News April 18, 2024

ఈసీని వారం గడువు కోరిన KCR

image

TG: ఈసీ నోటీసులపై మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు. వివరణ ఇచ్చేందుకు తనకు వారం గడువు కావాలని కోరారు. ఇటీవల సిరిసిల్ల పర్యటనలో తమ నేతలపై కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేసింది. దీంతో ఇవాళ ఉ.11 గంటల్లోగా వివరణ ఇవ్వాలంటూ మాజీ సీఎంకు ఎన్నికల సంఘం నోటీసులు పంపింది.

News April 18, 2024

చంద్రబాబు మాదిరి ‘గ్రాఫిక్స్’ చూపి మోసం చేయం: బొత్స

image

AP: రాజకీయాల్లో చంద్రబాబుకు, ఊసరవెల్లికి తేడా లేదని, స్టేజీ మారితే ఆయన మాట మారుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. TDP చీఫ్ మాదిరి గ్రాఫిక్స్ చూపించి మోసం చేసే ప్రభుత్వం తమది కాదన్నారు. ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణికుల సామర్థ్యంతో భోగాపురం ఎయిర్‌పోర్టు పనులు జరుగుతున్నాయని తెలిపారు. విశాఖ మెట్రో రైలు DPR రెడీ అయ్యిందని చెప్పారు. వైజాగ్ పరిపాలనా రాజధానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.

News April 18, 2024

ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా

image

ఓటుకు నోటు కేసును సుప్రీంకోర్టు జులై 24కి వాయిదా వేసింది. ఈ కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చి, సీబీఐకి అప్పగించాలని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంలో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టగా.. కేసును ఫైల్ చేసేందుకు తగిన సమయం కావాలని తెలంగాణ తరఫు న్యాయవాది వాదించారు. మరోవైపు సెలవుల తర్వాత విచారణ జరపాలని చంద్రబాబు తరఫు లాయర్ కోరారు. దీంతో విచారణను న్యాయస్థానం వాయిదా వేసింది.

News April 18, 2024

చంద్రగిరి కోటకు రాజెవరో?

image

తిరుపతి(D)లో కీలక నియోజకవర్గం చంద్రగిరి. 1978లో చంద్రబాబు గెలిచిన సెగ్మెంట్ ఇది. ఇక్కడ చివరిసారిగా 1994లో TDP గెలిచింది. 3దశాబ్దాలుగా ఇక్కడ ఉనికి లేకుండా పోయిన TDP ఈసారి గెలవాలనే పట్టుదలతో ఉంది. పులివర్తి నానిని మరోసారి రణరంగంలోకి దింపింది. YCP నుంచి 2014, 19లో MLAగా గెలిచిన కీలక నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు మోహిత్ రెడ్డి పోటీ చేస్తున్నారు. గెలుపుపై ఎవరికి వారు ధీమాగా ఉన్నారు.
<<-se>>#ELECTIONS2024<<>>

News April 18, 2024

ఫోన్‌పే, గూగుల్‌పేకు చెక్ పెడతారా?

image

డిజిటల్ పేమెంట్స్‌లో గూగుల్‌పే, ఫోన్‌పే, PAYTMల ఆధిపత్యానికి చెక్ పెట్టేలా NPCI సిద్ధమైనట్లు తెలుస్తోంది. UPI చెల్లింపుల్లో కొత్త సంస్థలను ప్రోత్సహించేలా క్రెడ్, స్లైస్, జొమాటో, ఫ్లిప్‌కార్ట్‌లతో NPCI త్వరలో భేటీ కానుంది. ఈ 3 సంస్థల లావాదేవీల పరిమాణం 90శాతానికి పెరగడంతో ఇవి గుత్తాధిపత్యం చెలాయిస్తాయని RBI ఆందోళన చెందుతోంది. దీంతో కొత్త సంస్థలను ప్రోత్సహించేలా NPCI రాయితీలు ప్రకటించే ఛాన్సుంది.

News April 18, 2024

KCRను బద్నాం చేయాలనే కాంగ్రెస్ చిల్లర రాజకీయం: KTR

image

TG: కాంగ్రెస్ చిల్లర రాజకీయం చేస్తూ, రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని మాజీ మంత్రి KTR మండిపడ్డారు. ‘మేడిగడ్డ వద్ద కాఫర్ డ్యాం కట్టి మరమ్మతులు చేయాలని KCR డిమాండ్ చేశారు. కడతామని L&T కంపెనీ కూడా అంగీకరించింది. కానీ కేసీఆర్‌ను బద్నాం చేయాలనే కాఫర్ డ్యాం కట్టకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిండా ముంచాలని చూస్తోంది. ఇంత నికృష్ట రాజకీయం కేవలం ఎన్నికల్లో లాభం కోసమేనా?’ అని KTR ప్రశ్నించారు.

News April 18, 2024

శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా ఆస్తులు అటాచ్

image

బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా దంపతులకు ఈడీ షాక్ ఇచ్చింది. రూ.7 వేల కోట్ల బిట్ కాయిన్ పోంజి స్కాంకు సంబంధించి రాజ్ కుంద్రాకు చెందిన రూ.97 కోట్ల స్థిర, చర ఆస్తులను అటాచ్ చేసింది. ముంబైలో శిల్పాశెట్టికి చెందిన ఫ్లాట్‌ను సైతం అటాచ్ చేసింది.

News April 18, 2024

టీమ్ సెలక్షన్ వార్తలపై స్పందించిన రోహిత్

image

T20 WCకు టీమ్‌ను సెలక్ట్ చేసేందుకు తాను, BCCI చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, కోచ్ ద్రవిడ్ ముంబైలో భేటీ అయ్యామంటూ వస్తున్న వార్తలపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించారు. ‘అదంతా ఫేక్ న్యూస్. నేనెవరినీ కలవలేదు. అగార్కర్ గోల్ఫ్ ఆడేందుకు దుబాయ్ వెళ్లాడు. ద్రవిడ్ బెంగళూరులో పిల్లలతో గడుపుతున్నాడు. మేం కలుసుకోలేదు. ఏదైనా కీలక సమాచారం ఉంటే మా ముగ్గురిలో ఎవరో ఒకరం అందరికీ తెలియజేస్తాం’ అని వెల్లడించారు.

News April 18, 2024

మాచర్లలో మాస్ పోరు.. డబుల్ హ్యాట్రిక్‌పై పిన్నెల్లి గురి!

image

పల్నాడు(D)లో హాట్‌సీటు మాచర్ల. ఈ ఐదేళ్లలో టీడీపీ, వైసీపీ వర్గ పోరుతో తీవ్ర ఘర్షణలు చోటు చేసుకున్న ప్రాంతమిది. కాంగ్రెస్ 5 సార్లు, TDP 4 సార్లు, YCP మూడు సార్లు, స్వతంత్రులు, CPI ఒకసారి గెలిచాయి. 2004 నుంచి గెలుస్తున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మరోసారి YCP రంగంలోకి దింపింది. ఈయనను దీటుగా ఎదుర్కొనేందుకు మాస్ లీడర్ జూలకంటి బ్రహ్మారెడ్డిని TDP బరిలో నిలిపింది.
<<-se>>#ELECTIONS2024<<>>

News April 18, 2024

ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా ఉండాలి: SC

image

VVPATలో ఓట్లను క్రాస్ చెక్ చేయాలని దాఖలైన పిటిషన్లను సుప్రీం కోర్టు విచారిస్తోంది. ఈ సందర్భంగా ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా ఉండాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది. స్వేచ్ఛ, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించాలని ఎన్నికల సంఘానికి సూచించింది. ఎన్నికల విషయంలో ఎవరికి ఆందోళన కలగకుండా చూడాలని పేర్కొంది.