News February 4, 2025

ప్రధాని మోదీ అమెరికా షెడ్యూల్ ఖరారు?

image

నరేంద్ర మోదీ ఫిబ్రవరి 12న అమెరికా పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల పర్యటనలో మోదీ ఈ నెల 13న ట్రంప్‌తో భేటీ కానున్నారు. ఇరువురు దేశాధినేతలు ట్రేడ్, ట్యాక్స్, వీసా సమస్యలు తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. అనంతరం ఇండియాకు చెందిన వ్యాపారవేత్తలను మోదీ కలవనున్నారు. జనవరిలో రిపోర్టర్‌ ప్రశ్నకు ట్రంప్ బదులిస్తూ ఫిబ్రవరిలో మోదీ అమెరికాలో పర్యటించనున్నట్లు తెలిపారు.

News February 4, 2025

ఆర్థిక క్రమశిక్షణ లేకపోతే జరిగేది ఇదే!

image

KBCలో రూ.5 కోట్లు గెలుచుకున్న సుశీల్ కుమార్ గుర్తున్నాడా? 2011లో ఈయన విజయం గురించి దేశం మొత్తం మాట్లాడుకుంది. కానీ, ఆయన విజయం కొన్ని రోజుల్లోనే విషాదంగా మారింది. సరైన ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడంతో ఆయన రోడ్డునపడ్డారు. అడిగిన వారికి డబ్బు ఇచ్చేయడం, ఆలోచించకుండా బిజినెస్ పెట్టి మొత్తం లాస్ అయ్యాడు. దీంతో భార్యతో తరచూ వాదనలు పెట్టుకొని ఆమెతోనూ విడిపోయాడు. మళ్లీ చదువుకొని ప్రస్తుతం టీచర్‌గా మారారు.

News February 4, 2025

ఆక్సిజన్ అధికంగా అందించే చెట్లు మీకు తెలుసా?

image

1.మర్రిచెట్టు- అధికంగా ఆక్సిజన్ అందించటంతో పాటు వాతావరణంలో CO2 శాతాన్ని తగ్గిస్తుంది.2 వేప- సహజ క్రిమి సంహారిణిగా పనిచేస్తుంది.3 రావి- రాత్రివేళల్లోనూ ఆక్సిజన్ అందిస్తుంది. పర్యావరణ రక్షణకు ఎంతోమేలు. 4 కరివేపాకు 5వెదురుబొంగు- ఇతరవాటితో పోలిస్తే 33శాతం అధికంగా ప్రాణవాయువును విడుదల చేస్తాయి.
*మనీ ప్లాంట్, స్నేక్ ప్లాంట్, తులసి, కలబంద మొక్కలు సైతం అధిక మోతాదులో ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తాయి.

News February 4, 2025

సచిన్ మరో రికార్డుకు చేరువలో విరాట్ కోహ్లీ

image

సచిన్ రికార్డులను బద్దలుకొడుతున్న కోహ్లీ మరో ఘనతకు చేరువలో ఉన్నారు. వన్డేల్లో మరో 94 రన్స్ చేస్తే అత్యంత వేగంగా 14K రన్స్ చేసిన బ్యాటర్‌గా రికార్డ్ సృష్టిస్తారు. సచిన్ 350వ ఇన్నింగ్స్‌లో ఈ ఘనత అందుకున్నారు. కోహ్లీ ఇప్పటి వరకు 283 INGలు ఆడి, 13,906 పరుగులు చేశారు. విరాట్‌ ఇంకా 55 ఇన్నింగ్స్ దూరంలోనే ఉన్నా, 6న ప్రారంభమయ్యే ఇంగ్లండ్ సిరీస్‌లోనే ఆ రికార్డ్ బ్రేక్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

News February 4, 2025

జేఈఈ(మెయిన్) ప్రిలిమినరీ ఆన్సర్ కీ విడుదల

image

జేఈఈ (మెయిన్) ప్రిలిమినరీ ఆన్సర్ కీ విడుదలైంది. దీంతో పాటు రెస్పాన్స్ షీట్లు విద్యార్థులకు అందుబాటులోకి వచ్చాయి. నేటి నుంచి 6వ తేదీ వరకు వీటిపై NTA అభ్యంతరాలు స్వీకరిస్తుంది. జనవరి 22 నుంచి 29 వరకు జేఈఈ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఇక్కడ <>క్లిక్<<>> చేసి అధికారిక సైట్‌లోకి వెళ్లి ప్రిలిమినరీ కీ, రెస్పాన్స్ షీట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

News February 4, 2025

రేపు మహాకుంభమేళాకు ప్రధాని మోదీ

image

ప్రధాని మోదీ రేపు(FEB 5) ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాకు వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు త్రివేణి సంగమం వద్ద ఆయన పవిత్ర స్నానం చేసి గంగామాతకు ప్రత్యేక పూజలు చేస్తారని ప్రధాని కార్యాలయం తెలిపింది. అటు రేపు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రధాని మహాకుంభమేళాకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.

News February 4, 2025

భారతీయులకు మొబైల్ వ్యసనంగా మారిందా?

image

పై ప్రశ్నకు సెన్సార్ టవర్స్ రిపోర్ట్ అవుననే సమాధానం చెబుతోంది. దాని ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా ఆన్‌లైన్ స్క్రీన్ వినియోగంలో భారత్ తొలిస్థానంలో ఉంది. 2024లో భారత్ ఏకంగా 1.12 ట్రిలియన్ల గంటలు మొబైల్ ఫోన్లో గడిపిందని రిపోర్ట్ తెలిపింది. మనదేశంలో ఆన్‌లైన్ స్క్రీన్ వినియోగంలో 13% వృద్ధి కనిపిస్తే, అమెరికాలో 0.6% తగ్గింది. దీంతో ఓ టైమ్ నిర్దేశించుకొని మొబైల్ చూడాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

News February 4, 2025

తల్లి బతికుండగానే పెద్దకర్మ భోజనాలు.. ఎందుకంటే?

image

AP: తల్లి బతికుండగానే కుమారులు పెద్దకర్మ భోజనాలు పెట్టిన ఘటన కృష్ణా(D) పెడన(M) ముచ్చర్లలో జరిగింది. రంగమ్మ(80) తన ఆస్తిని కుమారులకు రాసేశారు. చనిపోయాక కొడుకులు పెద్దకర్మ భోజనాలు పెడతారో? లేదో? అని డౌట్ వచ్చింది. దీంతో బతికుండగానే ఆ కార్యక్రమం చేయాలని కుమారులను ఆమె కోరింది. తొలుత వారు షాక్‌కు గురైనా, ఆమె ఒత్తిడితో చివరకు బంధువులు, గ్రామస్థులను పిలిచి భోజనాలు వడ్డించారు. దీంతో రంగమ్మ సంతోషించారు.

News February 4, 2025

తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు పంపాలని నిర్ణయం

image

TG: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఆయనకు షోకాజ్ నోటీసులు పంపాలని క్రమశిక్షణ కమిటీ నిర్ణయించింది. మల్లన్న ఓ వర్గాన్ని తీవ్రంగా దూషించారని, సొంత పార్టీపైనే విమర్శలు చేస్తున్నారని నాయకులు, కార్యకర్తలు ఫిర్యాదులు చేస్తున్న నేపథ్యంలో హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకుంది.

News February 4, 2025

వ్యాపారులను వేధించొద్దు: సీఎం సూచన

image

AP: ఆదాయార్జన శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సరికొత్త విధానాలతో ప్రభుత్వ ఆదాయం పెంచాలని, పన్ను ఎగవేతలు లేకుండా చూడాలని ఈ సందర్భంగా ఆదేశించారు. వ్యాపారులను వేధించవద్దని అధికారులకు సూచించారు. ఆదాయార్జన శాఖల్లో పనితీరు మెరుగుపడాలన్నారు. ఫలితాలు కనిపించేలా కార్యాచరణ ఉండాలని సీఎం స్పష్టం చేశారు.