News November 3, 2024

నాన్న హంత‌కురాలిని ప్రియాంక ఆలింగ‌నం చేసుకున్నారు: రాహుల్

image

రాజీవ్ గాంధీ హంత‌కురాలు నళినిని ఆలింగ‌నం చేసుకోవ‌డ‌మే కాకుండా ఆమె ప‌రిస్థితిని చూసి జాలిప‌డిన క‌రుణ గ‌ల వ్య‌క్తి ప్రియాంకా గాంధీ అని రాహుల్ గాంధీ అన్నారు. జీవితంలో ఆమె ఈ ర‌క‌మైన పెంప‌కాన్ని పొందారని, ప్ర‌స్తుతం దేశంలో ఈ త‌ర‌హా ప్రేమ‌-ఆప్యాయ‌త‌ల‌తో కూడిన రాజ‌కీయాల అవ‌స‌రం ఉంద‌ని, ద్వేషపూరిత రాజ‌కీయాలు కాద‌న్నారు. వ‌య‌నాడ్‌లో ప్రియాంక గెలిస్తే ఉత్త‌మ MPగా నిలుస్తార‌ని రాహుల్ పేర్కొన్నారు.

News November 3, 2024

అంబులెన్స్‌ దుర్వినియోగం.. కేంద్ర మంత్రిపై కేసు

image

లోక్‌స‌భ ఎన్నిక‌ల వేళ అంబులెన్స్‌ను దుర్వినియోగం చేసినందుకు కేంద్ర మంత్రి సురేశ్ గోపీపై కేర‌ళ పోలీసులు తాజాగా కేసు న‌మోదు చేశారు. గతంలో త్రిసూర్ BJP MP అభ్య‌ర్థిగా బ‌రిలో ఉన్న సురేశ్ స్థానికంగా పూరం ఉత్స‌వానికి సొంత వాహనంలో కాకుండా అంబులెన్స్‌లో వెళ్లార‌ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి. దీన్ని అధికార‌, విప‌క్షాలు తీవ్రంగా ఖండించాయి. అంబులెన్స్ ఉపయోగించలేదని ఒకసారి, ఉపయోగించినట్లు మరోసారి గోపీ అంగీకరించారు.

News November 3, 2024

ఇందిరమ్మ ఇళ్లు.. లబ్ధిదారుల వివరాలు ఎక్కడంటే?

image

TG: ఈ నెల 6 నుంచి ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభం కానుందని తెలంగాణ కాంగ్రెస్ ట్వీట్ చేసింది. మొదటి విడతలో నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున ఇవ్వనున్నట్లు పేర్కొంది. తొలుత ఇళ్ల స్థలం ఉన్నవారికి రూ.5 లక్షల ఆర్థిక సాయం చేయనున్నట్లు తెలిపింది. రెండో విడతలో స్థలం లేనివారికి స్థలమిచ్చి రూ.5 లక్షల ఆర్థిక సాయం ఇస్తామని పేర్కొంది. ప్రత్యేక యాప్‌లో లబ్ధిదారుల వివరాలు వెల్లడిస్తామంది.

News November 3, 2024

PUSHPA-2: మిగిలింది సాంగ్ ఒక్కటే!

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తోన్న ‘పుష్ప-2’ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ చిత్రం ముగింపు దశకు చేరుకుందని, కేవలం స్పెషల్ సాంగ్ చిత్రీకరణ మిగిలి ఉందని సినీ వర్గాలు పేర్కొన్నాయి. దీనికోసం రామోజీ ఫిల్మ్‌ సిటీలో ప్రత్యేక సెట్‌ను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పాటలో శ్రద్ధా కపూర్‌తో పాటు శ్రీలీల కూడా కనిపించనున్నారని, ఈ వారంలోనే షూటింగ్ జరుగుతుందని సమాచారం.

News November 3, 2024

టర్నింగ్ పిచ్‌లే మనకు శత్రువులు: హర్భజన్

image

భారత్‌పై టెస్ట్ సిరీస్ గెలిచిన న్యూజిలాండ్ టీమ్‌ను మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అభినందించారు. భారత జట్టుకు టర్నింగ్ పిచ్‌లే శత్రువులుగా మారుతున్నాయని అన్నారు. ‘టీమ్‌ఇండియా మెరుగైన పిచ్‌లపై ఆడాలని చాలా ఏళ్ల నుంచి చెబుతున్నా. ఈ టర్నింగ్ పిచ్‌లు ప్రతి బ్యాటర్‌ను చాలా సాధారణంగా కనిపించేలా చేస్తున్నాయి’ అని ట్వీట్ చేశారు.

News November 3, 2024

ప‌వ‌న్ క‌ళ్యాణ్ నిర్ణ‌యంపై బిహార్‌లో చ‌ర్చ‌

image

స‌నాత‌న ధ‌ర్మ ప‌రిర‌క్ష‌ణ‌కు ప్ర‌త్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తామ‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన ప్రకటనను బిహార్ బీజేపీ నేత‌లు స్వాగ‌తించారు. బిహార్‌లో కూడా ఈ త‌రహా వింగ్ ఏర్పాటు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని మంత్రి నీర‌జ్ బాబు పేర్కొన్నారు. అయితే ఇది క్షేత్ర‌స్థాయి ప‌రిస్థితుల నుంచి ప్ర‌జ‌ల‌ దృష్టి మ‌ర‌ల్చడానికి చేస్తున్న ప్ర‌యత్నాల‌ని, వీరంద‌రూ న‌కిలీ సనాతనీయులని RJD నేత మృత్యుంజ‌య్ తివారీ విమ‌ర్శించారు.

News November 3, 2024

విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల్లో హైటెన్షన్

image

AP: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించొద్దంటూ ఉద్యమిస్తున్న కార్మిక సంఘాలను అనకాపల్లి(D)లో మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు <<14521702>>ప్రకటన<<>> కలవరపెడుతోంది. దీని ప్రభావం విశాఖ ఉక్కుపై పడుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రైవేట్ ప్లాంట్ తేవడం వెనుక దురుద్దేశం ఉందని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. దీనిపై ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నాయి. అయితే విశాఖ ఉక్కుపై చిత్తశుద్ధితో ఉన్నామని ప్రభుత్వం అంటోంది.

News November 3, 2024

బంగ్లాదేశ్‌కు అదానీ ‘పవర్ వార్నింగ్’

image

బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వానికి అదానీ పవర్ అల్టిమేటం జారీ చేసింది. నవంబర్ 7లోపు రూ.7,200 కోట్ల విద్యుత్ బకాయిలు చెల్లించకపోతే సరఫరా నిలిపివేస్తామని హెచ్చరించింది. ఇప్ప‌టికే విద్యుత్ స‌ర‌ఫరాను స‌గానికి త‌గ్గించ‌డంతో బంగ్లాదేశ్‌లో 1,600 మెగావాట్ల విద్యుత్ కొర‌త ఏర్ప‌డిన‌ట్టు స్థానిక మీడియా తెలిపింది. బ‌కాయిలు చెల్లించ‌క‌పోతే ఒప్పందం మేర‌కు స‌ర‌ఫరా నిలిపివేస్తామ‌ని అదానీ ప‌వ‌ర్ స్ప‌ష్టం చేసింది.

News November 3, 2024

అయోవాలో అనూహ్యంగా ముందంజలో కమల: సర్వే

image

అయోవాను రిప‌బ్లిక‌న్లు కోల్పోయే అవ‌కాశం ఉంద‌ని తాజా స‌ర్వే అంచ‌నా వేసింది. గ‌త స‌ర్వేలో ఇక్క‌డ‌ ట్రంప్‌ ముందంజలో ఉన్నారు. అయితే, ఇప్పుడు క‌మ‌ల 47% మంది మ‌ద్ద‌తుతో ట్రంప్‌(44%)ను అధిగ‌మించారు. తుది సర్వే డెస్ మోయిన్స్ రిజిస్టర్ వార్తాపత్రికలో ప్రచురితమైంది. ఈ మార్పును ఎవ‌రూ ఊహించ‌లేద‌ని, క‌మ‌ల స్ప‌ష్టమైన ఆధిక్యంలో ఉన్నార‌ని పోల్‌ను నిర్వహించిన సెల్జర్&కో ప్రెసిడెంట్ జె.ఆన్ సెల్జర్ తెలిపారు.

News November 3, 2024

రహానే, పుజారాలను గుర్తుచేసుకుంటున్న ఫ్యాన్స్

image

న్యూజిలాండ్‌తో మూడో టెస్టులోనూ టీమ్ఇండియా ఫ్లాప్ షో చూపించడంతో క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. స్టార్ బ్యాటర్లు విఫలమవడంతో రహానే, పుజారాలను గుర్తుచేసుకుంటున్నారు. టెస్టుల్లో వీరు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని ట్వీట్స్ చేస్తున్నారు. గెలిచే మ్యాచులోనూ టీమ్ ఇండియా ఓడిపోయిందని, ఇకనైనా BCCI తేరుకొని సమర్థులని జట్టులోకి తీసుకోవాలని సూచిస్తున్నారు.