News November 4, 2024

TG టెట్ నోటిఫికేషన్ విడుదల

image

తెలంగాణ టెట్ నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. ఈ నెల 5 నుంచి 20వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించేందుకు అవకాశం ఉంది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 20 వరకు ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహిస్తారు. పేపర్-1కు డీఈడీ, పేపర్-2కు బీఈడీ పూర్తి చేసిన అర్హులు. స్కూలు అసిస్టెంట్‌గా ప్రమోషన్ పొందేందుకు టెట్ అర్హత తప్పనిసరి కావడంతో టీచర్లు పనిచేస్తున్న వారు సైతం దరఖాస్తు చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

News November 4, 2024

ఇరిగేషన్‌ను పట్టించుకోని జగన్: మంత్రి నిమ్మల

image

AP: రాయలసీమ బిడ్డ అని చెప్పుకునే జగన్ ఇక్కడ సాగునీటి రంగాన్ని పట్టించుకోలేదని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. అగ్రికల్చర్, హార్టికల్చర్, డ్రిప్ ఇరిగేషన్‌ను గాలికొదిలేశారని దుయ్యబట్టారు. కర్నూలు ఉల్లి మార్కెట్‌ను తనిఖీ చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. గతేడాది OCTలో మార్కెట్‌కు 52వేల టన్నుల ఉల్లి వస్తే ప్రస్తుతం 2.5 లక్షల టన్నులు వచ్చిందన్నారు. ఈసారి రైతులు అధిక ధరను పొందారని చెప్పారు.

News November 4, 2024

భార్య ఎదుట ‘అంకుల్’ అన్నందుకు చితక్కొట్టాడు

image

తన భార్య ఎదుట ‘అంకుల్’ అని పిలిచిన షాప్‌కీపర్‌ను ఓ వ్యక్తి చితకబాదిన ఘటన MP భోపాల్‌లో జరిగింది. రోహిత్ అనే వ్యక్తి భార్యతో కలిసి చీర కొనడానికి ఓ షాప్‌కు వెళ్లాడు. ఏ ధరలో కావాలని షాప్‌కీపర్ అడగగా తన కెపాసిటీని తక్కువగా అంచనా వేయొద్దని రోహిత్ వార్నింగ్ ఇచ్చాడు. ‘మరిన్ని చీరలు చూపిస్తా అంకుల్’ అని అతను అనడంతో గొడవ జరిగింది. కాసేపటికి స్నేహితులతో వచ్చి అతడిని చావబాదాడు. ఈ ఘటనపై కేసు నమోదైంది.

News November 4, 2024

IPL తరహాలో APL: కేశినేని చిన్ని

image

AP: గ్రామీణ ప్రాంతాల్లోని క్రికెటర్లను ప్రోత్సహించేందుకు ఐపీఎల్ తరహాలో ఏపీఎల్ నిర్వహిస్తామని ఏసీఏ అధ్యక్షుడు, ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. త్వరలోనే NTR జిల్లా మూలపాడు క్రికెట్ స్టేడియంలోని రెండో గ్రౌండ్ అందుబాటులోకి వస్తుందన్నారు. ఇక్కడ సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేశామని చెప్పారు. 175 నియోజకవర్గాల్లోనూ క్రికెట్ మైదానాలు ఏర్పాటుచేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

News November 4, 2024

GET READY: సాయంత్రం 5.04కు ట్రైలర్

image

టాలీవుడ్ నటుడు నిఖిల్, రుక్మిణి వసంత్ జంటగా నటిస్తోన్న ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ సినిమా ట్రైలర్ ఈరోజు రిలీజ్ కానుంది. సాయంత్రం 5.04 గంటలకు ట్రైలర్ విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. సుధీర్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం ఈనెల 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా, తాజా ఇంటర్వ్యూలో ఇది రెగ్యులర్ మూవీలా ఉండదని, స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీ అని నిఖిల్ చెప్పడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.

News November 4, 2024

త్వరలో FMCG ఉత్పత్తుల ధరల పెంపు?

image

షాంపూలు, సబ్బులు, బిస్కెట్లు వంటి రోజువారీ వాడుకునే FMCG ఉత్పత్తుల ధరలు త్వరలోనే పెరిగే అవకాశం ఉంది. ఆహార ద్రవ్యోల్బణం కారణంగా SEPలో సంస్థల మార్జిన్లు తగ్గడం, పామాయిల్, కాఫీ, కోకో వంటి ఇన్‌పుట్ ఖర్చులు పెరగడంతో సంస్థలు ధరల పెంపు సిగ్నల్స్ పంపాయి. పట్టణాల్లో HUL, గోద్రెజ్,మారికో, ITC, టాటా FMCG ప్రొడక్ట్స్ వినియోగం తగ్గడంపై పరిశ్రమ ఆందోళన వ్యక్తం చేస్తోంది. త్వరలో ధరల పెంపుపై ప్రకటన చేసే ఛాన్సుంది.

News November 4, 2024

‘స్పిరిట్’లో ప్రభాస్ హీరోయిన్ ఈమేనా?

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించనున్న ‘స్పిరిట్’ ప్రీ పొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. వచ్చే ఏడాది నుంచి చిత్రీకరణ మొదలవనుంది. ఈ నేపథ్యంలో ఓ ఇంట్రెస్టింగ్ విషయం గురించి చర్చ జరుగుతోంది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన నయనతార నటిస్తారనే వార్త చక్కర్లు కొడుతోంది. ‘స్పిరిట్’ స్క్రిప్టు నయన్‌కు నచ్చేసినట్లు ప్రచారం జరుగుతోంది. 2007లో వీరిద్దరూ కలిసి ‘యోగి’లో నటించారు.

News November 4, 2024

గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం చేస్తోంది: కిషన్ రెడ్డి

image

TG: డిక్లరేషన్లు, గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలు చేయడం లేదని, కనీసం వాటి గురించి సమాచారం కూడా ఇవ్వడం లేదని అన్నారు. TG ప్రభుత్వం 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పి మోసం చేసిందని మండిపడ్డారు. ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని వ్యాఖ్యానించారు.

News November 4, 2024

ఓడిపోతే మా కులానికి చెడ్డపేరు వస్తుంది: మరాఠా కోటా యాక్టివిస్ట్

image

మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీచేయడం లేదని మరాఠా కోటా యాక్టివిస్ట్ మనోజ్ పాటిల్ అన్నారు. 10-15 మంది అభ్యర్థులకు మద్దతిస్తానని ప్రకటించిన కొన్ని గంటల్లోనే యూటర్న్ తీసుకున్నారు. ‘ఒకే కులం బలంతోనే గెలవలేం. పైగా రాజకీయాలకు మేం కొత్త. ఒకవేళ మేం పోటీచేసి ఓడిపోతే మా కులానికి చెడ్డపేరు వస్తుంది’ అని తెలిపారు. ఆయన నిర్ణయంతో శివసేన UBT, కాంగ్రెస్, పవార్ NCPకి లబ్ధి కలుగుతుందని విశ్లేషకులు అంటున్నారు.

News November 4, 2024

APPSC ఛైర్మన్‌కు MLC చిరంజీవి వినతులు

image

AP: నిరుద్యోగులకు చెందిన పలు అభ్యర్థనలను APPSC దృష్టికి MLC వేపాడ చిరంజీవి తీసుకెళ్లారు. ‘గ్రూప్-2 మెయిన్స్ కోసం 90 రోజుల గడువు, గ్రూప్-1 ప్రిలిమ్స్ కోసం 1:100 నిష్పత్తిలో ఎంపిక, Dy.EO,JL,DL నోటిఫికేషన్లు, UPSC మాదిరిగా జాబ్ క్యాలెండర్ అమలు, AEE ఖాళీల భర్తీ, 2018 గ్రూప్-1 మెయిన్స్ మూల్యాంకన విధానంపై విచారణ’ వంటి అంశాలను తాను APPSC ఛైర్మన్‌తో చర్చించినట్లు ఆయన వెల్లడించారు.