News April 20, 2024

న్యాయం, ధర్మం కోసమే పోటీ: షర్మిల

image

AP: జగన్‌ను చిన్న రాయితో కొడితేనే హత్యాయత్నం అంటున్నారని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. కడప ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఆమె మాట్లాడారు. విజయమ్మను అవమానించే స్థాయికి కొందరు దిగజారిపోయారని దుయ్యబట్టారు. తాను న్యాయం, ధర్మం కోసం పోటీ చేస్తున్నానని.. హత్యారాజకీయాలు అంతం కావాలన్నారు. ప్రజలు న్యాయం వైపు ఉన్నారా లేదా అనేది ఆలోచించుకోవాలన్నారు.

News April 20, 2024

కేసీఆర్‌కు సీఎం రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్

image

TG: బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌పై CM రేవంత్ రెడ్డి విరుచుకపడ్డారు. ‘కాంగ్రెస్ మీద చేయి వేస్తే మాడిపోతావు. మర్యాదగా ఉండటానికి నేను జైపాల్ రెడ్డి, జానా రెడ్డిని కాదు. మా కార్యకర్తలతో నీ బట్టలిప్పదీసి ఉరికించి కొడతా’ అని KCRను హెచ్చరించారు. మెదక్‌లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధుకి మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వచ్చాక 100 రోజుల్లో ఐదు గ్యారంటీలను అమలు చేశామన్నారు.

News April 20, 2024

విజయవాడ: మూడోసారి పీఠం ఎక్కనిస్తారా?

image

రాజకీయ చైతన్యం కలిగిన విజయవాడ పార్లమెంట్ ప్రజలు విలక్షణ తీర్పునిస్తుంటారు. ఇక్కడ ప్రముఖ ఇంజినీర్ KL రావు ఒక్కరే 3సార్లు గెలిచి రికార్డు సృష్టించారు. ఇదే KL రావు 1980లో పార్టీ మారి పోటీ చేయగా ఓడిపోయారు. ఆ తర్వాత శోభనాద్రీశ్వరరావు, ఉపేంద్ర, లగడపాటి, కేశినేని శ్రీనివాస్ 2 సార్లు నెగ్గారు. ఈసారి శ్రీనివాస్(YCP) హ్యాట్రిక్ కొట్టి రికార్డు తిరగరాస్తారా? కేశినేని చిన్ని(TDP) అడ్డుకుంటారా?చూడాలి.
<<-se>>#ELECTIONS2024<<>>

News April 20, 2024

కాంగ్రెస్‌ను ఓడించేందుకు మోదీ, కేసీఆర్ కుట్ర: రేవంత్

image

TG: కాంగ్రెస్‌ను ఓడించేందుకు మోదీ, కేసీఆర్ కలిసి కుట్ర చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. మెదక్ ప్రాంతంలో ఇందిరాగాంధీ తెచ్చిన పరిశ్రమలే ఇంకా ఉన్నాయని.. బీఆర్ఎస్, బీజేపీలు ఏమీ చేయలేదని దుయ్యబట్టారు. ఆగస్టు 15లోగా రైతులకు రుణమాఫీ చేస్తానని మరోసారి ఉద్ఘాటించారు. వచ్చే సీజన్‌లో రూ.500 బోనస్ ఇచ్చి వరి కొనుగోలు చేస్తానని తెలిపారు.

News April 20, 2024

బాలీవుడ్‌లో ‘పుష్ప-2’ ఆల్ టైమ్ రికార్డ్!

image

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘పుష్ప-2’ విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమా హిందీ థియేట్రికల్ హక్కులు రూ.200 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. హిందీయేతర సినిమాకు బాలీవుడ్‌లో ఇంత ధర వెచ్చించడం ఇదే తొలిసారి అని తెలుస్తోంది. పుష్ప సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌తో పార్ట్-2పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. కాగా ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది.

News April 20, 2024

IPL: ‘ఇంపాక్ట్ ప్లేయర్’ ఉండాలా.. వద్దా..? (1/2)

image

ఐపీఎల్‌లో ‘ఇంపాక్ట్ ప్లేయర్’పై క్రికెట్ విశ్లేషకులు, ప్రేమికులు నెట్టింట తీవ్రంగా చర్చించుకుంటున్నారు. క్రికెట్‌ జట్టులో 11మంది ఆడతారన్న సంగతి తెలిసిందే. ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనతో జట్లు ఒక ఆటగాడి స్థానంలో మరో ఆటగాడిని ఆడించొచ్చు. ఉదాహరణకు.. ఫస్ట్ బ్యాటింగ్ చేసే జట్టు తమ బౌలింగ్ సమయంలో ఓ బ్యాటర్ స్థానంలో బౌలర్‌ను తీసుకురావచ్చు. దీని వల్ల జట్లు మొత్తం 12మంది ఆటగాళ్లతో ఆడుతున్నట్లు అవుతోంది.

News April 20, 2024

IPL: ‘ఇంపాక్ట్ ప్లేయర్’ ఉండాలా.. వద్దా..? (2/2)

image

ఈక్రమంలో రెండు నష్టాలున్నాయి. ఆల్‌రౌండర్లతో జట్లు బౌలింగ్ వేయించడం లేదు. దీంతో నితీశ్ రెడ్డి, దూబే వంటి భారత ఆల్‌రౌండర్ల స్కిల్ మరుగున పడుతోంది. ఇక మరోవైపు బ్యాటింగ్ డెప్త్ పెరగడంతో జట్లు నిర్భయంగా ఆడుతున్నాయి. ఈ సీజన్లోనే జట్ల స్కోర్లు 4సార్లు 250ను దాటడం పరిస్థితికి అద్దం పడుతోంది. మాజీ కోచ్‌లు, రోహిత్ వంటి ఆటగాళ్లు సైతం ఈ రూల్‌ను తొలగించాలని అభిప్రాయపడుతున్నారు. మరి మీరేమంటారు? కామెంట్ చేయండి.

News April 20, 2024

చంద్రబాబుకు మోదీ బర్త్ డే విషెస్

image

AP: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘చంద్రబాబు అనుభవజ్ఞుడైన నాయకుడు. ఆయన ఎప్పుడూ ఏపీ అభివృద్ధి కోసమే తపిస్తారు. ప్రజా సేవలో ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థిస్తున్నా’ అని మోదీ ట్వీట్ చేశారు.

News April 20, 2024

T20 WCకు 10 మంది ఫిక్స్?

image

ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టులో 10 మంది సభ్యులను బీసీసీఐ ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
టీమ్: రోహిత్ శర్మ (C), కోహ్లీ, పంత్, సూర్య, హార్దిక్, బుమ్రా, జడేజా, అర్ష్‌దీప్ సింగ్, సిరాజ్, కుల్దీప్ యాదవ్.
**జట్టు ఎంపికపై ఏప్రిల్ 27 లేదా 28న అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

News April 20, 2024

కుంగిపోతున్న చైనా.. ప్రమాదంలో ప్రజలు!

image

చైనాలోని భూభాగం ఏడాదికి 10mm చొప్పున కుంగిపోతోందని UKకి చెందిన శాస్త్రవేత్తలు గుర్తించారు. శాటిలైట్ నుంచి సేకరించిన సమాచారం ప్రకారం.. ‘చైనాలో 3వ వంతు ప్రజలు ప్రమాదంలో ఉన్నారు. ప్రస్తుతం సముద్ర మట్టానికి దిగువన ఉన్న చైనాలోని పట్టణ ప్రాంతం 2120 నాటికి 3 రెట్లు పెరిగి.. మరింత కుంగిపోతుంది. దీని వల్ల 55 నుంచి 128 మిలియన్ల మంది ప్రభావితమవుతారు’ అని శాస్త్రవేత్తలు అంచనా వేశారు.