News January 30, 2025

పాన్ వెబ్‌సైట్‌ను తమిళంలోనూ అందుబాటులోకి తేవాలి: సినీ హీరో

image

పాన్ కార్డు వెబ్‌సైట్, సంబంధిత వివరాలను తమిళ భాషలోనూ అందుబాటులోకి తీసుకురావాలని సినీ హీరో విజయ్ సేతుపతి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. పాన్ వెబ్‌సైట్ హిందీ, ఇంగ్లిష్ భాషల్లో మాత్రమే ఉండటంతో తమిళ్ మాట్లాడేవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. సమాచారం ప్రజలకు అర్థమయ్యే భాషలో ఉండాలని, అలా ఉంటేనే ఎలాంటి సమస్యలు ఉండవని అభిప్రాయపడ్డారు.

News January 30, 2025

Great: ఒకరోజు వయసున్న శిశువుకు విజయవంతంగా గుండె ఆపరేషన్

image

ఢిల్లీలోని ఫోర్టీస్ ఎస్కార్ట్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ డాక్టర్లు అద్భుతం చేశారు. ఒక్కరోజు వయసున్న UP, బరేలీ నవజాత శిశువుకు విజయవంతంగా గుండె ఆపరేషన్‌ చేశారు. 20 వారాల ప్రెగ్నెన్సీ స్కాన్‌లో డాక్లర్లు కడుపులోని బిడ్డకు TGA గుండెజబ్బును గుర్తించారు. అంటే రంధ్రంతో పాటు ధమనులు తిరగేసి ఉంటాయి. శిశువు జన్మించగానే వారు 3 గంటలు శ్రమించి సర్జరీ చేశారు. 16 రోజుల తర్వాత ఇంటికి పంపించారు.

News January 30, 2025

విద్యార్థుల ఫోన్లకే ఇంటర్ హాల్ టికెట్లు

image

TG: ఇంటర్ పరీక్షల హాల్ టికెట్లను విద్యార్థులు ఇచ్చిన ఫోన్ నంబర్లకే పంపాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. ఫోన్‌కు వచ్చిన లింక్‌ను క్లిక్ చేసి హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఫస్టియర్ ఇంటర్నల్ పరీక్షల హాల్ టికెట్లు ఇప్పటికే పంపించామని, ఈనెల 3 నుంచి జరగనున్న సెకండియర్ ప్రాక్టికల్స్‌కూ ఇలానే పంపిస్తామని చెప్పారు. కాగా మార్చి 5 నుంచి వార్షిక పరీక్షలు జరగనున్నాయి.

News January 30, 2025

అలాంటి ఇళ్ల క్రమబద్ధీకరణ.. ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

image

AP: పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఆక్రమణకు గురైన అభ్యంతరం లేని భూముల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం విధివిధానాలు ఖరారు చేసింది. 2019 అక్టోబర్ 15ను కటాఫ్ డేట్‌గా ప్రకటిస్తూ ఉత్తర్వులిచ్చింది. ఆ తేదీ కంటే ముందు ఆక్రమిత స్థలాల్లో నివాసం ఉంటే రెగ్యులరైజేషన్‌కు అవకాశం ఉంటుంది. పేదలకు 150 గజాల వరకు ఉచితంగా, అంతకంటే ఎక్కువ భూమి ఉంటే సాధారణ రిజిస్ట్రేషన్ విలువతోనే క్రమబద్ధీకరిస్తారు.

News January 30, 2025

క్రమబద్ధీకరణ ప్రక్రియ ఇలా..

image

AP: ఆక్రమిత ప్రభుత్వ స్థలాల్లో 2019 OCT 15 కంటే ముందు ఇళ్లు కట్టుకున్న వారు ఈ ఏడాది DEC 31 వరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. దీనిపై అధికారులు విచారణ చేసి MRO/RDO/మున్సిపల్‌ కమిషనర్లకు నివేదికలు ఇస్తారు. వీటిని సబ్‌ డివిజనల్‌ కమిటీలో చర్చించి తహశీల్దార్‌ కన్వేయెన్స్‌ డీడ్‌ల రూపంలో క్రమబద్ధీకరణ ఉత్తర్వులు ఇస్తారు. రెండేళ్ల తర్వాత లబ్ధిదారులకు ఆ భూములపై శాశ్వత హక్కులు వస్తాయి.

News January 30, 2025

రెగ్యులరైజేషన్‌కు అర్హులు వీరే

image

AP: గ్రామాల్లో నెలకు గరిష్ఠంగా రూ.10,000, పట్టణాల్లో రూ.14,000 ఆదాయం మాత్రమే ఉండాలి. నెలకు రూ.300లోపే విద్యుత్తు ఛార్జీలు చెల్లించి ఉండాలి. మెట్ట, మాగాణి కింద కలిపి 10 ఎకరాలకు మించి ఉండకూడదు. RCC రూఫ్‌/ఆస్‌బెస్టాస్‌ రూఫ్‌ను ఇటుక గోడలతో నిర్మించి ఉండాలి. రిజిస్టర్డ్‌ డాక్యుమెంట్, ఆస్తిపన్ను చెల్లింపు, విద్యుత్తు బిల్లు, వాటర్‌ బిల్లులను పరిగణనలోకి తీసుకుని క్రమబద్ధీకరిస్తారు.

News January 30, 2025

బాలామృతంలో కొత్త ఫ్లేవర్లు!

image

TG: 6 నెలల నుంచి మూడేళ్ల లోపు పిల్లలకు అంగన్‌వాడీల్లో ఇచ్చే బాలామృతాన్ని వారానికి 3, 4 ఫ్లేవర్లలో అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. రోజూ ఒకే రకమైన పౌడర్ ఇవ్వడంతో చిన్నారులు తినడం లేదని ఫిర్యాదులు రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. కొత్తగా ఏమేం కలపాలన్న దానిపై అధికారుల నుంచి నివేదిక వచ్చిన తర్వాత మార్పులు చేయనున్నారు. రాష్ట్రంలో 10 లక్షల మంది చిన్నారులకు ప్రభుత్వం బాలామృతాన్ని ఉచితంగా అందిస్తోంది.

News January 30, 2025

కార్తికేయుని పాత్రలో అల్లు అర్జున్?

image

‘పుష్ప-2’తో భారీ విజయాన్ని అందుకున్న అల్లు అర్జున్ తన తర్వాతి సినిమాను త్రివిక్రమ్‌తో చేయబోతున్నారు. ఈ మూవీని హిందూ పురాణాల ఆధారంగా తెరకెక్కిస్తారని, శివుడి కుమారుడు కార్తికేయుని పాత్రలో బన్నీ కనిపిస్తారని వార్తలొస్తున్నాయి. ‘గాడ్ ఆఫ్ వార్’గా కార్తికేయుని ప్రయాణం, తండ్రి శివుడిని ఆయన తిరిగి కలుసుకోవడం వంటి అంశాలను చూపిస్తారని ప్రచారం జరుగుతోంది. దీనిపై మూవీ టీమ్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది.

News January 30, 2025

ఉగ్రవాదుల్ని బంధించే చోటికి అక్రమ వలసదారుల తరలింపు

image

అక్రమ వలసదారుల నియంత్రణకు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వారందరినీ గ్వాంటనామో బేకు తరలించేందుకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీచేస్తానన్నారు. 30వేల పడకలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ‘కొన్ని దేశాలపై నాకు నమ్మకం లేదు. వారిని మళ్లీ తిరిగిపంపొచ్చు. అందులో కొందరు USకు అత్యంత ప్రమాదకరం. వారు గ్వాంటనామో నుంచి తప్పించుకోలేరు’ అని అన్నారు. సాధారణంగా ఇక్కడ ఉగ్రవాదులను బంధించి టార్చర్ చేస్తుంటారు.

News January 30, 2025

Stock Markets: ఫ్లాట్‌గా మొదలవ్వొచ్చు

image

స్టాక్‌మార్కెట్లు ఫ్లాట్‌గా మొదలై రేంజుబౌండ్లో కొనసాగొచ్చు. గిఫ్ట్‌నిఫ్టీ ఫ్లాటుగా చలిస్తుండటం దీనినే సూచిస్తోంది. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలే అందుతున్నాయి. US ఫెడ్ వడ్డీరేట్లను 4.25-4.5% వద్ద యథాతథంగా ఉంచడంతో మొదట US స్టాక్స్ పతనమయ్యాయి. పాలసీలో మార్పేమీ లేదని ఫెడ్ ఛైర్మన్ చెప్పాక పుంజుకున్నాయి. నిఫ్టీ సపోర్టు 23,029, రెసిస్టెన్సీ 23,187 వద్ద ఉన్నాయి. IT, FIN షేర్లపై ఫోకస్ పెరిగింది.