News January 28, 2025

జూన్‌లోగా నామినేటెడ్ పదవుల భర్తీ: CBN

image

AP: పార్టీ కోసం కష్టపడిన వారికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. జూన్‌లోగా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు. త్వరలో 214 మార్కెట్ కమిటీలు, 1,100 ట్రస్ట్ బోర్డులకు నియామకాలు ఉంటాయని పేర్కొన్నారు. క్లస్టర్, యూనిట్, బూత్, సెక్షన్ సభ్యులనే సిఫారసు చేయాలని సీఎం సూచించారు.

News January 28, 2025

ఏపీ మాజీ గవర్నర్‌ హరిచందన్‌కు అస్వస్థత

image

ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల మాజీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను ఒడిశాలోని భువనేశ్వర్‌లో ఉన్న ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన కుమారుడు పృథ్వీరాజ్ హరిచందన్ తెలిపారు. 2019 నుంచి 2023 వరకు బిశ్వభూషణ్ హరిచందన్ ఏపీకి గవర్నర్‌గా సేవలు అందించారు.

News January 28, 2025

విరాట్ కోహ్లీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్

image

విరాట్ కోహ్లీ 13 ఏళ్ల తర్వాత రంజీ బరిలో దిగనుండగా ఆ మ్యాచ్ టెలికాస్ట్ అయ్యే అవకాశాలు లేవని వార్తలు రావడంతో ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. తాజాగా ఆ మ్యాచ్‌ను ‘Jio Cinema’ టెలికాస్ట్ చేసేందుకు ముందుకొచ్చినట్లు క్రికెట్ వర్గాలు తెలిపాయి. ఈ నెల 30న ఢిల్లీ vs రైల్వేస్ రంజీ ట్రోఫీలో భాగంగా పోటీ పడనున్న విషయం తెలిసిందే. నిన్న 20 మంది సభ్యులతో ఢిల్లీ ప్రకటించిన జట్టులో కోహ్లీకి చోటు దక్కిన విషయం తెలిసిందే.

News January 28, 2025

పక్కా ప్రణాళికతో దాదాపు రూ.1.80 లక్షల కోట్ల పెట్టుబడులు: సీఎం రేవంత్

image

TG: తెలంగాణ ప్రభుత్వంపై నమ్మకంతో పెట్టుబడులు పెడుతున్నారని CM రేవంత్ అన్నారు. కొందరు HYDకు పెట్టుబడులు రాకుండా చేయాలని కుట్ర చేశారని ఆరోపించారు. అయితే ఇన్వెస్టర్లు విశ్వాసాన్ని చాటుకున్నారని తెలిపారు. పక్కా ప్రణాళికతో వెళ్లడంతో దాదాపు రూ.1.80 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించామన్నారు. సింగపూర్‌ ప్రభుత్వంతో కీలక ఒప్పందం చేసుకున్నామన్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో ఇదో అద్భుత పరిణామమని పేర్కొన్నారు.

News January 28, 2025

వైసీపీ తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టాలి: చంద్రబాబు

image

AP: ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ వ్యవహారాలు, నేతల పనితీరుపై టీడీపీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌ఛార్జ్‌లతో CM చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని నేతలకు చెప్పారు. వైసీపీ తప్పుడు ప్రచారాన్ని ఎండగట్టాలన్నారు. పార్టీని నమ్ముకున్న వారికి పదవులు దక్కాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలదేనని పేర్కొన్నారు. తిరిగి అధికారంలోకి వచ్చేలా పనిచేయాలని సూచించారు.

News January 28, 2025

Stock Market: ఈ రోజు లాభాలు

image

దేశీయ స్టాక్ మార్కెట్లు మంగ‌ళ‌వారం లాభాల‌తో ముగిశాయి. గత సెషన్‌లో ఎదురైన నష్టాల నుంచి సూచీలు ఒకింత ఉపశమనం పొందాయి. సెన్సెక్స్ 535 పాయింట్ల లాభంతో 75,901 వ‌ద్ద‌, నిఫ్టీ 128 పాయింట్లు ఎగ‌సి 22,957 వ‌ద్ద స్థిర‌ప‌డ్డాయి. ఒకానొక ద‌శ‌లో బీఎస్ఈ సూచీ 900 PTS, నిఫ్టీ 220 పాయింట్లు ఎగ‌సినా కొనుగోళ్లలో అస్థిర‌త‌ వల్ల తదుపరి రివర్సల్ తీసుకున్నాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్‌, రియ‌ల్టీ షేర్లు రాణించాయి.

News January 28, 2025

పెళ్లిపీటలెక్కనున్న ‘ఆరెంజ్’ హీరోయిన్

image

ఆరెంజ్, మసాలా సినిమాల్లో నటించిన షాజమ్ పదమ్‌సీ పెళ్లిపీటలెక్కనున్నారు. ప్రియుడు, వ్యాపారవేత్త ఆశిష్ కనకియాతో ఆమె రోకా ఈవెంట్ తాజాగా జరిగింది. అందుకు సంబంధించిన ఫొటోలను ఆమె తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఆశిష్, తాను రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నామని, ఈ ఏడాది జూన్‌లో పెళ్లి పీటలెక్కనున్నామని స్పష్టం చేశారు. ఆరెంజ్‌లో రూబా పాత్రతో ఆమె తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు.

News January 28, 2025

BREAKING: వారికి రూ.15,000: ప్రభుత్వం

image

AP: సర్వీసులో ఉంటూ మరణించిన అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్ల అంత్యక్రియలకు రూ.15వేలు మంజూరు చేసే పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు రాష్ట్ర స్త్రీలు, పిల్లలు, వికలాంగులు & సీనియర్ సిటిజన్ల శాఖ కార్యదర్శి సూర్యకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. మరణించిన అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లకు చెందిన చట్టబద్ధమైన వారసులకు ఈ సొమ్మును చెల్లించాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.

News January 28, 2025

పేర్ని నాని ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్

image

AP: మాజీ మంత్రి పేర్ని నాని దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. పేర్ని జయసుధకు చెందిన గోదాంలో రేషన్ బియ్యం బస్తాల మాయం ఘటనలో తనను పోలీసులు A6గా చేర్చారని, ముందస్తు బెయిల్ ఇవ్వాలని పేర్ని నాని ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ కేసులో జయసుధకు ఇప్పటికే కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది.

News January 28, 2025

ఎక్కువ Income Tax ఉండే దేశాలివే..

image

ఐవరీ కోస్ట్ 60%, ఫిన్లాండ్ 56.95, డెన్మార్క్ 55.9, జపాన్ 55.97, ఆస్ట్రియా 55, స్వీడన్ 52.3, అరుబా 52, బెల్జియం 50, ఇజ్రాయెల్ 50, స్లొవేనియా 50, నెదర్లాండ్స్ 49.5, పోర్చుగల్ 48, స్పెయిన్ 47, ఆస్ట్రేలియా 45, చైనా 45, ఫ్రాన్స్ 45, జర్మనీ 45, సౌతాఫ్రికా 45, ఐస్‌లాండ్ 46.9, నార్వే 44.7% వరకు Income Tax వసూలు చేస్తాయి. భారత్‌లో రూ.7.5L వరకు పన్నులేదు. అత్యధిక ఆదాయ వర్గాలకు గరిష్ఠంగా 38% వరకు ఉంటుంది.