India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. సర్వదర్శన కంపార్ట్‌మెంట్లు నిండి నారాయణగిరి షెడ్ల వరకు భక్తులు వేచి ఉన్నారు. కాగా నిన్న శ్రీవారిని 74,467 మంది దర్శించుకున్నారు. 40,005 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.77 కోట్లు లభించింది.
బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో ఎనిమిది మంది బ్యాటర్లతో బరిలోకి దిగడం కలిసొచ్చిందని కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డారు. ‘టీ20ల్లో ఎక్కువగా ఫిఫ్టీలు, సెంచరీలు అవసరం లేదనుకుంటా. ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి తెస్తే పరుగులు ఆటోమెటిక్‌గా వస్తాయి. పాండ్య బ్యాటింగ్‌లో మెరిస్తే మాదే పైచేయి అవుతుంది. బౌలర్‌గాను అతను కీలకమైన ప్లేయర్. కుల్‌దీప్, బుమ్రా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు’ అని వ్యాఖ్యానించారు.
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘కల్కి 2898AD’ మూవీ టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సింగిల్ స్క్రీన్‌లో రూ.75, మల్టీప్లెక్స్‌లో రూ.100 చొప్పున ధరలు పెరగనున్నాయి. రిలీజయ్యే జూన్ 27న ఉదయం 5.30 బెనిఫిట్ షోకు రూ.200 పెంపు అదనంగా ఉండనుంది. జులై 4 వరకు ఈ ధరలు అమల్లో ఉంటాయి. మరోవైపు ఏపీలో ధరల పెంపుపై త్వరలోనే స్పష్టత రానుంది.
AP: అమరావతి నిర్మాణానికి రూ.15 వేల కోట్లు కేటాయించాలని కేంద్రాన్ని కోరినట్లు ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. పోలవరం నిర్మాణానికి సహకారం అందించాలని జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేశామన్నారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని అడిగినట్లు పేర్కొన్నారు. కడప స్టీల్ ప్లాంట్, రామాయపట్నం పోర్ట్, రైల్వే జోన్‌కు సహకారం అందించాలని కోరామన్నారు.
AP: విశాఖపట్నం కేంద్రంగా రూ.10 కోట్ల పెట్టుబడితో ఏడాదిలోగా ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ మోగ్లిక్స్ సేవలు ప్రారంభించనుంది. పారిశ్రామిక సంస్థలు, MSMEలకు అవసరమైన ఉత్పత్తులను కంపెనీ సరఫరా చేయనుంది. ఇప్పటికే HYD, నోయిడాలో రెండు టెక్నాలజీ హబ్‌లు నిర్వహిస్తున్న ఈ సంస్థకు MSMEలో 5 లక్షల మంది, 700 భారీ సంస్థలు క్లయింట్లుగా ఉన్నాయి. ప్రధానంగా ఆటోమొబైల్, ఫార్మా, MSME విభాగంలో సంస్థకు క్లయింట్‌లు ఉన్నాయి.
TG: రూ.5,048.1 కోట్ల సహకార రుణాలు మాఫీ కానున్నాయని తెలంగాణ రాష్ట్ర కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ ఛైర్మన్ మార్నేని రవీందర్ రావు వెల్లడించారు. 823 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లోని 7.75 లక్షల మంది చిన్న, మధ్య తరగతి రైతులకు చెందిన రుణాలు మాఫీ ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపామన్నారు. రూ.2లక్షల వరకు రుణాలను ఒకేసారి ప్రభుత్వం మాఫీ చేయడం చరిత్రాత్మకమన్నారు.
ఇరాన్ కొత్త అధ్యక్షుడు ఎవరో ఈనెల 30న తేలనుంది. ఈనెల 28న ఓటింగ్ జరగనుండగా, 30న ఫలితాలు వెల్లడి కానున్నాయి. అధ్యక్ష పదవి రేసులో ఆరుగురు అభ్యర్థులు నిలిచారు. పార్లమెంట్ స్పీకర్ జనరల్ మహమ్మద్ బఖర్ గలీబాఫ్, మాజీ చీఫ్ న్యూక్లియర్ నెగోషియేటర్ సయీద్ జలిలీ, మతాధికారి ముస్తాఫా పోర్ మొహమ్మదీ, దేశ ఉపాధ్యక్షుడు ఆమిర్ హోసేన్, టెహ్రాన్ మేయర్ అలీ రజా జకానీ, సంస్కరణల వాది మసూద్ పెజెష్కియాన్ పోటీలో ఉన్నారు.
టీ20 WCలో సూపర్-8లో భాగంగా అఫ్గానిస్థాన్‌తో మ్యాచులో ఆస్ట్రేలియా పేసర్ పాట్ కమిన్స్ హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టారు. వరుస బంతుల్లో(17.6, 19.1, 19.2) ముగ్గుర్ని ఔట్ చేసి ఈ టోర్నీలో రెండో హ్యాట్రిక్‌ను నమోదు చేశారు. 3 రోజుల క్రితం బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లోనూ ఆయన హ్యాట్రిక్ తీసిన సంగతి తెలిసిందే. దీంతో టీ20 WC చరిత్రలో రెండు హ్యాట్రిక్స్ తీసిన తొలి బౌలర్‌గా కమిన్స్ రికార్డు సృష్టించారు.
దేశంలో కొత్త టెలికం చట్టం-2023 ఈనెల 26 నుంచి అమల్లోకి రానుంది. దీని ప్రకారం అత్యవసర పరిస్థితుల్లో ఏ నెట్‌వర్క్‌నైనా ప్రభుత్వం తన నియంత్రణలోకి తీసుకునే అధికారం ఉంటుంది. ప్రజల భద్రత ప్రయోజనాల కోసం టెలికమ్యూనికేషన్ సేవల్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తాత్కాలికంగా నియంత్రణలోకి తీసుకోవచ్చు. ప్రభుత్వాల తరఫున నియమితులైన స్పెషల్ ఆఫీసర్లకు కూడా ఈ అధికారం ఉంటుంది.
అనుమానం పెనుభూతమై కన్నతండ్రిని కర్కశుణ్ని చేసింది. అనంతపురం(D) నార్పలకు చెందిన గణేశ్.. భార్యకు వివాహేతర సంబంధముందని, కూతురు పావని(6) తనకు పుట్టలేదని అనుమానించేవాడు. జూన్ 20న పావనిని స్కూల్ నుంచి బయటకు తెచ్చి పాడుబడ్డ బావి వద్దకు తీసుకెళ్లాడు. ఈత నేర్పిస్తాంటూ దూకమన్నాడు. ఆ పాప భయమేస్తోందంటూ గుక్కపట్టి ఏడ్చింది. కనికరం చూపని గణేశ్ పాపను ఎత్తి బావిలో పడేశాడు. పోలీసు విచారణలో నేరాన్ని అంగీకరించాడు.
Sorry, no posts matched your criteria.