News April 20, 2024

షమీపై ప్రధాని మోదీ ప్రశంసలు

image

టీమ్‌ఇండియా బౌలర్ మహమ్మద్ షమీపై ప్రధాని మోదీ ప్రశంసలు కురింపించారు. ‘ప్రపంచకప్‌లో షమీ భాయ్ ఎంత బాగానే రాణించారో ప్రపంచమంతా చూసింది. క్రీడల్లో ఆయన చేసిన అద్భుత కృషికి మెచ్చి కేంద్రం అర్జున అవార్డు ఇచ్చి ప్రోత్సహించింది. ఇప్పుడు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మరో రెండడుగులు ముందుకు వేశారు. యువత కోసం స్టేడియం కట్టిస్తున్నారు’ అని యూపీలో షమీ సొంతూరైన అమ్రోహాలో పర్యటించిన సందర్భంగా పేర్కొన్నారు.

News April 20, 2024

త్రిపుర ప్రజలు గ్రేట్.. దేశంలోనే అత్యధిక పోలింగ్ శాతం

image

21 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో నిన్న జరిగిన లోక్‌సభ తొలి విడత ఎన్నికల్లో త్రిపుర అత్యధిక పోలింగ్ పర్సెంట్‌ను నమోదు చేసింది. సాయంత్రం 5 గంటలకే 80.40% రికార్డ్ అయింది. అప్పటికి ఇంకా 23వేల మంది బారులు తీరారు. ఈ నేపథ్యంలో పోలింగ్ శాతం మరో 2-3% పెరిగే అవకాశం ఉంది. మరోవైపు బంగ్లాదేశ్ <<13080619>>సరిహద్దులో<<>> ఉంటున్న దాదాపు 2500 మంది భారతీయులు బోర్డర్ దాటి వచ్చి త్రిపురలో ఓటు వేశారు.

News April 20, 2024

ఈ తెగ ప్రజలు మొదటిసారి ఓటేశారు

image

దేశంలో నిన్న లోక్‌సభ తొలి విడత ఎన్నికలు జరిగిన సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అండమాన్ & నికోబార్ దీవుల్లో షొంపెన్ తెగకు చెందిన ఏడుగురు మొదటిసారి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బూత్ వద్ద నిలబడి ఫొటోలకు పోజులిచ్చారు. మరోవైపు ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన బస్తర్‌లోనూ 56 గ్రామాల ప్రజలు మొదటిసారి ఓటు వేశారు. <<-se>>#Elections2024<<>>

News April 20, 2024

అయ్యో పాపం.. సత్తా ఉన్నా దురదృష్టం అడ్డుకుంది

image

భారత రెజర్లు దీపక్ పూనియా, సుజీత్ కల్కల్‌ను దురదృష్టం వెంటాడింది. కిర్గిస్థాన్‌లో జరిగిన ఒలింపిక్స్ క్వాలిఫైయర్స్‌లో పాల్గొనేందుకు వారిని నిర్వాహకులు అనుమతించలేదు. స్టేడియంకు ఆలస్యంగా రావడమే కారణం. వరదల కారణంగా దుబాయ్‌ ఎయిర్‌పోర్టులో చిక్కుకుపోయిన వీరు నిన్న ఉదయం 8 గంటలకు కిర్గిస్థాన్‌ చేరుకున్నారు. కానీ అప్పటికే ఆలస్యమైంది. అయితే వీరు టర్కీలో జరిగే క్వాలిఫయర్స్‌లో పాల్గొనేందుకు అవకాశం ఉంది.

News April 20, 2024

మీ పర్సనల్ డేటా సేఫ్: డిజీ యాత్ర

image

డిజీ యాత్ర యాప్ ప్రయాణికుల పర్సనల్ డేటా సేకరిస్తోందని అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ ఆ సంస్థ స్పందించింది. ”ప్రయాణికుల వ్యక్తిగత వివరాలను యాప్ సేకరించదు. ఆ వివరాలు కేవలం యూజర్ల ఫోన్‌లోనే ఉంటాయి. ఈ డేటాను డిజీ యాత్ర సహా మరెవరూ యాక్సెస్ చేయలేరు” అని స్పష్టం చేసింది. కాగా ప్రయాణికులకు ఎయిర్‌పోర్టులో బోర్డింగ్ ప్రక్రియ సులభతరం అయ్యేందుకు కేంద్రం ఆధ్వర్యంలో ఈ డిజీ యాత్ర సేవలు అందుబాటులోకి వచ్చాయి.

News April 20, 2024

2026 నాటికి ఎయిర్ ట్యాక్సీలు?

image

2026 నాటికి దేశంలో ఎయిర్ ట్యాక్సీ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఇండిగో మాతృసంస్థ గ్లోబ్ ఎంటర్‌ప్రైజెస్, ఆర్చర్ ఏవియేషన్ ఈ సేవలు అందించనున్నాయి. తొలుత ఢిల్లీ.. ఆ తర్వాత ముంబై, బెంగళూరులో ఇవి ఎగరనున్నాయి. ట్యాక్సీల్లో పైలట్‌తో పాటు నలుగురు ప్రయాణికులు కూర్చోవచ్చు. దీని ధర 1 బిలియన్ డాలర్లు ఉంటుంది. 27 కి.మీ దూరాన్ని 7 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఇందుకు రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు ఛార్జి ఉండనుంది.

News April 20, 2024

ఒలింపిక్స్‌లో మన పట్టు సడలుతోంది!

image

ఒలింపిక్స్ అనగానే భారత అభిమానులకు వెంటనే గుర్తొచ్చే క్రీడ.. రెజ్లింగ్. అందులోనూ భారత్‌కు పతకాలు తెచ్చిన పురుషుల ఫ్రీస్టైల్ కేటగిరీకి మంచి క్రేజ్ ఉంది. కానీ ఈసారి ఈ కేటగిరీలో ఆటగాళ్లు క్వాలిఫై కావడమే గగనమవుతోంది. 53KG కేటగిరీలో అంతిమ్ పంఘల్ ఒక్కరే అర్హత సాధించారు. 57, 65, 86, 97, 125 కేజీ కేటగిరీల్లో ఇప్పటివరకు ఒక్కరూ క్వాలిఫై కాలేదు. టర్కీలో మే 9-12 మధ్య జరిగే క్వాలిఫైయర్సే భారత్‌కు చివరి అవకాశం.

News April 20, 2024

ఏప్రిల్ 20: చరిత్రలో ఈరోజు

image

1889: జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ జననం
1950: ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ చీఫ్ చంద్రబాబు జననం
1930: సినీ రచయిత త్రిపురనేని మహారథి జననం
1972: సినీ నటి మమతా కులకర్ణి జననం
1972: సినీ నటి అంజలా జవేరీ జననం
1992: టాలీవుడ్ తొలి నేపథ్య గాయకుడు ఎమ్ఎస్ రామారావు మరణం

News April 20, 2024

రాయి దాడిపై అనుచిత వ్యాఖ్యలు.. టీడీపీకి సీఈవో నోటీసులు

image

AP: సీఎం జగన్‌పై రాయి దాడి తర్వాత సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలపై టీడీపీ జనరల్ సెక్రటరీకి సీఈవో నోటీసులు జారీ చేశారు. 48 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. లేదంటే చర్యలు తీసుకుంటామని తెలిపారు. జై టీడీపీ, తెలుగు దేశం పార్టీ అకౌంట్ల నుంచి జగన్‌పై అనుచిత పోస్టులు చేశారని సీఈవోకు వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను సమర్పించారు.

News April 20, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.