News June 21, 2024

ఈ వృద్ధురాలి నిర్ణయాన్ని మెచ్చుకోవాల్సిందే!

image

మొబైల్‌కు అతుక్కుపోతున్న ప్రజలకు పుస్తక పఠనాన్ని అలవాటు చేసేందుకు భీమాబాయి కృషి చేస్తున్నారు. MHలోని నాసిక్ వద్ద ఉన్న ‘పుస్తకాంచ్ హోటల్ రిలాక్స్ కార్నర్’ను 74 ఏళ్ల భీమాబాయి నిర్వహిస్తున్నారు. హోటల్‌కు వచ్చిన వాళ్లు ఖాళీ సమయంలో మొబైల్‌ చూస్తూ ఉండటాన్ని గమనించాను. దీంతో ఫుడ్ వచ్చే దాకా వాళ్లు బుక్స్ చదువుకునేలా ఏర్పాట్లు చేశాను‘ అని ఆమె చెప్పారు. ప్రస్తుతం హోటల్‌లో 5వేల పుస్తకాలున్నాయి.

News June 21, 2024

పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ‘SDT18’

image

సాయి ధరమ్ తేజ్ హీరోగా పీరియాడికల్ యాక్షన్ డ్రామా కథాంశంతో ‘SDT18’ చిత్ర షూటింగ్ ప్రారంభమైంది. ఈ సినిమాతో కేపీ రోహిత్ దర్శకుడిగా పరిచయమవుతున్నట్లు మేకర్స్ తెలిపారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ బడ్జెట్‌తో మూవీని తెరకెక్కిస్తున్నట్లు చెప్పారు. ల్యాండ్ మైన్లతో కూడిన ప్రాంతంలో ఓ పచ్చని చెట్టుతో ఉన్న పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

News June 21, 2024

రేపు పులివెందులకు వైఎస్ జగన్

image

AP: మాజీ సీఎం వైఎస్ జగన్ రేపటి నుంచి 5 రోజులపాటు పులివెందులలో పర్యటించనున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి ఆయన సొంత నియోజకవర్గానికి వస్తుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది. రాయలసీమ జిల్లాల YCP నేతలు, కార్యకర్తలతో ఆయన విడివిడిగా సమావేశం నిర్వహిస్తారని తెలుస్తోంది. నిత్యం ప్రజల్లో ఉండేలా దిశానిర్దేశం చేస్తారని సమాచారం.

News June 21, 2024

సాంబార్ గిన్నెలో చనిపోయిన ఎలుక

image

ఐస్‌క్రీమ్‌లో <<13432138>>మనిషి వేలు<<>>, హెర్షే చాక్లెట్ సిరప్‌ బాటిల్‌లో చనిపోయిన <<13468152>>ఎలుక<<>> వచ్చిన ఘటనలు మరువకముందే మరో షాకింగ్ ఘటన వెలుగుచూసింది.
గుజరాత్ అహ్మదాబాద్‌లోని ప్రసిద్ధ దేవి దోస రెస్టారెంట్‌లో సాంబార్ గిన్నెలో చనిపోయిన ఎలుక ప్రత్యక్షమైంది. దీంతో కస్టమర్లు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో రెస్టారెంట్‌ను సీజ్ చేసి మేనేజ్మెంట్‌కు నోటీసులిచ్చారు.

News June 21, 2024

హైదరాబాద్‌లో పెరుగుతున్న బెగ్గింగ్ మాఫియా!

image

హైదరాబాద్ నగరంలో దాదాపు 3వేల మందికి పైగా యాక్టివ్ బెగ్గర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. సిగ్నల్స్ వద్ద, రద్దీ ప్రాంతాల్లో ప్రజలను ఇబ్బంది పెడుతున్న ఈ బెగ్గింగ్ మాఫియాను నిర్మూలించాలని నగరవాసులు కోరుతున్నారు. పోలీసులు, GHMC అధికారులు వీరిని గుర్తించి పునరావాసం కల్పించినా వారు అక్కడి నుంచి పారిపోతున్నారట. పసిపిల్లల పట్ల జాలి చూపుతారనే నెపంతో వారిని బెగ్గింగ్ కోసం ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది.

News June 21, 2024

FIRST TIME: గుండె కండరాల పునరుత్పత్తి

image

శరీరంలోని కీలకమైన అవయవాల్లో గుండె ఒకటి. హార్ట్ అటాక్‌ల వల్ల గుండె కండరాలు(కార్డియోమయోసైట్స్) దెబ్బతిన్నప్పుడు తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఇప్పటివరకు వీటిని పునరుత్పత్తి చేయడం సాధ్యం కాలేదు. అయితే బైపాస్ సర్జరీ తర్వాత రోగి గుండె కణాల సాయంతో వీటిని రీజనరేట్ చేయొచ్చని తొలిసారి ఆస్ట్రియా సైంటిస్టులు నిరూపించారు. ఇందుకు space hairdryer అనే పరికరాన్ని ఉపయోగించారు. దీనిపై మరిన్ని పరిశోధనలు చేయాలన్నారు.

News June 21, 2024

కేంద్రాన్ని ఆశ్రయించిన పేటీఎం ఉద్యోగులు

image

పేటీఎంలో వేటుకు గురైన పలువురు ఉద్యోగులు కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖను ఆశ్రయించారు. ఎలాంటి పరిహారం చెల్లించకుండా తమను తొలగించడం చట్టవిరుద్ధమని ఆరోపించారు. తమ ఉద్యోగాలను సంస్థ పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దాదాపు 50 మంది ఉద్యోగులు కేంద్రానికి ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ కేంద్రం నుంచి సానుకూల స్పందన రాకుంటే కోర్టును ఆశ్రయిస్తామని ఉద్యోగులు చెబుతున్నారు.

News June 21, 2024

BREAKING: అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు

image

AP: రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌గా చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రేపు ఆయన స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా కూటమి తరఫున అయ్యన్న ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. ఇంకెవరూ ఆ పదవి కోసం పోటీ పడకపోవడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది.

News June 21, 2024

2024-25 టీమ్ ఇండియా పూర్తి షెడ్యూల్ ఇదే!

image

T20 WC తర్వాత నుంచి వచ్చే ఏడాది FEBలో ప్రారంభమయ్యే ఛాంపియన్స్ ఛాంపియన్స్ ట్రోఫీ వరకు భారత్ 20 T20లు, 10 టెస్టులు, 6 వన్డేలు ఆడనుంది. జింబాబ్వేతో 5 T20లు (JULY), లంకతో 3 వన్డేలు, 3 T20లు (JUL, AUG), బంగ్లాతో 2 టెస్టులు, 3 T20లు (AUG, SEP), న్యూజిలాండ్‌తో 3 టెస్టులు (OCT, NOV), సౌతాఫ్రికాతో 4 T20లు (NOV), ఆస్ట్రేలియాతో 5 టెస్టులు (NOV, JAN), ఇంగ్లండ్‌తో 5 T20లు, 3 వన్డేల్లో (JAN, FEB) తలపడనుంది.

News June 21, 2024

BIG BREAKING: రైతు రుణమాఫీకి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్

image

TG: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీకి సీఎం రేవంత్ నేతృత్వంలోని కేబినెట్ ఆమోదం తెలిపింది. 2023 డిసెంబర్ 9కి ముందు తీసుకున్న రుణాలను ఏక కాలంలో మాఫీ చేయాలని నిర్ణయించింది. కాగా పంట రుణాల మాఫీకి రూ.40 వేల కోట్లు అవసరం అవుతాయని అంచనా వేస్తున్నారు.