News April 22, 2024

పాకిస్థాన్ బియ్యంలో పురుగులు: రష్యా

image

పాకిస్థాన్ నుంచి దిగుమతి చేసుకుంటున్న బియ్యంలో పురుగులు ఉన్నాయని రష్యా ఆగ్రహం వ్యక్తం చేసింది. పాక్ బియ్యం అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా లేవని, ఈ వ్యవహారంపై వెంటనే దర్యాప్తు చేపట్టాలని పాకిస్థాన్‌ను డిమాండ్ చేసింది. కాగా, బియ్యం ఎగుమతులపై గతేడాది భారత్ నిషేధం విధించడంతో పాక్ బియ్యానికి డిమాండ్ పెరిగింది. అమెరికా, బ్రిటన్, ఇతర యూరప్ దేశాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి.

News April 22, 2024

నేడే టెన్త్ ఫలితాలు.. WAY2NEWSలో వేగంగా తెలుసుకోండి

image

AP: టెన్త్ ఫలితాలను ఇవాళ ఉ.11 గంటలకు అధికారులు విడుదల చేయనున్నారు. WAY2NEWS యాప్‌లో రిజల్ట్స్‌ను వేగంగా, సులభంగా తెలుసుకోవచ్చు. మిగతా ప్లాట్‌ఫాంల తరహాలో విసిగించే యాడ్స్, లోడింగ్ సమస్యలు మన యాప్‌లో ఉండవు. ప్రత్యేక స్క్రీన్‌లో హాల్ టికెట్ నంబర్ ఇచ్చి క్లిక్‌ చేస్తే మెరుపు వేగంతో ఫలితాలు వస్తాయి. వాటిని ఈజీగా షేర్ చేసుకోవచ్చు.
<<-se>>#ResultsFirstOnWay2News<<>>

News April 22, 2024

యూట్యూబ్‌లో అదరగొడుతోన్న ‘టైగర్ నాగేశ్వరరావు’

image

వంశీ డైరెక్షన్‌లో రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు మూవీ హిందీ వెర్షన్ యూట్యూబ్‌లో అదరగొడుతోంది. 2 నెలల్లోనే 100 మిలియన్ల వ్యూస్, 1 మిలియన్ లైక్స్ సొంతం చేసుకున్నట్లు మేకర్స్ వెల్లడించారు. స్టువర్టుపురం గజ దొంగ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందింది. గత ఏడాది అక్టోబర్‌లో రిలీజవగా, మిశ్రమ స్పందన వచ్చింది. ఈ చిత్రంలో నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్, రేణూ దేశాయ్ కీలక పాత్రల్లో నటించారు.

News April 22, 2024

ఒక్క రన్‌తో గెలుపు.. KKRకు ఇదే తొలిసారి

image

IPL హిస్టరీలో KKR తొలిసారి ఒక రన్ తేడాతో RCBపై గెలిచింది. గతంలో RCB(2014), PBKS(2020)పై రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఓవరాల్‌గా RCB, MI చెరో 3 సార్లు, పంజాబ్ రెండు సార్లు, CSK, LSG, గుజరాత్ లయన్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్ ఒక్కోసారి ఒక రన్ తేడాతో గెలిచాయి.

News April 22, 2024

తిరువూరు: తండ్రిపై కొడుకు.. కొడుకుపై తండ్రి గెలిచారు

image

రాజకీయాల్లో రక్త సంబంధానికి తావు లేదనే కల్చర్ 1952లోనే మొదలైంది. ఇందుకు కృష్ణా(D) తిరువూరు సెగ్మెంట్ నాంది పలికింది. తొలి ఎన్నికలో తండ్రి పేట బాపయ్య(INC)పై కొడుకు రామారావు(CPI) 21,673 ఓట్ల తేడాతో గెలిచారు. 1955లో కొడుకుపై తండ్రి గెలిచి లెక్క సరిచేశారు. తండ్రీకొడుకులు పరస్పరం పోటీ చేసి గెలుపొందడం ఎన్నికల చరిత్రలో ప్రత్యేకం.
<<-se>>#ELECTIONS2024<<>>

News April 22, 2024

మే ఫస్ట్ వీక్‌లో పుష్ప-2 నుంచి సాంగ్ రిలీజ్?

image

సుకుమార్ డైరెక్షన్‌లో అల్లు అర్జున్, రష్మిక జంటగా నటిస్తోన్న పుష్ప-2 షూటింగ్ తుది దశకు చేరుకున్నట్లు సమాచారం. ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. మే మొదటి వారంలో ఓ మాస్ పాటను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఆగస్టు 15న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

News April 22, 2024

పార్లమెంట్ బరిలో సినిమా స్టార్లు

image

✒ రవికిషన్-BJP-గోరఖ్‌పూర్(యూపీ)
✒ కంగనా రనౌత్-BJP-మండీ(హిమాచల్)
✒ నవనీత్ కౌర్-BJP-అమరావతి(మహారాష్ట్ర)
✒ అరుణ్ గోవిల్-BJP-మీరట్(యూపీ)
✒ సురేశ్ గోపి-BJP-త్రిసూర్(కేరళ)
✒ హేమా మాలిని-BJP-మథుర(యూపీ)
✒ రచనా బెనర్జీ-TMC-హుగ్లీ(బెంగాల్)
✒ శత్రుఘ్న సిన్హా-TMC- అసన్‌సోల్(బెంగాల్)
<<-se>>#ELECTIONS2024<<>>

News April 22, 2024

మల్కాజ్‌గిరి.. ఈసారి అదృష్టం పట్టేదెవరికో?

image

ఓటర్ల పరంగా(32 లక్షలు) అతిపెద్ద లోక్‌సభ సెగ్మెంట్ మల్కాజ్‌గిరి. ఇక్కడ గెలిచినవారు అత్యున్నత పదవులు పొందారు. 2009లో గెలిచిన సర్వే సత్యనారాయణ(INC) కేంద్ర మంత్రిగా పనిచేశారు. 2014లో TDP నుంచి గెలిచిన మల్లారెడ్డి BRSలో చేరారు. మేడ్చల్ MLAగా గెలిచి మంత్రయ్యారు. 2019లో MPగా ఎన్నికైన రేవంత్‌ CM అయ్యారు. ఈసారి ఈటల రాజేందర్(BJP), సునీతా మహేందర్ రెడ్డి(INC), లక్ష్మారెడ్డి(BRS) బరిలో ఉన్నారు.
<<-se>>#ELECTIONS2024<<>>

News April 22, 2024

యుద్ధం ‘గర్భిణి’ని బలిగొంది.. వైద్యులు బిడ్డకు ఊపిరిచ్చారు

image

హమాస్-ఇజ్రాయెల్ యుద్ధానికి వేదికగా నిలిచిన గాజాలో మరణమృదంగం కొనసాగుతోంది. ఇటీవల జరిగిన వైమానిక దాడిలో 30 వారాల గర్భిణి, ఆమె భర్త, కూతురు ప్రాణాలు కోల్పోయారు. వైద్యులు ఆ మహిళకు వేగంగా ఆపరేషన్ చేసి బిడ్డను కాపాడారు. 1.4 కిలోల బరువుతో పుట్టిన ఆ ఆడశిశువును ప్రస్తుతం ఇంక్యుబేటర్‌లో ఉంచారు. కాగా ఈ యుద్ధంలో ఇప్పటి వరకు 34 వేలకు మందికి పైగా మృతి చెందినట్లు అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి.

News April 22, 2024

ఉంగుటూరులో జెండా ఎగరేసేదెవరు?

image

AP: అలంపురం, పెంటపాడు నియోజకవర్గాలు కనుమరుగై ఉంగుటూరు(ఏలూరు జిల్లా) ఏర్పడింది. 1967 నుంచి ఇప్పటి వరకు 6సార్లు INC, 5సార్లు TDP, 2019లో YCP గెలిచింది. ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యే పుప్పాల శ్రీనివాసరావు(వాసు బాబు)ని జనసేన నేత పత్సమట్ల ధర్మరాజు ఢీకొట్టబోతున్నారు. విజయంపై ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. 2019లో వాసుబాబుకు 94,621 ఓట్లు రాగా, టీడీపీ, జనసేన అభ్యర్థులకు కలిపి 72,189 ఓట్లు వచ్చాయి.
<<-se>>#ELECTIONS2024<<>>