్ రూ.కోటి ఇచ్చారని బొత్స తెలపగా మంత్రి పార్థసారథి స్పందించారు. ప్రభుత్వానికి జగన్ ఇచ్చిన విరాళం అందలేదన్నారు. అలాగే, సాక్షి పేపర్ కొనుగోలుకు ప్రభుత్వం వాలంటీర్లకు నెలకు రూ.200 ఇచ్చిందని, అక్రమంగా చేసిన చెల్లింపులపై విచారణ చేయిస్తామన్నారు. అక్రమాలు చేసిన అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

AP: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన పూర్తయింది. ఐదుగురి నామినేషన్లకు అధికారులు ఆమోదం తెలిపారు. టీడీపీ నుంచి గ్రీష్మ, బీద రవిచంద్ర, బీటీ నాయుడు, జనసేన నుంచి నాగబాబు, బీజేపీ నుంచి సోము వీర్రాజు పోటీలో ఉన్నారు.

AP: మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ రిమాండ్‌ను ఈ నెల 25 వరకు విజయవాడ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు పొడిగించింది. నేటితో రిమాండ్ ముగియడంతో ఆయన్ను జైలు అధికారులు వర్చువల్‌గా జడ్జి ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా రిమాండ్ పొడిగిస్తూ న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నారు. సత్యవర్ధన్ కిడ్నాప్, బెదిరింపులు కేసులో వంశీని హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన పోలీసులు విజయవాడ తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
Sorry, no posts matched your criteria.