India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పాపకు జన్మనిచ్చిన తర్వాత బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. తెల్లటి దుస్తుల్లో ఆమె ఓ ర్యాంప్ వాక్‌లో పాల్గొన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె లుక్ చూడగానే అభిమానులు, నెటిజన్లు ఆశ్చర్యపోయారు. దీపిక బొద్దుగా మారిపోయిందని, నటి రేఖలా ఉన్నారని కామెంట్లు చేస్తున్నారు. కాగా దీపిక గత సెప్టెంబర్‌లో పాపకు జన్మనిచ్చారు. గర్భిణీగా ఉండగానే ‘కల్కి’ మూవీలో నటించారు.

AP: గ్రామ సచివాలయాల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 10 కి.మీ కంటే ఎక్కువ దూరంలో ఉండే ఆవాస ప్రాంతాలను వాటి సమీప సచివాలయాల్లో చేర్చనుంది. జనాభా ప్రాతిపదికన సిబ్బందిని నియమించనుంది. ఈ మేరకు సచివాలయాల శాఖ పంపిన ప్రతిపాదనను ఆమోదించింది. ఇక సచివాలయాలన్నింటినీ నాలెడ్జ్ హబ్‌లుగా మార్చాలని సర్కారు నిర్ణయించింది. కృత్రిమ మేధ సాయంతో ప్రజల్ని MSME పారిశ్రామికవేత్తలుగా చేసే దిశగా శిక్షణ అందించనుంది.

డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్ కొరడాకు కొలంబియా ప్రెసిడెంట్ గుస్తావో పెట్రో దిగొచ్చారు. ఆంక్షలు అమలు చేసిన కొన్ని గంటల్లోనే కాళ్లబేరానికి వచ్చారు. అమెరికాలో అక్రమంగా ఉంటున్న తమ దేశస్థులను తీసుకెళ్లేందుకు ప్రత్యేక విమానం పంపించారు. వారిని క్రిమినల్స్‌గా చూడొద్దని, గౌరవంగా పంపాలని కోరారు. అమెరికాతో నిరంతరం టచ్‌లో ఉంటామన్నారు. అంతకు ముందు <<15276291>>US<<>> విమానాల ల్యాండింగ్‌కు ఆయన అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే.

గిలియన్-బార్ సిండ్రోమ్(GBS)తో భారత్‌లో తొలి మరణం చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని సోలాపూర్‌లో ఈ అనారోగ్యంతో ఒకరు మృతి చెందినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్రంలో రోగుల సంఖ్య 101కి చేరిందని, వారిలో 16మంది వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారని పేర్కొంది. జీబీఎస్ అనేది అరుదైన నరాల సంబంధిత అనారోగ్యం. ఇది తలెత్తిన వారిలో సొంత రోగ నిరోధక వ్యవస్థ నరాలపై దాడి చేస్తుంది.

మలయాళ క్రైమ్, థ్రిల్లర్ ‘సూక్ష్మదర్శిని’ సినిమా స్ఫూర్తితోనే తన భార్య మాధవిని హత్య చేసినట్లు గురుమూర్తి పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో దత్తత తీసుకున్న కూతురిని తల్లి, కుమారుడు కలిసి హత్య చేస్తారు. ఆమె మృతదేహాన్ని మాయం చేసేందుకు శరీర భాగాలను ఓ ట్యాంకులో వేసి కెమికల్స్ పోసి కరిగిస్తారు. ఆ నీళ్లను వాష్ రూమ్ ఫ్లష్ ద్వారా వదులుతారు. ఆ మూవీలో చేసినట్లే గురుమూర్తి కూడా మాయం చేశాడు.

TG: ఆర్టీసీలో ఇవాళ్టి నుంచి సమ్మె సైరన్ మోగనుంది. ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సుల విధానాన్ని పునఃసమీక్షించి, తమ సమస్యలను పరిష్కరించాలన్న డిమాండ్లతో సమ్మెకు వెళ్లాలని నిర్ణయించినట్టు ఆర్టీసీ జేఏసీ తెలిపింది. నేటి సాయంత్రం 4 గంటలకు బస్‌భవన్‌లో యాజమాన్యానికి సమ్మె నోటీసు అందజేయనుంది. కాగా ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సులతో సంస్థలో వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని జేఏసీ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

అమెరికా ప్రెసిడెంటుగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి ఎన్నికవ్వడంపై మెజారిటీ భారతీయులు సానుకూలంగా ఉన్నారని ECFR సర్వే పేర్కొంది. ‘Trump Welcomers’ కేటగిరీలో వారే ఎక్కువగా ఉన్నారని తెలిపింది. ఆయన గెలుపు ప్రపంచ శాంతికి మేలని 82, భారత్‌కు మంచిదని 84, US పౌరులకు మంచిదని 85% భారతీయులు అన్నారు. చైనా, తుర్కియే, బ్రెజిల్ పౌరులూ ఇలాగే భావిస్తున్నారు. EU, UK, AUSలో ఎక్కువగా ‘Never Trumpers’ కేటగిరీలో ఉన్నారు.

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం 2 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్‌లేని భక్తులకు సర్వదర్శనానికి 6గంటల సమయం పడుతోంది. ఇక శ్రీవారిని నిన్న 74,742 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 22,466 మంది తలనీలాలు సమర్పించారు. రూ.3.67 కోట్ల ఆదాయం హుండీకి సమకూరినట్లు అధికారులు తెలిపారు.

కొలంబియాపై డొనాల్డ్ ట్రంప్ కొరడా ఝుళిపించారు. అక్రమ వలసదారులను తీసుకెళ్లిన 2 విమానాల ల్యాండింగ్‌కు పర్మిషన్ ఇవ్వకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతీకారంగా 25% టారిఫ్స్ పెంచేశారు. ఆ దేశ పౌరులపై ‘ట్రావెల్ బ్యాన్’ విధించారు. వారి మద్దతుదారులు సహా అధికారుల వీసాలను రద్దు చేశారు. ‘కొలంబియా ప్రెసిడెంట్ గుస్తావో పెట్రోకు మంచిపేరు లేదు. విమానాలను అడ్డుకొని US భద్రతను ఆయన సందిగ్ధంలో పడేశారు’ అని అన్నారు.

దేశంలోనే తొలిసారిగా ఉత్తరాఖండ్‌లో ఉమ్మడి పౌరస్మృతి(UCC) అమలులోకి వచ్చింది. రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధామీ ఈ విషయాన్ని ప్రకటించారు. ‘యూసీసీతో సమాజంలో అనేక విషయాల్లో అసమానతలు తొలగుతాయి. పౌరులందరికీ సమానమైన హక్కులు, బాధ్యతలు దక్కుతాయి’ అని పేర్కొన్నారు. కాగా.. ఇది ఏకాభిప్రాయం లేని ప్రయోగాత్మక ప్రాజెక్ట్ అంటూ కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది.
Sorry, no posts matched your criteria.