India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ఎలా ఉందో చూడటానికి కేసీఆర్ బయటకు వచ్చారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సెటైర్లు వేశారు. అసెంబ్లీకి రావాలనే ఆలోచన ఆయనకు లేదని విమర్శించారు. సభకు వచ్చిన బీఆర్ఎస్ నేతలు అచ్చోసిన ఆంబోతుల్లా ప్రవర్తించారని దుయ్యబట్టారు. గత ప్రభుత్వ స్కాములను ప్రజలకు చూపిస్తున్నామని తెలిపారు. పాస్ పోర్టు రెన్యూవల్‌కు వచ్చి ముఖం చూపించి పోయారన్నారు.

స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి నెగటివ్ సిగ్నల్స్ రావడమే ఇందుకు కారణం. నిఫ్టీ 22,858 (-77), సెన్సెక్స్ 75,617 (-320) వద్ద చలిస్తున్నాయి. నిఫ్టీకి 22,850 వద్ద మద్దతు దొరికితే పుల్‌బ్యాక్ ర్యాలీకి అవకాశం ఉంటుంది. మీడియా, మెటల్, PSU బ్యాంక్, O&G షేర్లు పెరిగాయి. బ్యాంకు, ఫైనాన్స్, FMCG, Pvt బ్యాంకు షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ నెలకొంది. India VIX 15.48 వద్ద ఉంది.

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.350 పెరిగి రూ.80,700లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.390 పెరగడంతో రూ.88,040లకు చేరింది. అటు వెండి ధర మాత్రం రూ.100 తగ్గి కేజీ రూ.1,07,900 వద్ద కొనసాగుతోంది. వివాహ శుభకార్యాల నేపథ్యంలో బంగారం, వెండికి భారీ డిమాండ్ నెలకొంది.

AP: గుంటూరు మిర్చి యార్డు పర్యటన తర్వాత నమోదైన కేసుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ‘వైఎస్ జగన్ సహా 9 మందిపై కేసు పెట్టడం ఆశ్చర్యాన్ని కలిగించలేదు. కానీ పర్యటన వైపు కన్నెత్తి చూడని పేర్ని నానిని ముద్దాయిగా చేర్చడం ఆశ్చర్యాన్ని కలిగించింది’ అని ట్వీట్ చేశారు. ధర పడిపోవడంతో నష్టపోతున్న రైతులను ఆదుకోవాలని జగన్ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.

AP: రాష్ట్రవ్యాప్తంగా టిడ్కో గృహ సముదాయాల వద్ద యువత, మహిళలకు ఉపాధి కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తంగా 599 షాపులు నిర్మించి ఇవ్వనుంది. గార్మెంట్స్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, MSMEలను ఏర్పాటుచేయనుంది. పైలట్ ప్రాజెక్టు కింద నెల్లూరు, రాజమండ్రి, చిలకలూరిపేట, మంగళగిరి, శ్రీకాకుళం, పిఠాపురం, నంద్యాల, చిత్తూరు, విశాఖలో 10 జీవనోపాధి కేంద్రాలను నిర్మించనుంది. ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది.

బాలకృష్ణ, బాబీ కాంబినేషన్లో తెరకెక్కిన ‘డాకు మహారాజ్’ మూవీ ఇవాళ అర్ధరాత్రి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. గత నెల 12న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం రూ.170 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. సినిమాలో బాలయ్య నట విశ్వరూపం చూపించారని అభిమానుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా తమన్ అందించిన మ్యూజిక్‌కు మంచి మార్కులు పడ్డాయి.

మహా కుంభమేళాలో పవిత్ర స్నానం చేస్తున్న మహిళల వీడియోలు, ఫొటోలు తీసి SMలో పోస్ట్ చేస్తున్న ఘటనపై పోలీసులు చర్యలు చేపట్టారు. రెండు సోషల్ మీడియా అకౌంట్లపై కొత్వాలి కుంభమేళా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఆ ఖాతాలను నడుపుతున్న వారి వివరాలు తెలపాలంటూ మెటాను కోరారు. అలాగే టెలిగ్రామ్‌లో ఆ వీడియోలను విక్రయిస్తున్నవారిపైనా మరో కేసు నమోదైంది. త్వరలోనే నిందితులను అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.

భారత్‌లో జరిగే ఎన్నికల్లో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు ఇచ్చే ఫండ్‌ను అమెరికా డోజ్ విభాగం రద్దు చేయడాన్ని అధ్యక్షుడు ట్రంప్ మరోసారి సమర్థించారు. మియామీలోని ఓ సమావేశంలో మాట్లాడిన ఆయన గత బైడెన్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. భారత ఎన్నికల్లో జోక్యం చేసుకొని, ఎవరినో గెలిపించేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు. ఈ విషయాన్ని భారత ప్రభుత్వానికి తెలియజేయాల్సిన అవసరం ఉందని ట్రంప్ వ్యాఖ్యానించారు.

ద్వాదశ జ్యోతిర్లింగాలలో పుణేలో ఉండే<<15507714>> భీమాశంకర<<>> క్షేత్రం ఆరవది. శివపురాణం ప్రకారం కుంభకర్ణుడి కుమారుడైన భీముడు(మహాభారతం భీముడు కాదు) బ్రహ్మ నుంచి అజేయుడిగా వరం పొంది దేవతల్ని హింసిస్తాడు. వారు రక్షించమని కోరగా రాక్షసుడ్ని శంకరుడు సంహరిస్తాడు. దీంతో శివున్ని అక్కడే ఉండమని దేవతలంతా వేడుకోగా లింగం రూపంలో వెలుస్తాడు. భీముడిని సంహరిస్తాడు కాబట్టి అతడి పేరుమీదే ‘భీమాశంకర’ ఆలయంగా ప్రసిద్ధి చెందింది.

ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం నేడు కొలువుదీరనుంది. రేఖా గుప్తా సీఎంగా ప్రమాణస్వీకారం చేయనుండగా పర్వేశ్ సాహిబ్ సింగ్, అశీష్ సూద్, మంజీందర్ సింగ్, రవీందర్ ఇంద్రజ్ సింగ్, కపిల్ మిశ్రా, పంకజ్ కుమార్ సింగ్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. అనంతరం ప్రధాని మోదీతో కలిసి వీరు లంచ్ చేయనున్నారు.
Sorry, no posts matched your criteria.