India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: రాష్ట్రంలోని నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవలు యథావిధిగా కొనసాగుతాయని ఆస్పత్రుల సంఘం వెల్లడించింది. సంఘం నేతలు ఇవాళ మంత్రి సత్యకుమార్‌తో భేటీ అయ్యారు. తమ సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారని, రూ.500కోట్ల పెండింగ్ బకాయిలు సోమవారం విడుదల చేస్తామని చెప్పినట్లు పేర్కొన్నారు. వచ్చే నెలాఖరు నాటికి మరో రూ.250కోట్లు విడుదల చేయాలని మంత్రిని కోరినట్లు తెలిపారు.
తెలంగాణలోని పలు జిల్లాల్లో రేపు భారీ వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌లో భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగతా చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించింది.
AP: కోల్‌కతాలో జూనియర్ డాక్టర్‌పై హత్యాచారం ఘటనతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆస్పత్రుల్లో సురక్షిత పని వాతావరణం కల్పించేందుకు చర్యలు చేపట్టింది. ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది భద్రత కోసం ఔట్‌పోస్టుల వద్ద భద్రతను పెంచాలని నిర్ణయించింది. ఆస్పత్రుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని హోంమంత్రి అనిత అధికారులను ఆదేశించారు. వైద్యులు, సిబ్బందిపై దాడి జరిగితే వెంటనే కేసు నమోదు చేస్తామని వెల్లడించారు.
వాట్సాప్‌లో ‘Block messages from unknown accounts’ ప్రైవసీ ఫీచర్ రానుంది. దీనిని సెట్టింగ్స్‌లో ఎనేబుల్ చేసుకుంటే unknown నంబర్ల నుంచి పరిమితికి మించి మెసేజ్‌లు వచ్చినప్పుడు బ్లాక్ చేస్తుంది. దీంతో స్పామ్ మెసేజ్‌లు, హానికరమైన కంటెంట్ రాకుండా ఉంటుంది. అలాగే డివైస్ పర్ఫార్మెన్స్, స్టోరేజ్ కూడా తగ్గదు. వాట్సాప్ ఇప్పటికే యూజర్ల ప్రైవసీకి చర్యలు తీసుకుంటోంది. ఈ ఫీచర్‌తో అదనపు భద్రత లభించనుంది.
ఈనెల 15న థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ‘ఆయ్’ సినిమా బృందాన్ని Jr.NTR అభినందించారు. ఈ సందర్భంగా మూవీ టీమ్ ఆయనతో ఫొటోలు దిగింది. ఈ సినిమాకు అంజి మణిపుత్ర దర్శకత్వం వహించగా, ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ హీరోగా నటించారు. బన్నీవాసు నిర్మించారు.
ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకోకుండా సీఎం మమతా బెనర్జీ ధర్నాకు దిగడంపై నిర్భయ తల్లి ఆశాదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటన నుంచి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. మమతా పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. దేశంలో మహిళలకు భద్రత ఏ స్థాయిలో ఉందో ఈ ఘటనతో అర్థమవుతోందన్నారు. దోషులను కఠినంగా శిక్షించాలని ఆశాదేవి కోరారు.
ఈ రోజుల్లో దేశంలో క్రికెట్‌కు ఎంత క్రేజ్ ఉందో, 1950-65 మధ్య ఫుట్‌బాల్‌కు అంతటి క్రేజ్ తెచ్చినపెట్టిన వ్యక్తి సయ్యద్ అబ్దుల్ రహీమ్. HYDలో పుట్టిపెరిగిన రహీమ్ వల్ల భారత్ ఎన్నోమైలురాళ్లు దాటింది. 1951, 1962 ఆసియా కీడల్లో భారత ఫుట్‌బాల్ టీం స్వర్ణపతకాలు గెలవడంలో కోచ్‌గా రహీమ్‌ది కీలకపాత్ర. ఆయన జీవితంపై ఇటీవల అజయ్ దేవగణ్ హీరోగా ‘మైదాన్’ తెరకెక్కింది. నేడు రహీమ్ 115వ జయంతి.
TG: రూ.2లక్షలకు పైగా రుణాలు తీసుకున్న రైతులు రూ.2 లక్షలు పోను మిగిలిన మొత్తాన్ని బ్యాంకు ఖాతాలో జమ చేయాలని మంత్రి తుమ్మల సూచించారు. ఆ తర్వాత రూ.2 లక్షల రుణమాఫీ పథకాన్ని వర్తింపచేస్తామని తెలిపారు. రూ.2 లక్షల్లోపు రుణాలన్నింటిని మాఫీ చేసినట్లు పేర్కొన్నారు. అర్హులై ఉండి రుణమాఫీ కాని వారు వ్యవసాయాధికారులను సంప్రదించాలని సూచించారు.
తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశం ఆదివారం జరిగే అవకాశం ఉందని గాంధీ భవన్ వర్గాలు వెల్లడించాయి. రాజ్యసభ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికలను కులగణన తరువాత నిర్వహించాలా? లేక ప్రస్తుత ఓటర్ల జాబితా అధారంగా వెళ్లాలా అనే దానిపై చర్చించనున్నారు. అభిషేక్ మను సింఘ్వీ కూడా ఈ సమావేశంలో పాల్గొంటారని సమాచారం.
TG: రాష్ట్రంలో బయోడిజైన్ సిటీని ఏర్పాటు చేయాలని స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీని కోరినట్లు మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. ‘USలో 19 సంస్థలతో రూ.31,500కోట్ల విలువైన ఒప్పందాలు చేసుకున్నాం. ఈ పెట్టుబడులతో 30,750 ఉద్యోగాలు రానున్నాయి. సౌత్ కొరియాలో దాదాపు 12 కంపెనీలతో ఏఐ సిటీ, ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులపై చర్చించాం. మూసీ సుందరీకరణపై వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడితో మాట్లాడాం’ అని మీడియా సమావేశంలో తెలిపారు.
Sorry, no posts matched your criteria.