News February 5, 2025

రేపు ఢిల్లీకి కేటీఆర్ బృందం!

image

TG: ఈ నెల 10న సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచారణ నేపథ్యంలో రేపు ఢిల్లీకి KTR బృందం వెళ్లనుంది. 2, 3 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండి న్యాయవాదులతో వారు చర్చించనున్నారు. కేటీఆర్ వెంట వినోద్, దాసోజు శ్రవణ్ కుమార్ వెళ్లనున్నారు. కాగా ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో చర్యలకు ఎంత సమయం తీసుకుంటారని సుప్రీం ప్రశ్నించిన విషయం తెలిసిందే. దీంతో అసెంబ్లీ సెక్రటరీ ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు.

News February 5, 2025

విదేశాలకు 47% పెరిగిన పళ్లు, కూరగాయల ఎగుమతులు

image

APEDA ఆర్థిక సహకారంతో గత ఐదేళ్లలో భారత్ నుంచి పళ్లు, కూరగాయాల ఎగుమతులు 47.3% పెరిగాయని కామర్స్ మినిస్ట్రీ తెలిపింది. విలువ పరంగా ఈ వృద్ధిరేటు 41.5% అని పేర్కొంది. FY 2023-24లో 123 దేశాలకు ఎగుమతులు చేరాయని వెల్లడించింది. రైతుల కోసం Intl ట్రేడ్ ఫెయిర్స్‌లో పాల్గొనడం, బయ్యర్ సెల్లర్ మీటింగ్స్ ఏర్పాటు, మార్కెట్ యాక్సెస్‌తో ఇది సాధ్యమైందని వివరించింది. గత మూడేళ్లలో 17 కొత్త మార్కెట్లలో ప్రవేశించామంది.

News February 5, 2025

JF కెనడీ భార్యపైనే నెహ్రూకు మరింత ఆసక్తి: Forgotten Crisis బుక్

image

ఫారిన్ పాలసీపై ఆసక్తి ఉన్న, అర్థం చేసుకోవాలనుకున్న, భవిష్యత్తులో ఏదైనా చేయాలనుకునే వారు JFK’s Forgotten Crisis బుక్ చదవాలని రాహుల్‌ను ఉద్దేశించి మోదీ నిన్న సూచించారు. ఫారిన్ పాలసీ పేరుతో 1962లో ఆడిన ఆట గురించి బాగా తెలుస్తుందంటూ సెటైర్ వేశారు. అప్పట్లో భారత పర్యటనకు వచ్చిన తనతో కాకుండా తన భార్య జాకీ, సోదరి జాక్/బాబీతో మాట్లాడేందుకే నెహ్రూ మరింత ఆసక్తి చూపినట్టు JF కెనడీ పేర్కొన్నట్టు అందులో ఉంది.

News February 5, 2025

ఏపీ నుంచి తెలంగాణ మీదుగా కుంభమేళాకు ప్రత్యేక రైళ్లు

image

జీవితంలో ఒక్కసారే వచ్చే మహా కుంభమేళాకు దక్షిణ మధ్య రైల్వే మరో 2 ప్రత్యేక రైళ్లు ప్రకటించింది. మచిలీపట్నం-దానాపూర్ మధ్య ఈ నెల 8, 16 తేదీల్లో ఈ రైళ్లు ఉ.11 గంటలకు బయల్దేరనున్నాయి. అలాగే దానాపూర్-మచిలీపట్నం మధ్య ఈ నెల 10, 18 తేదీల్లో మ.3.15 గంటలకు తిరిగి బయల్దేరనున్నాయి. విజయవాడ, ఖమ్మం, వరంగల్, పెద్దపల్లి, మంచిర్యాల నాగ్‌పూర్, మీదుగా ఈ రైళ్లు ప్రయాగ్‌రాజ్ వెళ్లనున్నాయి.

News February 5, 2025

దానం నివాసంలో ఫిరాయింపు ఎమ్మెల్యేల భేటీ!

image

TG: అసెంబ్లీ సెక్రటరీ నోటీసుల నేపథ్యంలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు దానం నాగేందర్ నివాసంలో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో సమావేశమయ్యారు. న్యాయపరంగా ముందుకెళ్లే అంశం, అసెంబ్లీ సెక్రటరీ, సుప్రీంకు సమాధానం ఇవ్వడంపై చర్చిస్తున్నట్లు సమాచారం. అవసరమైతే ఢిల్లీకి వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

News February 5, 2025

అకౌంట్లలోకి రైతుభరోసా డబ్బులు

image

TG: రైతుభరోసా నిధుల జమను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ప్రారంభించింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో రైతుల అకౌంట్లలో ఇవాళ్టి నుంచి డబ్బులు జమ చేస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఒక ఎకరం వరకు సాగులో ఉన్న భూములకు మొత్తం 17.03 లక్షల రైతుల ఖాతాల్లో ఇవాళ నిధులు జమ అవుతాయన్నారు.

News February 5, 2025

రేపు ఎమ్మెల్యేలతో రేవంత్, మున్షీ భేటీ

image

TG: రేపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ఆ పార్టీ రాష్ట్ర అధిష్ఠానం భేటీ కానుంది. వారిని నాలుగు గ్రూపులుగా విడదీసి సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఇంఛార్జి దీపాదాస్ మున్షీ, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సమావేశం కానున్నారు. ఇటీవల జరుగుతున్న పరిణామాలు, కులగణనపై ప్రచారం వంటి అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

News February 5, 2025

వాళ్లంతా కుంభమేళాకు వెళ్లి చచ్చిపోవాలి: ఎంపీ పప్పూ

image

బిహార్‌కు చెందిన స్వతంత్ర ఎంపీ పప్పూ యాదవ్ లోక్‌సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తొక్కిసలాటలో చనిపోయిన వారందరికీ మోక్షం దక్కిందని ఓ బాబా అన్నారని.. దాన్ని బట్టి రాజకీయ నాయకులు, ధనవంతులు, బాబాలు త్రివేణీ సంగమంలో మునిగి చనిపోవాలని సూచించారు. వారికి మోక్షం వస్తుందని ఎద్దేవా చేశారు. తొక్కిసలాటలో చనిపోయిన వందలాది మందిని దహన సంస్కారాలు లేకుండా తీసిపారేశారని పప్పూ ఆవేదన వ్యక్తం చేశారు.

News February 5, 2025

రాహుల్.. ఎన్నికల గాంధీగా పేరు మార్చుకోండి: కేటీఆర్

image

TG: నిన్న అసెంబ్లీ సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి క్లారిటీ లేదని, బీసీ డిక్లరేషన్ పేరుతో సిగ్గులేకుండా అబద్ధాలు చెప్పిందనే విషయాలు ప్రజలకు అర్థమయ్యాయని KTR ట్వీట్ చేశారు. కులగణన నివేదికతో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే ఉద్దేశం లేదని స్పష్టమైందని తెలిపారు. గ్యారంటీలు, హామీలు, డిక్లరేషన్లు రాజకీయాల కోసమేనని అర్థమైందన్నారు. రాహుల్ గాంధీ పేరును ఎలక్షన్ గాంధీగా మార్చుకోవాలన్నారు.

News February 5, 2025

రోహిత్ శర్మ రిటైర్‌మెంట్?

image

ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న రోహిత్ శర్మ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పే సూచనలు కనిపిస్తున్నాయి. BCCI వర్గాల సమాచారం ప్రకారం.. భవిష్యత్తుపై క్లారిటీ ఇవ్వాలని బోర్డు ఇప్పటికే రోహిత్‌కు సూచించింది. ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన అనంతరం రోహిత్ తన రిటైర్మెంట్‌పై ఓ నిర్ణయానికి వచ్చే ఛాన్స్ ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఆధారంగా కొత్త సారథిని ఎంపిక చేయనున్నారని తెలుస్తోంది.