News February 15, 2025

VIRAL: ‘నువ్వు నీలాగే ఉండు’.. చాహల్ ఎమోషనల్ పోస్ట్

image

వాలంటైన్స్ డే సందర్భంగా టీమ్ ఇండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశారు. ‘నువ్వు నీలాగే ఉండు.. నీ జీవితాన్ని మార్చే ఛాన్స్ ఇతరులకు ఇవ్వకు’ అంటూ ఆయన పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. కాగా చాహల్ తన భార్య ధనశ్రీ వర్మతో విడాకులు తీసుకుంటున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. ఈ క్రమంలో ఆయన ఈ పోస్ట్ పెట్టడం చర్చనీయాంశంగా మారింది.

News February 15, 2025

నెక్స్ట్ అరెస్టు అయ్యేది వాళ్లే: బుద్ధా వెంకన్న

image

AP: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీది నీచమైన చరిత్ర అని టీడీపీ నేత బుద్ధా వెంకన్న అన్నారు. వంశీ పాపం పండిందని, అతడు బయట తిరిగితే సమాజానికి హానికరమని వ్యాఖ్యానించారు. కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, పేర్ని నాని, అంబటి రాంబాబు కూడా అరెస్టు అవుతారని జోస్యం చెప్పారు.

News February 15, 2025

భార్య ఆత్మహత్య.. భర్త ఫోన్‌లో వందల పోర్న్ వీడియోలు

image

విశాఖలో నవ వధువు <<15459302>>ఆత్మహత్య<<>> కేసులో భర్త నాగేంద్రను పోలీసులు రిమాండ్‌కు పంపారు. అతడి మొబైల్ సీజ్ చేశారు. అందులో వందలాది పోర్న్ వీడియోలు, గూగుల్ హిస్టరీ చూసి షాక్ అయ్యారు. శృంగార సామర్థ్యం పెంచుకునేందుకు అనేక మందుల కోసం వెతికినట్లు తేలింది. పెళ్లైన నెల నుంచే వేధింపులు మొదలయ్యాయని.. వయాగ్రా వాడుతూ, పోర్న్ వీడియోలు చూపిస్తూ అలానే చేయాలని భార్యను వేధించే వాడని ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు.

News February 15, 2025

చెప్పులతో కొడతాం: అపూర్వపై కర్ణి సేన ఫైర్

image

‘ఇండియా గాట్ లాటెంట్’ షోలో తల్లిదండ్రుల బంధంపై అసభ్యకర <<15437225>>కామెంట్స్<<>> చేసిన ఇన్‌ఫ్లూయెన్సర్ అపూర్వ మఖీజాపై విమర్శలు కొనసాగుతున్నాయి. తాజాగా రాజస్థాన్ టూరిజం- IIFA కలిసి నిర్వహిస్తోన్న ‘ట్రెజర్ హంట్ షూట్’లో ఆమె పాల్గొంటుండటంపై నిరసనలు వ్యక్తం కావడంతో తొలగించారు. సంస్కృతి లేని అపూర్వ రాజస్థాన్‌కు రావొద్దని, ఒకవేళ వస్తే చెప్పులతో కొడతామని రాజ్‌పుత్ కర్ణి సేన హెచ్చరించింది.

News February 15, 2025

భారీగా తగ్గిన బంగారం ధరలు

image

కొన్ని రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు ఈరోజు తగ్గి కాస్త ఉపశమనం ఇచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1000 తగ్గి రూ.78,900లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1090 తగ్గడంతో రూ.86,070కు చేరింది. అటు వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. కేజీ సిల్వర్ రేటు రూ.1,08,000గా ఉంది.

News February 15, 2025

నేడు దుబాయ్‌కి టీమ్ ఇండియా?

image

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం టీమ్ ఇండియా ఇవాళ దుబాయ్ పయనం కానున్నట్లు తెలుస్తోంది. ముంబై నుంచి జట్టు ఆటగాళ్లు దుబాయ్ ఫ్లైట్ ఎక్కుతారని సమాచారం. ఫిబ్రవరి 19 నుంచి మెగా లీగ్ ప్రారంభం కానుంది. 20న బంగ్లాదేశ్‌తో భారత్ తన తొలి మ్యాచ్ ఆడనుంది. 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది. భారత్ తమ మ్యాచులన్నీ దుబాయ్‌లోనే ఆడుతుంది. భారత్ ఒకవేళ సెమీఫైనల్, ఫైనల్‌కు వెళ్తే ఆ మ్యాచులూ ఇక్కడే జరుగుతాయి.

News February 15, 2025

అక్రమ వలసదారుల తరలింపు.. మాన్‌కు బీజేపీ కౌంటర్

image

అమెరికా నుంచి వస్తున్న అక్రమ వలసదారుల విమానాలను అమృత్‌సర్‌లో ల్యాండ్ చేసి పంజాబ్ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారని సీఎం భగవంత్ మాన్‌ చేసిన <<15466008>>వ్యాఖ్యలకు<<>> బీజేపీ కౌంటర్ ఇచ్చింది. ఇలాంటి సున్నితమైన అంశాల్లోనూ రాజకీయం చేయడం తగదని హితవు పలికింది. ఆప్ నేతలు దేశ భద్రతను పట్టించుకోరని, వారికి రాజకీయాలే కావాలని బీజేపీ ఎంపీ ప్రవీణ్ ఖండేల్వాల్ విమర్శించారు.

News February 15, 2025

సర్వే: ‘ఇండియా’ కూటమి ఉండాల్సిందే..

image

దేశంలో ప్రతిపక్షాల ‘ఇండియా’ కూటమి కొనసాగాల్సిందేనని ఇండియా టుడే-సీ ఓవర్ ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వేలో అత్యధిక మంది కోరుకున్నారు. 65% మంది ఈమేరకు అభిప్రాయపడగా 26% మంది అవసరంలేదని తేల్చి చెప్పారు. ఇక కూటమికి నాయకుడిగా రాహుల్ గాంధీకి అత్యధికంగా 24శాతం ఓట్లు రాగా 14శాతం ఓట్లతో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో కేజ్రీవాల్, అఖిలేశ్ నిలిచారు.

News February 15, 2025

అమరావతిలో క్యాన్సర్ ఆస్పత్రి: బాలకృష్ణ

image

బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి ద్వారా మరిన్ని సేవలు చేస్తానని ఆస్పత్రి ఛైర్మన్, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తెలిపారు. ఇందులో భాగంగా అమరావతిలోని తుళ్లూరులో త్వరలో ఆస్పత్రి ప్రారంభిస్తామని చెప్పారు. హైదరాబాద్ క్యాన్సర్ ఆస్పత్రిలో పీడియాట్రిక్ ఆంకాలజీ యూనిట్ ప్రారంభం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పేదలకు అందుబాటు ధరల్లోనే క్యాన్సర్‌కు చికిత్స అందిస్తామని ఆయన పేర్కొన్నారు.

News February 15, 2025

ఎలాన్ మస్క్ నా బిడ్డకు తండ్రి: రచయిత్రి

image

అపర కుబేరుడు ఎలాన్ మస్క్‌తో కలిసి తాను ఓ బిడ్డకు జన్మనిచ్చినట్లు రచయిత్రి ఆష్లే సెయింట్ క్లైర్ ఆరోపించారు. ఆ బిడ్డ మస్క్‌కు 13వ సంతానమని ఆమె తెలిపారు. తమ చిన్నారి గోప్యతకు ఎవరూ భంగం కలిగించొద్దని ఆమె వేడుకున్నారు. తన బిడ్డను సురక్షితంగా పెంచేందుకు కృషి చేస్తానని చెప్పారు. కాగా దీనిపై ఎలాన్ మస్క్ ఇంకా స్పందించలేదు.