India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నిన్న నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 517 పాయింట్ల లాభంతో 77,704 వద్ద, నిఫ్టీ 154 పాయింట్లు లాభపడి 23,511 వద్ద కొనసాగుతున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 87.2గా ఉంది.

సీనియర్ నటి కుష్బూ సుందర్ గాయపడ్డారు. చేతికి కట్టుతో ఉన్న ఫొటోను ఆమె ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు. అనుకోని గాయాలు మన ప్రయాణాన్ని ఆపాలని చూసినా ఆగిపోవద్దని, చిరునవ్వుతో ముందుకు సాగాలని రాసుకొచ్చారు. కాగా ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

రాష్ట్రంలో నిన్న వాయిదా పడిన 5 చోట్ల ఎన్నికలు ఇవాళ జరగనున్నాయి. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్, ఎన్టీఆర్(D) నందిగామ మున్సిపల్ ఛైర్ పర్సన్, పిడుగురాళ్ల, తుని మున్సిపల్ ఛైర్మన్, పాలకొండ నగరపంచాయతీ ఛైర్ పర్సన్ పదవులకు అధికారులు ఎన్నికలు నిర్వహించనున్నారు. పలు కారణాలతో నిన్న ఈ ఐదు చోట్ల ఎలక్షన్ వాయిదా పడింది.

TG: ఎస్సీ వర్గీకరణపై మంత్రి వర్గ సబ్ కమిటీకి ఏకసభ్య కమిషన్ నివేదిక అందజేసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం 4 కేటగిరీలుగా విభజించాలని ప్రతిపాదించింది. మొదటి కేటగిరిలో అత్యంత వెనుకబడిన ఉపకులాలు, రెండో కేటగిరీలో మాదిగ, మాదిగ ఉపకులాలు, మూడో కేటగిరీలో మాల, మాల ఉపకులాలు, నాలుగో కేటగిరీలో ఇతర ఉపకులాలుగా విభజించాలని సూచించింది.

TG: ఎమ్మార్పీఎస్ చీఫ్ మందకృష్ణ మాదిగ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే రెండు మూడు రోజుల్లో ఏదైనా జరగవచ్చన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం దేనికైనా సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. వారసత్వ ప్రదర్శనకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం బాధాకరమని చెప్పారు. గత 30 ఏళ్లలో ఎమ్మార్పీఎస్ ఉద్యమంలో ఎప్పుడూ శాంతిభద్రతలకు విఘాతం కలగలేదని తెలిపారు. మరోవైపు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై ప్రకటన చేసే అవకాశముంది.

రాత పరీక్షల విషయంలో దివ్యాంగులకు సుప్రీం కోర్టు ఊరటనిచ్చింది. పరీక్షల్లో రాత సహాయకులను పొందేందుకు 40% వైకల్యం ఉన్నట్లు సర్టిఫికెట్ ఉండాలన్న నిబంధనను తొలగించింది. ఎలాంటి ప్రామాణికం లేకుండా వికలాంగులందరూ పరీక్ష రాయడానికి స్క్రైబ్‌లను ఉపయోగించుకోవచ్చని స్పష్టం చేసింది. 2022, ఆగస్టు 10న జారీ చేసిన ఆఫీస్ మెమోరాండంను పునఃసమీక్షించాలని, ఆంక్షలను తొలగించాలని కేంద్రాన్ని ధర్మాసనం ఆదేశించింది.

TG: DSC-2008 బీఈడీ అభ్యర్థులకు హైకోర్టు ఊరట కలిగించింది. 1,382 మందిని ఈ నెల 10లోగా కాంట్రాక్టు టీచర్లుగా నియమించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎన్నికల కోడ్‌తో దీనికి సంబంధం లేదని స్పష్టం చేసింది. 2008న ఉమ్మడి ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడింది. ఎస్జీటీ పోస్టుల్లో 30 శాతం డీఈడీ అభ్యర్థులకు కేటాయించింది. తమకంటే తక్కువ అర్హత కలిగినవారికి రిజర్వేషన్ ఇవ్వడంపై బీఈడీ అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు.

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో 5.60 యావరేజ్‌తో కేవలం 28 రన్స్ చేసిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చెత్త రికార్డును మూటగట్టుకున్నారు. అతని కెరీర్‌లో ఒక సిరీస్‌లో ఇదే లోయెస్ట్ యావరేజ్. 2022లో ఐర్లాండ్‌పై 7.50 AVGతో 15 రన్స్, 2024లో సౌతాఫ్రికాపై 8.66 యావరేజ్‌తో 26 పరుగులు చేశారు. సూర్య బ్యాటర్‌గా విఫలమవుతున్నా కెప్టెన్‌గా సక్సెస్ అవుతున్నారు. అతని సారథ్యంలో 23 మ్యాచ్‌లు ఆడగా భారత్ 18 గెలిచింది.

AP: తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉత్కంఠగా మారింది. పీఠాన్ని కైవసం చేసుకునేందుకు కూటమి, YCP తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమ పార్టీ MLC సిపాయి సుబ్రహ్మణ్యాన్ని TDP నేతలు కిడ్నాప్ చేశారని YCP ఆరోపిస్తోంది. అర్ధరాత్రి తర్వాత ఆయనను నివాసం నుంచి తీసుకెళ్లినట్లు చెబుతోంది. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. డిప్యూటీ మేయర్ ఎన్నికలో ఎక్స్‌అఫిషియో సభ్యుడిగా ఉన్న ఆయన ఓటు కీలకం కానుంది.

అల్లు అర్జున్‌కు స్టార్ ఇమేజ్ వల్లే పుష్ప సినిమా చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపించారని, రష్మిక వల్ల కాదని బాలీవుడ్ నటుడు ఆకాశ్ దీప్ చెప్పారు. అందుకే ఐకాన్ స్టార్‌కు ₹100Cr రెమ్యునరేషన్ అందగా, నేషనల్ క్రష్‌కు ₹10Cr వచ్చిందన్నారు. సైఫ్‌పై దాడి గురించి స్పందిస్తూ ‘₹21Cr పారితోషికం తీసుకుంటున్నా కరీనా ఇంటి బయట వాచ్‌మెన్‌ను పెట్టుకోలేదు. వాళ్లకు ₹100Cr ఇస్తేనే నియమించుకుంటారేమో’ అని ఎద్దేవా చేశారు.
Sorry, no posts matched your criteria.