India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 8న యాదాద్రి గుట్టకు వెళ్లనున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకోనున్నారు. సీఎం అయ్యాక ఆయన జరుపుకుంటున్న మొదటి జన్మదినం ఇదే. ఆయన పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను స్థానిక నేతలు, అధికారులు ఇవాళ పరిశీలించారు.
వర్క్‌ఫ్రం హోం కంటే ఆఫీసులకు వెళ్లి పని చేస్తున్న భారతీయులు మెరుగైన మానసిక ఆరోగ్యాన్ని అనుభూతి చెందుతున్నట్టు సేపియన్స్ ల్యాబ్స్ అనే సంస్థ చేసిన అధ్యయనంలో తేలింది. ఈ సంస్థ 65 దేశాల్లోని 54,000 మంది ఉద్యోగులపై సర్వే చేసింది. మెరుగైన మానసిక ఆరోగ్యానికి ఆఫీసుల్లో పాజిటివ్ రిలేషన్స్ ఓ కారణమని తెలిపింది. ప్రతికూల బంధాలు, వృత్తిపై ఆసక్తిలేకపోవడం నిస్సహాయతకు గురిచేస్తాయని పేర్కొంది.
దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు అక్టోబర్‌లో ₹94,000 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ముందెన్నడూ ఒక నెలలో ఈ స్థాయి డిజిన్వెస్ట్‌మెంట్ జరగలేదు. ఈక్విటీ మార్కెట్లను ఓవర్ వ్యాల్యూగా పరిగణించడం, చైనా మార్కెట్ల ఆకర్షణీయ వడ్డీ రేట్లే దీనికి కారణమని నిపుణులు చెబుతున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం కారణంగా FIIలు జాగ్రత్తపడుతున్నారు!
TG: హెచ్‌ఎండీఏ పరిధిలోని గ్రామపంచాయతీల్లో అనధికార లేఅవుట్లలో ప్లాట్‌ల రిజిస్ట్రేషన్‌ను నిషేధించినట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆ సంస్థ ఖండించింది. దీనికి సంబంధించి గత ఏడాది కాలంగా తాము రిజిస్ట్రేషన్&స్టాంపుల శాఖకు ఎలాంటి అభ్యర్థనను పంపలేదని తెలిపింది. పంచాయతీల్లో అనధికారిక లేఅవుట్‌ల ప్లాట్‌ల రిజిస్ట్రేషన్‌ను నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని స్పష్టం చేసింది.
తన బావమరిది నార్నె నితిన్ నిశ్చితార్థం ఫొటోలను Jr.NTR ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘నితిన్-శివాని మీకు కంగ్రాట్స్. జీవితాంతం మీరిద్దరూ సుఖసంతోషాలతో కలిసుండాలి’ అంటూ విషెస్ తెలియజేశారు. నూతన వధూవరులతో కలిసి దిగిన ఫ్యామిలీ ఫొటోను పంచుకున్నారు. ఈ ఈవెంట్‌లో ఎన్టీఆర్ కొత్త లుక్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆయన ఫొటోలను ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.
‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈనెల 22న ప్రారంభం కానున్నట్లు సమాచారం. మైసూరులో షూటింగ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేసినట్లు సినీ వర్గాలు తెలిపాయి. దీనిపై మూవీ టీమ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇందులో జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
APలోని పలు జిల్లాల్లో రేపు వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రకాశం, పల్నాడు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇవాళ పలుచోట్ల వర్షాలు పడ్డాయి.
ఝార్ఖండ్‌లో గెలుపు కోసం JMM, BJP కూటములు మహిళా ఓటర్లను ఆకట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నాయి. రాష్ట్రంలోని 81 నియోజకవర్గాల్లో 32 స్థానాల్లో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. వీరి మెప్పు పొందేందుకు JMM ప్రభుత్వం ఇప్పటికే మహిళల ఖాతాల్లో నెలకు రూ.1000 సాయం ఇస్తోంది. మరోవైపు ప్రతి నెల మహిళలకు రూ.2,100 ఆర్థిక సాయం ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. మరి మహిళల ఓటు ఎటన్నది తేలాల్సి ఉంది.
AP: ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతి ప్రకటించాలని AP JAC అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికే 18 అంశాలను CM చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. హెల్త్ కార్డులు పని చేయడం లేదని, క్యాష్ లెస్ వైద్య సదుపాయం అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దాదాపు ₹25 వేల కోట్ల వరకు బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. విశ్రాంత ఉద్యోగుల బకాయిలైనా చెల్లించాలని కోరారు.
RCB కెప్టెన్‌గా కోహ్లీ బాధ్యతలు చేపడతారనే ప్రచారం జరుగుతున్న వేళ ఆ జట్టు డైరెక్టర్ మొ బొబట్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఫ్రాంచైజీ ఇంకా కెప్టెన్సీపై నిర్ణయం తీసుకోలేదు. మాకు ఇంకా ఆప్షన్లు ఉన్నాయి. మా పాత కెప్టెన్ డుప్లిసెస్‌ను మేం రిటైన్ చేసుకోలేదు. అతడు గతేడాది అద్భుతంగా జట్టును ముందుకు నడిపారు. వేలంలో ఓపెన్ మైండ్‌తో ఆలోచిస్తాం’ అని అన్నారు. దీంతో RCB కెప్టెన్ ఎవరనే దానిపై మళ్లీ చర్చలు మొదలయ్యాయి.
Sorry, no posts matched your criteria.