India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పర్యావరణ పరిరక్షణకు కృషి చేసే వ్యక్తులకు ‘బ్లూ రెసిడెన్సీ’ పేరిట వీసాలు జారీ చేయాలని యూఏఈ ప్రభుత్వం నిర్ణయించింది. తమ దేశంలో పదేళ్ల పాటు నివాసం ఉండేందుకు వీలుగా వీటిని ఇవ్వనుంది. మెరైన్ లైఫ్, భూ ఉపరితలంపై పర్యావరణ వ్యవస్థ, గాలి నాణ్యత తదితర రంగాల్లో పనిచేస్తున్నవారు అర్హులు. ఈ వీసాల కోసం ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్‌షిప్, కస్టమ్స్ అండ్ పోర్ట్ సెక్యూరిటీ <
గత నెల చెన్నైలో 7 నెలల చిన్నారి అపార్ట్మెంట్ నుంచి కిందకు <<13141237>>పడబోతుండగా<<>> స్థానికులంతా కలిసి కాపాడారు. బిడ్డను చూసుకోవడం చేతకాదా? అంటూ తల్లి రమ్యను పలువురు ట్రోల్స్ చేశారు. టీవీ ఛానళ్లు కూడా ఆమెను ‘ఫెయిల్యూర్డ్ మదర్’ అంటూ అవమానించాయి. వీటిని తట్టుకోలేక మనస్తాపంతో రమ్య ఆత్మహత్య చేసుకుంది. కారణాలు తెలియకుండా నిందించడంతో ఓ బిడ్డకు తల్లిని లేకుండా చేశారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
AP: కాకినాడ సిటీ, పిఠాపురం నియోజకవర్గాల్లో కౌంటింగ్‌కు ముందు, ఆ తర్వాత హింసాత్మక ఘటనలు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ ఈసీకి నివేదిక ఇచ్చింది. ఆయా నియోజకవర్గాల్లోని ఏటిమొగ, దుమ్ములపేట, రామకృష్ణారావుపేట సహా పలు ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించింది. ఎన్నికల్లో గొడవలు చేసిన, ప్రేరేపించిన వ్యక్తులపై నిఘా ఉంచాలని నివేదికలో పేర్కొంది. కాగా జూన్ 4న ఫలితాలు వెల్లడవనున్నాయి.
సైబర్ నేరగాళ్ల ఆగడాలకు చెక్ పెట్టేందుకు కేంద్రం ఒకేసారి 18లక్షలకుపైగా మొబైల్ కనెక్షన్లను తొలగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకే డివైజ్ నుంచి వేలల్లో సిమ్ కనెక్షన్లను వినియోగించిన సందర్భాలు తమ దర్యాప్తులో బయటపడ్డాయని అధికారులు వెల్లడించారు. ఇటీవల 28,220 ఫోన్లను బ్లాక్ చేయమని టెలికాం సంస్థలను కేంద్రం ఆదేశించింది. కాగా ఏడాదిలో 1.70కోట్ల కనెక్షన్లను కేంద్రం తొలగించింది.
జూనియర్ ఎన్టీఆర్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘దేవుడు మీకు మంచి ఆరోగ్యం, ఆనందాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నా’ అంటూ ట్వీట్ చేశారు. మరోవైపు స్టార్ హీరోలు రామ్ చరణ్, మహేశ్ బాబు.. ఎన్టీఆర్‌కు బర్త్ డే విషెస్ చెబుతూ పోస్టులు పెట్టారు. ఇలాంటి సంతోషకరమైన పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు.
భారత్‌లో లాంచ్ చేసిన X-440 మోడల్ హిట్ కావడంతో హార్లే డేవిడ్సన్ మరిన్ని మోడల్స్ ప్రవేశపెట్టాలని భావిస్తోంది. హీరో మోటార్కార్ప్తో ప్రస్తుతం ఒక్క మోడల్‌కే పరిమితమైన ఒప్పందాన్ని విస్తరించాలని ఇరు సంస్థలు ప్లాన్ చేస్తున్నాయట. తయారీతో పాటు భారత్ నుంచి ఇతర మార్కెట్లకు ఎగుమతులు జరిగేలా ఒప్పందం జరగనున్నట్లు సమాచారం. కాగా ప్రస్తుతం X-440 బైక్స్ రాజస్థాన్‌లోని హీరో ప్లాంట్‌లో తయారు అవుతున్నాయి.
తెలంగాణ ఈసెట్ ఫలితాలు మ.12.30 గంటలకు విడుదల కానున్నాయి. పాలిటెక్నిక్ డిప్లమా, బీఎస్సీ(మ్యాథ్స్) విద్యార్థులు లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్, బీఫార్మసీ సెకండియర్‌లో ప్రవేశాలు పొందవచ్చు. ఈ ఫలితాలను అందరికంటే ముందుగా, ఎలాంటి విసిగించే యాడ్స్, లోడింగ్ సమస్యలు లేకుండా మెరుపు వేగంతో Way2News యాప్‌లో పొందవచ్చు. అలాగే వాట్సాప్ సహా ఏ ప్లాట్‌ఫాంకైనా రిజల్ట్స్ షేర్ చేసుకోవచ్చు.
TG: ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షల కోసం KCR ప్రారంభించిన డయాగ్నస్టిక్ వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూల్చడం బాధాకరమని హరీశ్ రావు అన్నారు. ‘KCR 36 డయాగ్నస్టిక్ కేంద్రాలను ఏర్పాటుచేసి 134 పరీక్షలను అందుబాటులో ఉంచారు. ఇప్పుడు నిర్వహణ లోపంతో అవి కొట్టుమిట్టాడుతున్నాయి. ఇప్పటికైనా అందులో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బందికి పెండింగ్ జీతాలు చెల్లించి ఆ సేవలను పునరుద్ధరించాలి’ అని Xలో డిమాండ్ చేశారు.
రాబోయే ఐపీఎల్ సీజన్లలో వెనకబడిన జట్లు ఆర్సీబీని చూసి స్ఫూర్తిని పొందుతాయని ఆ జట్టు వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ అన్నారు. తొలి ఎనిమిది మ్యాచుల్లో ఒక్కటే నెగ్గినా.. తర్వాత వరుసగా ఆరు మ్యాచులు గెలుపొందడం అసాధారణమని పేర్కొన్నారు. ఈ ప్రయాణం తమకెంతో ప్రత్యేకమన్న ఆయన.. అభిమానులు ఆర్సీబీ జట్టును ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారని అన్నారు. అత్యుత్తమ ఫీల్డింగ్ కూడా తమ విజయాలకు కారణమని తెలిపారు.
బంగాళాఖాతంలో ఈ నెల 22న అల్పపీడనం ఏర్పడనుండగా.. ఈ నెల 24 నాటికి అది ఈశాన్య దిశగా పయనించి వాయుగుండంగా బలపడనుంది. ఇది తుఫానుగా మారే అవకాశం ఉందన్న అంచనాలతో ఏ దిశగా పయనిస్తుందన్న దానిపై 2-3 రోజుల్లో స్పష్టత రానుంది. సహజంగా అండమాన్ సమీపంలో ఏర్పడే తుపాన్లలో అధికంగా బంగ్లాదేశ్ సమీపంలో తీరం దాటుతాయని.. ఈ తుపాను ప్రభావం APపై ఉంటుందా? లేదా? అన్న దానిపై త్వరలో స్పష్టత వస్తుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
Sorry, no posts matched your criteria.