India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
USతో చైనా భాగస్వామిగా, మిత్రదేశంగా ఉండాలనుకుంటున్నట్లు చైనా రాయబారి షీ ఫెంగ్ తెలిపారు. హాంకాంగ్‌లో చైనా, అమెరికా అధికారులు పాల్గొన్న ఓ సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘అమెరికాను దాటాలనో లేక అంతర్జాతీయంగా ఆ స్థానంలోకి రావాలనో చైనా భావించడం లేదు. ఈ రెండు దేశాలు కలిసి పనిచేస్తే అపరిమిత ప్రయోజనాలుంటాయి. మన మధ్య ఉన్న సమస్యల్ని చర్చల ద్వారా పరిష్కరించుకుందాం’ అని పేర్కొన్నారు.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కాంకేర్ సరిహద్దు ప్రాంతాలు కాల్పుల మోతతో దద్దరిల్లాయి. భద్రతాబలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మృత్యువాతపడ్డారు. అక్కడ పోలీసులు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
సుజీత్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ నటిస్తోన్న ‘OG’ మూవీ షూటింగ్ 80% పూర్తయిందని తమన్ వెల్లడించారు. ఈ చిత్రంలో <<14602023>>రమణ గోగులతో<<>> ఓ పాట పాడించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. అలాగే పవర్ స్టార్ తనయుడు అకీరా నందన్ పియానో ట్యూన్ వర్క్ అందిస్తాడన్నారు. ఈ సినిమాకు ఇండియాలోనే అత్యధిక ఓపెనింగ్స్ వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. కాగా పవన్-గోగుల కాంబోలో వచ్చిన అన్ని పాటలు సూపర్‌హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే.
వృద్ధులకు ఎదురయ్యే సవాళ్లపై ప్రశ్న అడిగిన విధయ్రెడ్డి అనే విద్యార్థికి గూగుల్ AI బెదిరింపు సమాధానమివ్వడం చర్చనీయాంశంగా మారింది. ‘ఓ మనిషీ.. నువ్వేమీ స్పెషల్ కాదు. టైమ్, వనరులను వృథా చేస్తావు. సమాజానికి భారం. దయచేసి చావండి’ అని రిప్లై ఇచ్చింది. షాకైన అతను ఫిర్యాదుచేయగా ‘కొన్నిసార్లు నాన్ సెన్సికల్ రెస్పాన్స్‌లతో AIలు ప్రతిస్పందిస్తాయి. ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటాం’ అని గూగుల్ పేర్కొంది.
AP: తిరుమలలో రేపు కార్తీక వన భోజన కార్యక్రమం సందర్భంగా పలు ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. వర్ష సూచనల నేపథ్యంలో వన భోజనం నిర్వహణ వేదికను పార్వేట మండపం నుంచి వైభవోత్సవం మండపానికి మార్చినట్లు తెలిపింది. రేపు ఉ.11 గంటలకు గజ వాహనంపై ఊరేగింపుగా వైభవోత్సవ మండపానికి మలయప్పస్వామి రానున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో అధికారులు పటిష్ఠ ఏర్పాట్లు చేశారు.
మీ ఆధార్ దుర్వినియోగమైందా? లేదా? తెలుసుకోవాలంటే..
* <
* తర్వాత అథెంటికేషన్ హిస్టరీపై క్లిక్ చేయండి.
* అక్కడ ‘ఆల్’ని సెలెక్ట్ చేసి ‘ఫెచ్ అథెంటికేషన్ హిస్టరీ’పై క్లిక్ చేస్తే మీ ఆధార్ ఎక్కడెక్కడ ఉపయోగించారనే వివరాలు తెలిసిపోతాయి. మీ ఆధార్ దుర్వినియోగమైనట్లు తెలిస్తే 1947కి కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చు.
తమిళనాడులోని తిరునల్వేలిలో ‘అమరన్’ మూవీ ఆడుతున్న థియేటర్‌పై పెట్రోల్ బాంబు దాడి జరిగింది. ఇవాళ తెల్లవారుజామున ఇద్దరు వ్యక్తులు 3 పెట్రోల్ బాంబుల్ని హాల్‌పైకి విసరడం సీసీ కెమెరాల్లో నమోదైంది. స్థానికుల మధ్య ఉన్న తగాదాలే దీనికి కారణమని భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. సినిమాలో కొన్ని సన్నివేశాలపై తమిళనాట కొన్ని వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామన్నారు.
UPలోని ఝాన్సీలో మెడికల్ కాలేజీలో జరిగిన అగ్నిప్రమాదంలో 10 మంది పసిప్రాణాలు బలయ్యాయి. నవమాసాలు మోసి కన్న పిల్లల్ని అల్లారుముద్దుగా పెంచాలని, ఉన్నతంగా తీర్చిదిద్దాలని అమాయక తల్లులు పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయి. ప్రమాదం జరిగినప్పుడు తమ పిల్లల కోసం పిల్లల వార్డులోకి వెళుతుంటే సిబ్బంది తమను అడ్డుకున్నారని, చివరికి బిడ్డల డెడ్‌బాడీలను తీసుకొచ్చి ఇచ్చారని ఆ తల్లులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.
దిగ్గజ బాక్సర్ మైక్ టైసన్ కమ్ బ్యాక్ మ్యాచ్ ఆయన అభిమానుల్ని నిరాశపరిచింది. జేక్ పాల్ చేతిలో మైక్ 74-78 తేడాతో ఓటమి పాలయ్యారు. టెక్సాస్‌లోని ఏటీఅండ్‌టీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో జేక్ పాల్ సునాయసంగా గెలిచారు. అయితే, ఇది తన ఆఖరి మ్యాచ్ కాదని టైసన్ చెప్పడం గమనార్హం. మరోవైపు.. ఈ మ్యాచ్ మొదలుకాగానే పోటెత్తిన వ్యూయర్షిప్తో నెట్‌ఫ్లిక్స్ సైట్ క్రాష్ అయింది.
AP: ఇసుకలో దోచేశారని, ఇప్పుడు మద్యంలో స్టార్ట్ చేశారా? అని ప్రభుత్వాన్ని YCP Xలో ప్రశ్నించింది. మద్యం MRP రూ.120 అయితే రూ.130కి అమ్ముతూ కూటమి నేతలు జేబులు నింపుకుంటున్నారని ఆరోపించింది. ప్రభుత్వం చేతుల్లోంచి ప్రైవేటుకు మద్యం దుకాణాలు అప్పగించి దందా చేస్తున్నారని, ఎవరూ టెండర్ల వేయకుండా దౌర్జన్యం చేశారని మాజీ CM జగన్ ఆరోపించినట్లు పేర్కొంది. ‘మీ వాళ్లకి ఇంకెంత దోచిపెడతావ్ CBN’ అంటూ ప్రశ్నించింది.
Sorry, no posts matched your criteria.