News April 22, 2024

చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ

image

ఐపీఎల్‌లో ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించారు. ఒక జట్టు తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన తొలి ఆటగాడిగా నిలిచారు. ఇప్పటివరకు ఆయన ఆర్పీబీ తరఫున 250 సిక్సర్లు కొట్టారు. తర్వాతి స్థానాల్లో క్రిస్ గేల్ (RCB) 239, ఏబీ డివిలియర్స్ (RCB) 238, రోహిత్ శర్మ (MI) 224, కీరన్ పొలార్డ్ (MI) 223 ఉన్నారు. ఐపీఎల్‌లో ఓవరాల్‌గా క్రిస్ గేల్ 357 సిక్సర్లు బాదారు.

News April 21, 2024

విద్యార్థులకు గుడ్‌న్యూస్.. నేరుగా PhD చేయొచ్చు!

image

UGC NET జూన్ సెషన్ పరీక్షలో కొత్త విధానం అమల్లోకి రానుంది. నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీలో 75% మార్కులు/సమానమైన గ్రేడ్‌లు సాధించిన వారు నేరుగా UGC NET రాయవచ్చని సంస్థ ఛైర్మన్ జగదీశ్ వెల్లడించారు. ఆ అభ్యర్థులు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ఉన్నా లేకపోయినా PhD అభ్యసించొచ్చని తెలిపారు. కాగా ఇప్పటివరకు మాస్టర్స్ డిగ్రీలో 55% మార్కులు వచ్చిన వారికి మాత్రమే ఈ పరీక్ష రాసేందుకు అవకాశముండేది.

News April 21, 2024

IPL: పంజాబ్‌పై గుజరాత్ విజయం

image

పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచులో గుజరాత్ టైటాన్స్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 143 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో ఛేదించింది. ఆ జట్టు బ్యాటర్లలో తెవాటియా 36*, గిల్ 35, సుదర్శన్ 31 రన్స్‌తో రాణించారు. ఈ సీజన్‌లో పంజాబ్‌కి ఇది ఆరో ఓటమి కాగా, గుజరాత్‌కు నాలుగో విజయం.

News April 21, 2024

ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ తీసేయాలి: సిరాజ్

image

ఐపీఎల్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను తొలగించాలని ఆర్సీబీ బౌలర్ మహ్మద్ సిరాజ్ ఓ ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. ‘ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ తీసేయాలి. బౌలర్లకు చాలా ఇబ్బందిగా మారుతోంది. బ్యాటర్లు రాగానే విరుచుకుపడుతున్నారు. ఈ ఏడాది ఐపీఎల్‌‌లో 270-280 రన్స్ పరిపాటిగా మారింది’ అని పేర్కొన్నారు. ఈ సీజన్‌లో 260కు పైగా స్కోర్లు 4సార్లు నమోదుకావడం విశేషం.

News April 21, 2024

పేదలకు 3 కోట్ల ఇళ్లు నిర్మించి ఇస్తాం: కిషన్ రెడ్డి

image

TG: వచ్చే ఐదేళ్లలో మోదీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా పేదలకు మరో 3 కోట్ల ఇళ్లు నిర్మించి ఇస్తుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంతో BJP ముందుకెళ్తోందని తెలిపారు. రాబోయే ఐదేళ్లలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను మారుస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇంకా అవినీతిని, బంధుప్రీతిని వదిలిపెట్టలేదని విమర్శించారు. HYD BJP ఆఫీస్‌లో సంకల్ప పత్రాన్ని ఆయన విడుదల చేశారు.

News April 21, 2024

చేతులు కలిపిన వసంత, దేవినేని

image

AP: మైలవరం నియోజకవర్గంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బద్ధ శత్రువులు మాజీ మంత్రి దేవినేని ఉమా, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ చేతులు కలిపారు. తన తరఫున ప్రచారం చేయాలని ఉమాను వసంత కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు. కూటమిని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కలిసికట్టుగా పనిచేయాలని వీరిద్దరూ నిర్ణయించుకున్నారు. రేపు వసంత నామినేషన్ కార్యక్రమంలో దేవినేని పాల్గొననున్నారు.

News April 21, 2024

25 మంది BRS ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి: ఉత్తమ్

image

TG: ఎంపీ ఎన్నికల తర్వాత BRSలో ఎవరూ మిగలరని హుజూర్‌నగర్‌లో నిర్వహించిన సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. ‘ఎన్నికల్లో BRS, BJP అభ్యర్థులకు డిపాజిట్లు దక్కవు. ఆ తర్వాత 25 మంది BRS ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరతారు. కేంద్రంలో మరోసారి బీజేపీ గెలిస్తే దేశానికే ప్రమాదం. అందుకే జూన్ 9న రాహుల్ ప్రధాని కాబోతున్నారు’ అని ఉత్తమ్ జోస్యం చెప్పారు.

News April 21, 2024

జగన్ రెడ్డి ఓ మూర్ఖుడు: పవన్

image

AP: ప్రతీ రోజు ముగ్గురు భార్యలు అంటూ హేళన చేస్తున్న సీఎం జగన్ ఓ మూర్ఖుడు అని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అన్నారు. ‘ఎప్పుడు చూసినా జగన్ నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడతారు. మాట్లాడితే ముగ్గురు పెళ్లాలు అంటారు. అందరి ఇళ్లలో విభేదాలు ఉంటాయి. నా ఇంట్లో కూడా అలానే విభేదాలు ఉన్నాయి. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడటం ఏంటీ? నా వ్యక్తిగత విషయాల జోలికి వస్తే తాట తీస్తా’ అని ఆయన మండిపడ్డారు.

News April 21, 2024

రేపు, ఎల్లుండి జాగ్రత్త!

image

AP: రేపు 26 <>మండలాల్లో<<>> తీవ్ర వడగాలులు, 64 మండలాల్లో వడగాలులు వీస్తాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఎల్లుండి 46 మండలాల్లో తీవ్ర వడగాలులు, 88 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఇవాళ అత్యధికంగా నంద్యాల(D) చాగలమర్రిలో 45.5°C ఉష్ణోగ్రత నమోదైనట్లు పేర్కొంది. 36 మండలాల్లో తీవ్ర వడగాలులు, 82 మండలాల్లో వడగాలులు వీచాయని తెలిపింది.

News April 21, 2024

ప్రపంచం తలకిందులైనా రుణమాఫీ చేసి తీరుతాం: CM

image

TG: ప్రపంచం తలకిందులైనా ఆగస్టు 15లోపు రుణమాఫీ చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. ‘అక్కడి సూర్యుడు ఇక్కడ పొడిచినా రుణమాఫీ ఆగదు. అది పూర్తి చేసి రైతుల రుణం తీర్చుకుంటాం’ అని తెలిపారు. ఏపీలో నష్టమని తెలిసినా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని రేవంత్ గుర్తు చేశారు. కానీ తెలంగాణ ఏర్పాటే తప్పిదమన్నట్లుగా మోదీ ఎన్నోసార్లు మాట్లాడారని మండిపడ్డారు.