India's largestHyperlocal short
news App
            Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: పథకాల కోసం అర్హులైన వారెవరూ రూపాయి లంచం కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వరంగల్‌లో మంత్రి కొండా సురేఖతో కలిసి 4 పథకాల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. పథకాల కోసం కొత్త దరఖాస్తులు ఎన్ని వచ్చినా తీసుకుంటామని స్పష్టం చేశారు. అనర్హులకు లబ్ధి చేకూరినట్లు తేలితే వారికి మధ్యలోనే పథకాలను ఆపేస్తామన్నారు. త్వరలో ఇంటింటికి సన్న బియ్యం పంపిణీ చేస్తామని పేర్కొన్నారు.

అప్పుల ఊబిలో ఉన్న బంగ్లాదేశ్‌కు అమెరికా షాకిచ్చింది. ఆ దేశానికి ఇచ్చే అన్ని రకాల సాయాలను నిలిపివేస్తున్నట్లు అమెరికా దాతృత్వ సంస్థ USAID ప్రకటించింది. బంగ్లాతో ప్రస్తుతం జరుగుతున్న, మున్ముందు జరగాల్సిన అన్ని సహాయక కార్యక్రమాలను నిలిపేస్తున్నట్లు స్పష్టం చేసింది. భారత విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్‌తో భేటీ అయిన కొన్ని రోజులకే అమెరికా ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

TG: కొడంగల్(ని) చంద్రవంచ బహిరంగ సభలో KCR టార్గెట్‌గా CM రేవంత్ రెడ్డి ప్రసంగించారు. KCR కుటుంబంలా తమ ఇంట్లో అందరూ పదవులు పొందలేదని చెప్పారు. కుమారుడు, కుమార్తె, అల్లుడు, బంధువులకు KCR పదవులు ఇచ్చారని, కుమార్తె MP ఎన్నికల్లో ఓడిపోతే వెంటనే MLC చేశారని వెల్లడించారు. ఇలా బంధువులందరికీ పదవులు ఇస్తే మంచిదా? అని ప్రశ్నించారు. కుటుంబానికి పదవులు ఇచ్చి దోపిడీ చేసే వ్యక్తిని తాను కాదని CM స్పష్టం చేశారు.

TG: కరీంనగర్ మాజీ MLC, సీనియర్ జర్నలిస్టు ఆర్.సత్యనారాయణ అనారోగ్యంతో సంగారెడ్డిలోని తన నివాసంలో మృతి చెందారు. ఆయన మృతి పట్ల CM రేవంత్, BRS అధినేత KCR, మంత్రి పొన్నం ప్రభాకర్, హరీశ్‌రావు సహా పలువురు నేతలు సంతాపం తెలియజేశారు. 2007లో కరీంనగర్ గ్రాడ్యుయేట్ MLCగా గెలిచిన ఆయన, 2008లో తెలంగాణ ఉద్యమం కోసం ఆ పదవికి రాజీనామా చేశారు. TSPSC సభ్యుడిగానూ వ్యవహరించారు. గతేడాది కాంగ్రెస్ పార్టీలో చేరారు.

AP: కూటమి మధ్య విభేదాలు సృష్టించేలా జరుగుతున్న ప్రచారంపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఘాటుగా స్పందించారు. కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. తామెప్పుడూ సమస్యలపైనే పోరాటం చేశామని తెలిపారు. పదవుల కోసం టైమ్ వేస్ట్ కార్యక్రమాల్లో పాల్గొనవద్దని జనసేన కార్యకర్తలకు ఆయన వార్నింగ్ ఇచ్చారు. పార్టీ సిద్ధాంతం కోసమే అందరూ నిలబడాలని, రహస్యంగా లేఖలు, సమావేశాలు వద్దని సూచించారు.

తల్లిదండ్రులు విడిపోయిన పిల్లలకు పెద్దయ్యాక గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువని కెనడా పరిశోధకుల అధ్యయనంలో తేలింది. ‘65 ఏళ్లు దాటిన 13వేలమందిపై మా సర్వే నిర్వహించాం. 18 ఏళ్లు వచ్చేలోపు తల్లిదండ్రులు విడిపోవడాన్ని చూసినవారిలో 60శాతంమందికి గుండెపోటు వచ్చింది. వారు డిప్రెషన్, డయాబెటిస్ వంటివాటితో బాధపడుతున్నట్లు గుర్తించాం. ఇవన్నీ కలగలిపే గుండెపోటుకు దారి తీస్తున్నాయి’ అని తమ నివేదికలో వివరించారు.

మెన్స్ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్-2024గా శ్రీలంక ప్లేయర్ కమిందు మెండిస్‌ను ICC ఎంపిక చేసింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. గత ఏడాది మెండిస్ అద్భుతమైన ప్రదర్శన చేశారు. 50కి పైగా సగటుతో అన్ని ఫార్మాట్లలో 1,451 పరుగులు చేశారు. ఇందులో 9 టెస్టుల్లో 74.92 యావరేజీతో 1,049 పరుగులు చేయడం గమనార్హం.

TG: పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని సీఎం రేవంత్ విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక కొత్త కార్డులు ఇస్తున్నామని తెలిపారు. త్వరలోనే రేషన్ కార్డులు ఉన్నవారికి సన్నబియ్యం ఇస్తామన్నారు. బీఆర్ఎస్ పాలనలో పేదలకు ప్రభుత్వ ఇళ్లు రాలేదని మండిపడ్డారు. తాము పేదలు ఇళ్లు నిర్మించుకుంటే రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేస్తున్నామని పేర్కొన్నారు.

ఏ విషయాన్నైనా యూజర్లకు వే2న్యూస్ సరళంగా, సంక్షిప్తంగా చెబుతోంది. అలాంటి వే2న్యూస్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. మీరేం చెబుతారు. మా గురించి మీకంటే బాగా ఎవరికీ తెలియదు కాబట్టే మిమ్మల్ని అడుగుతున్నాం. ‘వే2న్యూస్ అంటే ఇది’ అనేలా ఒక్కమాటలో మంచి ట్యాగ్ లైన్ ఇస్తే రూ.25 వేల ప్రైజ్ మనీ మీ సొంతం.
కింద Submit Now బటన్ క్లిక్ చేసి గూగుల్ ఫామ్‌లో మీ ట్యాగ్ లైన్ మాకు చెప్పండి.
<

TG: భూమికి విత్తనానికి ఉండే బలమైన అనుబంధం రైతుకు కాంగ్రెస్ పార్టీకి ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కొడంగల్(ని) చంద్రవంచ గ్రామంలో నూతన పథకాల ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ముందు నుంచీ రైతు పక్షపాతిగా ఉందని చెప్పారు. వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తూ వ్యవసాయాన్ని పండగలా మారుస్తున్నామని పేర్కొన్నారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి ఏడాదిలోనే 55,143 ఉద్యోగాలు ఇచ్చామని వెల్లడించారు.
Sorry, no posts matched your criteria.