India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: విజయవాడలో ఇరుకు ప్రాంతాల్లో ఉన్న వరద బాధితులకు డ్రోన్ల ద్వారా ఆహారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. డ్రోన్ల ద్వారా ఫుడ్ ప్యాకెట్లు ఇచ్చే విధానాన్ని కలెక్టరేట్‌లో సీఎం చంద్రబాబు పరిశీలించారు. 8-10 కేజీల వరకు ఫుడ్, మెడిసిన్, నీటిని డ్రోన్ల ద్వారా సరఫరా చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఎంత వీలుంటే అన్ని ఫుడ్ డెలివరీ డ్రోన్లు సిద్ధం చేసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు.
నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్ లీడ్ రోల్స్‌లో నటించిన క్లీన్ ఎంటర్‌టైనర్ ‘35-చిన్న కథ కాదు’ సినిమాకు సెన్సార్ బోర్డు ‘U’ సర్టిఫికెట్ అందించింది. అయితే, ఈ విషయాన్ని నివేదా ఇంట్రెస్టింగ్‌గా తెలియజేశారు. ‘పిల్లలు, పెద్దవాళ్లు అందరూ కళ్లు, చెవులు మూసుకోకుండా సినిమాలా చూడకుండా అనుభవిద్దాం రండి’ అని ఎంతో చక్కగా ప్రేక్షకులను పిలిచారు. ఈ చిత్రం ఈనెల 6న రిలీజ్ కానుంది.
సమాజంలో కులగణన చాలా సున్నితమైన అంశమని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(RSS) పేర్కొంది. దేశ సమగ్రతకు ఇది చాలా ముఖ్యమని తెలిపింది. ప్రజా సంక్షేమం కోసమే దీనిని ఉపయోగించాలని సూచించింది. ఏమైనప్పటికీ ఎన్నికల ప్రయోజనాల కోసం ఉపయోగించవద్దని అభిప్రాయపడింది. దీంతో తాము కులగణనకు వ్యతిరేకం కాదని స్పష్టం చేసింది.
AP: భారీ వర్షాలతో అతలాకుతలమైన విజయవాడలో తీవ్ర పాలకొరత నెలకొంది. పాల ప్యాకెట్లు దొరక్క జనం ఇబ్బంది పడుతున్నారు. భారీ వర్షాలు, వరద ముంచెత్తడంతో విజయ డెయిరీలోకి వర్షపు నీరు చేరింది. డెయిరీ లోపల దాదాపు నడుం లోతు వరకు నీరు చేరడంతో సుమారుగా 1.50 లక్షల లీటర్ల పాల ప్యాకెట్లు, పెరుగు ప్యాకెట్లు నీటమునిగాయి. ఆహారం పంపిణీ చేసే సిబ్బందిని ‘పిల్లలున్నారు.. ఒక్క పాల ప్యాకెట్ ఇవ్వండి’ అని ప్రజలు వేడుకుంటున్నారు.
భారీ వర్షాలకు పోటెత్తిన వరదల్లో చిక్కుకున్న వారిని NDRF సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. సహాయక చర్యల్లో భాగంగా కొందరికి లైఫ్ జాకెట్స్ అందించగా వృద్ధులు, వికలాంగులను దగ్గరుండి కాపాడుతున్నారు. అయితే, విజయవాడలో వరద నీటిలో చిక్కుకున్న తల్లి నుంచి రోజుల పసికందును NDRF సిబ్బంది కాపాడిన ఫొటో వైరలవుతోంది. ప్రాణాలకు తెగించి వరద బాధితులను రక్షిస్తున్న వారికి నెటిజన్లు సెల్యూట్ చేస్తున్నారు.
‘మేం చాలా బిజీ. కనీసం మంచినీళ్లు తాగడానికీ తీరికుండదు తెలుసా!’ – మీ లైఫ్‌స్టైల్ సైతం ఇలాగే ఉంటుందా? అయితే జాగ్రత్త. మన శరీరంలో 70% ఉండేది నీరే. మన దేహం బాగుండాలన్నా, రోగాల బారిన పడొద్దన్నా తగినంత నీరు, ద్రవాహారం తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. లేదంటే డీహైడ్రేషన్‌తో తలనొప్పి వస్తుందని చెబుతున్నారు. కొన్నాళ్లు నొప్పి ఇలాగే వేధిస్తున్నా మనతీరు మారకుంటే కిడ్నీలు పాడవుతాయని హెచ్చరిస్తున్నారు.
క్రిమినల్ కేసులో నిందితుడిగా ఉన్నాడని అతని ఇంటిని బుల్డోజర్‌తో కూల్చడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. సదరు నిందితుడు కేసులో దోషిగా తేలినా కూడా అతని ఇంటిని కూల్చలేరని స్పష్టం చేసింది. అసలు నిందితుల ఇళ్లను ఏరకంగా కూల్చేస్తారని ప్రశ్నించింది. తండ్రికి సమస్యాత్మక కొడుకు ఉండొచ్చని, దాని ఆధారంగా ఇల్లు కూల్చడం సరైంది కాదంది. అక్రమ కట్టడమని తేలితే కూల్చవచ్చని చెప్పింది.
ఇథనాల్ బ్లెండింగ్ వల్ల 2014 నుంచి రూ.99,014 కోట్ల విదేశీమారక ద్రవ్యం ఆదా చేసినట్టు పెట్రోలియం మంత్రి హర్దీప్‌సింగ్ పురి అన్నారు. 17.3 MMT క్రూడాయిల్‌కు ఇది ప్రత్యామ్నాయంగా ఉపయోగపడిందన్నారు. ఈ పదేళ్లలో 51.9 MMT మేర కర్బన ఉద్గారాలు తగ్గాయని పేర్కొన్నారు. OMCలు డిస్టిలరీలకు రూ.1.45 లక్షల కోట్లు, రైతులకు రూ.87,558 కోట్లు చెల్లించాయన్నారు. ప్రస్తుతం పెట్రోల్‌లో 15% ఇథనాల్ కలుపుతున్న సంగతి తెలిసిందే.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో 23 నెలల తర్వాత AAP నేత విజయ్ నాయర్‌కు బెయిల్ వచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీకి కమ్యూనికేషన్ ఇన్‌ఛార్జి అయిన విజయ్ మనీ లాండరింగ్ వ్యవహారంలో కస్టడీలో ఉన్నారు. తన బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించగా ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సర్వోన్నత న్యాయ స్థానం తాజాగా ఆయనకు బెయిల్ ఇచ్చింది. విజయ్ తరఫున సీనియర్ అడ్వొకేట్ అభిషేక్ మనూ వాదించారు.
TG: వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని ప్రధాని మోదీని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. తెలంగాణలోని వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించాలని ప్రధానికి లేఖ రాశారు. రాష్ట్రానికి తక్షణ సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కాగా ఇవాళ సీఎం ఖమ్మంలో పర్యటించి రాత్రికి అక్కడే బస చేయనున్నారు. రేపు మహబూబాబాద్, వరంగల్‌లో పర్యటించనున్నారు.
Sorry, no posts matched your criteria.