India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: గుంటూరు ANUలో బీఎడ్ ప్రశ్నాపత్రం <<15680685>>లీకేజీ<<>> ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీళ్లు ఒడిశాకు చెందిన ఏజెంట్లని, ఆ రాష్ట్ర విద్యార్థులకు ఏపీలోని కాలేజీల్లో అడ్మిషన్లు ఇప్పిస్తుంటారని తెలిపారు. అలాగే పాస్ చేయించేందుకు క్వశ్చన్ పేపర్లను లీక్ చేస్తుంటారని గుర్తించారు. ఇందుకోసం పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. విచారణ తర్వాత మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయంటున్నారు.

బాలీవుడ్‌లో దాదాపు రూ.480 కోట్లు కలెక్ట్ చేసిన ‘ఛావా’ మూవీ నిన్న తెలుగులో రిలీజవగా మిక్స్‌డ్ టాక్ వస్తోంది. డబ్బింగ్ ఏమాత్రం బాగాలేదని పలువురు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. తెలుగు నేటివిటీకి తగ్గట్లు డైలాగులపై ఫోకస్ చేయాల్సిందంటున్నారు. గీతా ఆర్ట్స్ పెద్ద ఎత్తున విడుదల చేసినా తొలి రోజు కేవలం రూ.3కోట్ల గ్రాస్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

TG: విద్యాబుద్ధులు నేర్పే మహిళా టీచర్ల పట్ల కొందరు విద్యార్థులు అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా మహబూబాబాద్(D) తొర్రూరులోని ZP హైస్కూల్‌లో పాఠాలు చెబుతున్న సమయంలో వెనుక నుంచి ఫొటోలు తీశారు. బెంచ్‌లో కూర్చుని ప్రశ్నలకు సమాధానాలిస్తుండగా అసభ్యకరంగా ఫొటోలు తీసి ఇన్‌స్టాలో పోస్టు చేసినట్లు సమాచారం. ఓ విద్యార్థిని గమనించి HMకు ఫిర్యాదు చేయగా, విషయం బయటికి రాకుండా చూసినట్లు తెలుస్తోంది.

రిలయన్స్, దాని భాగస్వాముల నుంచి $2.81B (Rs.24000CR) వసూలు చేస్తామని PNG మంత్రి హర్దీప్‌సింగ్ పూరి అన్నారు. ప్రభుత్వానికి అన్ని హక్కులూ ఉన్నాయని కోర్టు చెప్పినట్టు గుర్తుచేశారు. ‘కోర్టు తీర్పు సుస్పష్టం. మేమిప్పటికే డబ్బు కోసం నోటీసులు పంపించాం. మా హక్కును వాడుకుంటాం’ అని తెలిపారు. హక్కుల్లేని నిక్షేపాల నుంచి అక్రమంగా గ్యాస్‌ను వెలికితీసిన కేసులో ఢిల్లీ హైకోర్టు RILకు వ్యతిరేకంగా తీర్పునిచ్చింది.

టీమ్ఇండియా పేసర్ మహ్మద్ షమీకి బాలీవుడ్ లిరిసిస్ట్ జావెద్ అక్తర్ అండగా నిలిచారు. రంజాన్ మాసంలో మ్యాచ్ మధ్యలో డ్రింక్ తాగడంపై చెలరేగిన వివాదంపై స్పందించారు. ‘షమీ.. మండే ఎండలో మధ్యాహ్నం వేళ క్రికెట్ మైదానంలో మీరు నీరు తాగితే పాపంగా భావించే మత మౌఢ్యుల మాటల్ని పట్టించుకోవద్దు. ఇది వాళ్లకు సంబంధం లేని విషయం. మేము గర్వపడే టీమ్ఇండియాలో మీరూ భాగం. CT ఫైనల్లో మీకు, జట్టుకు నా బెస్ట్ విషెస్’ అని అన్నారు.

TG: అన్ని పార్టీల MPలతో CM రేవంత్ ఏర్పాటు చేసిన <<15686776>>సమావేశానికి <<>>హాజరుకావొద్దని BJP డిసైడ్ అయ్యింది. ఇప్పటికే నిర్ణయించిన అధికారిక కార్యక్రమాలతో తాము రాలేకపోతున్నట్లు Dy.CM భట్టి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి లేఖ రాశారు. ప్రభుత్వ ఆహ్వానం ఆలస్యంగా అందిందని, పార్టీలో తమకు చర్చించుకునే సమయం దొరకలేదని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తే, ముందుగానే తమకు తెలియజేయాలని కోరారు.

వరుసగా రెండు రోజుల పాటు తగ్గిన బంగారం ధరలు మరోసారి పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.500 పెరిగి రూ.80,400లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.550 పెరగడంతో రూ.87,710లకు చేరింది. అటు వెండి ధరలో మాత్రం ఎలాంటి మార్పులేదు. కేజీ వెండి ధర రూ.1,08,100 వద్ద కొనసాగుతోంది. వివాహ శుభకార్యాల నేపథ్యంలో బంగారం, వెండికి భారీ డిమాండ్ నెలకొంది.

దేశంలోని ప్రధాన రైల్వే స్టేషన్లలో రద్దీని నియంత్రించేందుకు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. న్యూఢిల్లీ, అయోధ్య, వారణాసి, బెంగళూరు, పట్నాతో సహా మొత్తం 60 రైల్వే స్టేషన్లలో కన్ఫర్మ్ టికెట్ ఉంటేనే లోనికి రానిచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. టికెట్ లేని, వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నవారు వెయిటింగ్ ఏరియాలో ఉండేలా చర్యలు చేపడుతున్నారు. అనధికార ఎంట్రీ పాయింట్లను క్లోజ్ చేస్తామన్నారు.

TG: మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను ఆర్వీఎం ఆస్పత్రిలో చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా నిన్న ఎర్రవల్లిలోని మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్‌లో జరిగిన మీటింగ్‌లో పాల్గొన్నారు. అనంతరం అక్కడే మధ్యాహ్న భోజనం చేశాక ఆమె అస్వస్థతకు గురయ్యారు. సబిత జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు డాక్టర్లు గుర్తించారు.

AP: వివేకా హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి రంగన్న(85) <<15683370>>మృతిపై<<>> భార్య అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు రీపోస్టుమార్టం నిర్వహించారు. తిరుపతి, మంగళగిరి ఫోరెన్సిక్ నిపుణులు ఇందులో పాల్గొన్నారు. ఆయన శరీరంపై గాయాలు ఏమైనా ఉన్నాయా? అనే అంశాన్ని పరిశీలిస్తున్నారు. కాగా ఆయన మృతిపై సీఎం చంద్రబాబు, కడప ఎస్పీ, పులివెందుల టీడీపీ ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి కూడా అనుమానాలు లేవనెత్తిన విషయం తెలిసిందే.
Sorry, no posts matched your criteria.