News March 8, 2025

డీలిమిటేషన్ వల్ల రాష్ట్రంలో ఎంపీ సీట్లు తగ్గవు: కిషన్ రెడ్డి

image

TG: డీలిమిటేషన్ వల్ల తెలంగాణలో ఒక్క ఎంపీ సీటు తగ్గదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. హిందీ భాషను ఎవరిపైనా బలవంతంగా రుద్దడం లేదన్నారు. సీఎం రేవంత్, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తప్పుడు ప్రచారాలతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఇప్పటికే 10 జాతీయ రహదారులను పూర్తయ్యాయని, పార్లమెంట్ సమావేశాల అనంతరం మరో 10 రహదారులను ప్రారంభిస్తామని కేంద్రమంత్రి తెలిపారు.

News March 8, 2025

రోహిత్ రిటైర్మెంట్ వార్తలు.. గిల్ ఏమన్నారంటే?

image

ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటిస్తారని జరుగుతున్న ప్రచారంపై శుభ్‌మన్ గిల్ స్పందించారు. ‘డ్రెస్సింగ్ రూమ్‌లో లేదా నాతో దీనిపై ఎలాంటి చర్చ జరగలేదు. మేం మ్యాచ్ గురించే ఆలోచిస్తున్నాం. రోహిత్ కూడా ఫైనల్ పైనే దృష్టి పెట్టారు’ అని ప్రెస్ కాన్ఫరెన్స్‌లో తెలిపారు. ఇప్పటివరకు తాను ఆడిన జట్లలో ఇదే బెస్ట్ బ్యాటింగ్ లైనప్ అని, చాలా డెప్త్ ఉందని పేర్కొన్నారు.

News March 8, 2025

రాజకీయాలకు అతీతంగా ఎంపీలంతా ఏకం కావాలి: భట్టి

image

TG: రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని పార్టీల MPలు కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఆల్ పార్టీ ఎంపీల మీటింగ్ అనంతరం మాట్లాడుతూ ‘మరోసారి అన్ని పార్టీల ఎంపీలతో సమావేశం నిర్వహిస్తాం. BJP, BRS ఎంపీలు వస్తారని ఆశిస్తున్నాం. రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరూ కలిసి కేంద్రాన్ని కలవాలి. పార్లమెంటులో రాష్ట్రానికి సంబంధించిన అన్ని అంశాలను లేవనెత్తాలి’ అని వ్యాఖ్యానించారు.

News March 8, 2025

VIRAL: ఐస్‌క్రీమ్‌లో పాము

image

అసలే ఎండాకాలం కావడంతో ఉపశమనం కోసం ఐస్‌క్రీమ్ తిందామనుకున్న ఓ వ్యక్తికి ఊహించని షాక్ ఎదురైంది. థాయ్‌లాండ్‌లో ఆ వ్యక్తి చాకోబార్ ఐస్‌క్రీమ్ తీసుకొని కవర్ తీయగానే అందులో గడ్డకట్టుకుపోయిన పాము కనిపించింది. ఆ చాకోబార్‌లో పూర్తిగా ఒక చిన్న పాము శరీరం ఉండిపోయింది. దీనిని ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరలవుతోంది. దీనిపై అక్కడి అధికారులు విచారణ చేపట్టారు.

News March 8, 2025

అడ్డంకులను అధిగమించి అంతర్జాతీయ స్థాయికి..!

image

ఝార్ఖండ్‌లోని దాహు అనే గ్రామంలో ఆడపిల్లలు ఇళ్లకే పరిమితం. కానీ, సీమా కుమారి ఈ సంప్రదాయాన్ని బ్రేక్ చేసింది. ఫుట్‌బాల్ ప్రోగ్రామ్‌లో చేరడంతో ఆమె గ్రామాన్ని వదిలి ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకున్నారు. ఇలా జాతీయ , అంతర్జాతీయ టోర్నమెంట్స్‌కు ఆడుతూ ఉన్నత స్థాయికి చేరుకున్నారు. దీంతో సీమా జీవితం పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం స్కాలర్‌షిప్‌తో హార్వర్డ్‌లో విద్యను అభ్యసిస్తున్నారు.

News March 8, 2025

కళ్యాణ్ రామ్ కొత్త సినిమా.. ‘అర్జున్ s/o వైజయంతి’

image

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ప్రదీప్ చిలుకూరి తెరకెక్కిస్తోన్న ‘NKR21’ సినిమా టైటిల్ రివీలైంది. ఈ చిత్రానికి ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ పేరును ఫిక్స్ చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. ఉమెన్స్ డే సందర్భంగా స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో విజయశాంతి పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా సోహేల్ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నారు.

News March 8, 2025

అలాంటి వారిని సహించను: సీఎం చంద్రబాబు

image

AP: YCPతో లాలూచీ పడిన కార్యకర్తలను సహించేది లేదని TDP అధినేత, CM చంద్రబాబు హెచ్చరించారు. లాలూచీ పడితే నిజమైన కార్యకర్త మనోభావాలు దెబ్బతింటాయన్నారు. ‘కూటమిలోని 3 పార్టీలు కలిసి పనిచేయాలి. MLA/MP పదవుల్లో వన్ టైమ్ కాకుండా శాశ్వతంగా ఉండేలా పనిచేయాలి. నేతలు, కార్యకర్తల పనితీరుపై సమీక్షిస్తాం. చెప్పిన తర్వాత కూడా మారకపోతే వారిని ఎలా నియంత్రించాలో పార్టీకి తెలుసు’ అని కార్యకర్తల భేటీలో వ్యాఖ్యానించారు.

News March 8, 2025

కాలిఫోర్నియా గవర్నర్‌గా కమలా హారిస్ పోటీ?

image

భారత సంతతి అమెరికా నేత కమలా హారిస్ కాలిఫోర్నియా గవర్నర్‌గా పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పలు పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. 2024లో డెమోక్రాట్ల తరఫున US అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన కమల ట్రంప్ చేతిలో ఓటమిపాలయ్యారు. 2028లో జరిగే ఎన్నికలకు దూరంగా ఉండనున్నట్లు సమాచారం. ప్రస్తుతం డెమోక్రటిక్ పార్టీ మెంబర్ గావిన్ న్యూసమ్ కాలిఫోర్నియా గవర్నర్‌గా వ్యవహరిస్తున్నారు.

News March 8, 2025

OTTల రూపంలో అశ్లీలత ఇళ్లలోకి వచ్చేసింది: MLC కవిత

image

TG: OTTల రూపంలో అశ్లీలత ఇళ్లలోకి వచ్చేసిందని MLC కవిత అన్నారు. TVలు, OTT సిరీస్‌లలో మహిళల్ని తక్కువ చేసి చూపిస్తున్నారని, అవి చూసి మగ పిల్లల్లో మహిళలపై చులకన భావం ఏర్పడుతోందని తెలిపారు. దీనిపై మహిళలు ఎందుకు ప్రశ్నించడం లేదని అన్నారు. మహిళలపై అఘాయిత్యాలకు OTT, సోషల్ మీడియా కంటెంట్ కూడా కారణమని పేర్కొన్నారు. సీరియళ్లలోనూ అత్తాకోడళ్ల గొడవలు చూపించి నెగటివిటీని పెంచుతున్నారని విమర్శించారు.

News March 8, 2025

IND టీమ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ అతనే: కైఫ్

image

భారత జట్టులో అత్యంత విలువైన ఆటగాడు హార్దిక్ పాండ్య అని మాజీ క్రికెటర్ కైఫ్ అన్నారు. ‘పాండ్య అసలైన ఇంపాక్ట్ ప్లేయర్. అతడు ఉంటే జట్టులో 12 మంది ప్లేయర్లు ఉన్నట్టే. మంచి పేసర్, గ్రేట్ ఫినిషర్. 2023 వరల్డ్ కప్ ఫైనల్‌లో అతడిని టీమ్ మిస్ అయింది. రేపు CT ఫైనల్‌లో IND, NZ మధ్య డిఫరెన్స్ అతడే. బెస్ట్ టీమ్ (ఇండియా) విన్ అవుతుంది’ అని ట్వీట్ చేశారు.