India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

WPLలో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉమెన్, ఢిల్లీ క్యాపిటల్స్ ఉమెన్ జట్లు వడోదరాలో తలపడుతున్నాయి. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 19.3 ఓవర్లకు 141పరుగులు చేసి ఆలౌటైంది. రోడ్రిగ్స్ 34 రన్స్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచారు. RCBW బౌలర్లు రేణుకా సింగ్, వరేహం మూడు వికెట్లు తీయడంతో తక్కువ స్కోర్‌కే ఢిల్లీ పరిమితమైంది. 142 పరుగుల లక్ష్యంతో RCBW ఓపెనర్లు స్మృతి మంథాన, యాట్ హాడ్జ్ బ్యాటింగ్‌కు దిగారు.

రాత్రి చాలామందికి బోర్లా పడుకునే అలవాటు ఉంటుంది. ఇలా పడుకుంటే అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మన శ్వాసపై ఒత్తిడి పెరిగి గుండె సంబంధిత సమస్యలు రావచ్చు. బోర్లా పడుకోవడం వల్ల ఆహారం సరిగ్గా అరగక జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. మెడ, నడుము నొప్పి, కాళ్లు, చేతుల నొప్పులు కూడా వస్తాయి. చర్మం నిర్జీవంగా మారి ముఖ సౌందర్యం కూడా దెబ్బతింటుంది.

TG: సమాజంలో పగలుప్రతీకారాలు ప్రాణాలు బలి కోరుతున్నాయి. చిన్నాపెద్దా తేడా లేకుండా అనేక మందిలో ఉన్మాదం పెచ్చుమీరుతోంది. నిన్న మేడ్చల్‌లో పట్టపగలే నడిరోడ్డుపై ఓ వ్యక్తిని ఇద్దరు దుండగులు <<15482187>>అతికిరాతకంగా<<>> నరికి చంపారు. తాజాగా అదే పట్టణానికి సమీపంలోని కిష్టాపూర్‌లో మరో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో 16 ఏళ్ల బాలుడు సొంత మేనమామను పొడిచి చంపాడు. చిన్నారుల్లో ఇలాంటి నేర ధోరణి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

కొత్త చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎంపిక కోసం ప్రధాని మోదీ నివాసంలో కీలక భేటీ నిర్వహించిన<<15492494>> విషయం<<>> తెలిసిందే. అయితే కొత్త CEC పేరు ప్రతిపాదనను ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వ్యతిరేకించారు. సుప్రీంకోర్టులో కేసు తేలేవరకు సీఈసీ నియామకం వద్దని వారించారు. కాగా ప్రస్తుతం సీఈసీ రాజీవ్ కుమార్ పదవీకాలం రేపటితో ముగియనుంది. తదుపరి సీఈసీగా జ్ఞానేశ్ కుమార్‌ను నియమించాలని కేంద్రం భావిస్తోంది.

అంతర్జాతీయ అత్యుత్తమ బ్రాండ్‌ల జాబితాలో రిలయన్స్ టాప్-2లో నిలిచినట్లు ‘ఫ్యూచర్‌బ్రాండ్’ ప్రకటించింది. యాపిల్, నైక్ వంటి దిగ్గజ కంపెనీలను వెనక్కి నెట్టడంతో పాటు ఆ జాబితాలో ఏకైక భారత బ్రాండ్‌గా రిలయన్స్ నిలిచింది. అటు శాంసంగ్‌కు తొలి స్థానం దక్కింది. మార్కెట్ మార్పులను ముందే ఊహించి నిర్ణయాలు తీసుకోవడం, బ్రాండ్ ప్రయోజనాలను ఉత్తమంగా నెరవేర్చడం, తదితరాల ఆధారంగా ‘ఫ్యూచర్‌బ్రాండ్’ జాబితా రూపొందిస్తుంది.

AP: రాష్ట్రంలోని మసీదుల ఇమామ్‌లు, మౌజన్‌ల గౌరవ వేతనాలను ప్రభుత్వం విడుదల చేసింది. 2024 ఏప్రిల్ నుంచి 2025 మార్చి వరకు మొత్తం రూ.45 కోట్లు రిలీజ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇమామ్‌లకు నెలకు రూ.10వేలు, మౌజన్‌లకు రూ.5వేల చొప్పున అందనున్నాయి.

నేషనల్ క్రష్ రష్మిక బ్లాక్ బస్టర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయారు. వరుస విజయాలతో బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్ ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. రష్మిక నటించిన ‘పుష్ప’, ‘పుష్ప-2’ కలిపి రూ.2000+ కోట్ల వసూళ్లు రాబట్టాయి. అలాగే రణ్‌బీర్‌తో ‘యానిమల్’ సినిమాలో నటించి కష్టాల్లో ఉన్న బాలీవుడ్‌కు సుమారు రూ.1000 కోట్ల సినిమాను అందించారు. ఇప్పుడు విక్కీ కౌషల్ ‘ఛావా’తో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు.

ఇంట్లో శవమై <<15483613>>కనిపించిన<<>> సౌత్ కొరియన్ నటి కిమ్ సె రాన్(24)ది ఆత్మహత్యేనని సియోల్ పోలీసులు నిర్ధారించారు. సె రాన్ మరణంపై పలు అనుమానాలు వ్యక్తం కాగా పోస్టుమార్టం నివేదిక, విచారణ అనంతరం పోలీసులు ఈ ప్రకటన చేశారు. 2000లో పుట్టిన సె రాన్ ‘ఏ బ్రాండ్ న్యూలైఫ్’ సినిమాలో నటనతో ఇంటర్నేషనల్ స్టార్‌డమ్ పొందారు. అతిచిన్న వయసులో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆహ్వానం అందుకున్న నటిగా ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు.

AP: దేశంలోని ప్రతి రాష్ట్ర రాజధానిలో శ్రీవారి ఆలయం ఉండాలని CM చంద్రబాబు అన్నారు. భారతీయులు ఉన్న ప్రతి దేశంలోనూ బాలాజీ ఆలయం ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. తిరుపతిలో జరిగిన టెంపుల్స్ కన్వెన్షన్ ఈవెంట్‌లో CM మాట్లాడారు. ‘ప్రస్తుతం ప్రతి ఇంట్లో ఓ AI నిపుణుడు తయారవుతున్నాడు. ఆలయాల నిర్వహణకు టెక్నాలజీ ఉపయోగించాలి. రాష్ట్రంలోని ఆలయాల్లో మౌలిక వసతులు పెంచాం’ అని వ్యాఖ్యానించారు.

TG: చిలుకూరు బాలాజీ టెంపుల్ అర్చకులు రంగరాజన్‌పై దాడి కేసులో ప్రధాన నిందితుడు వీరరాఘవను 3 రోజుల పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. రేపటి నుంచి పోలీసులు అతడిని విచారించనున్నారు. రామరాజ్యం పేరుతో ఓ వ్యవస్థను స్థాపించిన వీరరాఘవ ఇటీవల బృందంతో చిలుకూరు వెళ్లి తనకు మద్దతుతో పాటు డబ్బు ఇవ్వాలని రంగరాజన్‌పై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై తెలుగు రాష్ట్రాల CMలు స్పందించారు.
Sorry, no posts matched your criteria.