India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ నిలిపివేస్తున్నారనే ప్రచారాన్ని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఖండించారు. ఎస్సీ, ఎస్టీలకు ప్రతి నెలా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 15,17,298 ఎస్సీ కుటుంబాలకు, 4,75,557 ఎస్టీ కుటుంబాలకు ఉచిత విద్యుత్ ద్వారా లబ్ధి చేకూరుస్తున్నట్లు ట్వీట్ చేశారు. కూటమి ప్రభుత్వంపై బురద చల్లే దుష్ప్రచారాన్ని నమ్మవద్దన్నారు.

+94777455913, +37127913091, +56322553736 నంబర్ల నుంచి కాల్స్ వస్తే ఫోన్ ఎత్తకూడదని సైబరాబాద్ పోలీసులు తెలిపారు. +371 (లాత్వియా), +375 (బెలారస్), +381 (సెర్బియా), +563 (లోవా), +370 (లిథువేనియా), +255 (టాంజానియా) వంటి ఇంటర్నేషనల్ కోడ్‌లతో మొదలయ్యే నంబర్లతో రింగ్ చేసి ఎత్తిన తర్వాత హ్యాంగ్ చేస్తారన్నారు. తిరిగి ఫోన్ చేస్తే బ్యాంక్ వివరాలు కాపీ చేస్తారని, #90, #09 నంబర్లు నొక్కొద్దని హెచ్చరించారు.

సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్(GSEC)ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని గూగుల్ నిర్ణయించుకుంది. ఈ ఆగస్టులో CM రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు కంపెనీ ప్రతినిధులతో జరిపిన చర్చలు సత్ఫలితాలనిచ్చాయి. టోక్యో తర్వాత ఆసియా-పసిఫిక్ రీజియన్‌లో ఏర్పాటు చేయనున్న తొలి సెంటర్ ఇదే. GSEC దేశంలో అధునాతన సెక్యూరిటీ, ఆన్‌లైన్ ఉత్పత్తుల భద్రత విషయంలో కీలకంగా వ్యవహరించనుంది. సైబర్ సెక్యూరిటీలో పరిశోధనలకు వేదికగా నిలవనుంది.

ఈ ఏడాది ఆగస్టులో కురిసిన భారీ వర్షాలు, ఈదురు గాలుల ధాటికి ములుగు జిల్లా మేడారం అడవుల్లో సుమారు 85వేల చెట్లు నేలకూలాయి. వీటిలో 50-100 ఏళ్ల మహావృక్షాలు కూడా ఉన్నాయి. ఇవాళ అదే ప్రాంతంలో 5.3 తీవ్రతతో భూకంపం రావడంతో చెట్లు కూలడమే ఇందుకు కారణమా అని స్థానికులు అనుమానిస్తున్నారు. ఈ అడవి సమీపంలో గోదావరి ప్రవహిస్తుండటం, బొగ్గు గనులు ఉండటంతో దీనిపై అధ్యయనం చేయాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

శ్రీహరికోట నుంచి ప్రయోగించాల్సిన PSLV-C59 ప్రయోగం వాయిదా పడింది. ప్రోబా-3 ఉపగ్రహంలో సాంకేతిక లోపంతో ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నట్లు ఇస్రో ప్రకటించింది. రేపు సాయంత్రం 4.12 గంటలకు రాకెట్ ప్రయోగిస్తామని వెల్లడించింది. సూర్యుడి కరోనాను పరీక్షించేందుకు ఈ పరిశోధన చేపట్టారు.

AP: అమరావతిలో నివాస <<14784465>>గృహానికి<<>> భూమి కొనుగోలు చేసినట్లు, త్వరలో ఇంటి నిర్మాణం ప్రారంభిస్తామని CM చంద్రబాబు తెలిపారు. అటు, కాకినాడ పోర్టు విషయంలో జగన్ తీరును ప్రజలు గమనిస్తున్నారన్నారు. పారిశ్రామికవేత్తలను బెదిరించిన నీచ చరిత్ర జగన్‌ది అని, అన్నింటిపైనా విచారిస్తామని మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడారు. కాకినాడ పోర్టులో సీజ్ చేసిన షిప్‌లో ఇవాళ కూడా అధికారులు తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే.

3లక్షల ఏళ్లకంటే పురాతనమైన మానవ అవశేషాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. చైనా హవాయి విశ్వవిద్యాలయం కాలేజీ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లోని మనోవా డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఆంత్రోపాలజీ ప్రొఫెసర్ క్రిస్టోఫర్ జె. బే వీటిని కనిపెట్టారు. ఆయన 30 ఏళ్లుగా ఆసియా అంతటా మానవ పూర్వీకులపై అధ్యయనం చేశారు. ఫలితంగా హోమో జులుయెన్సిస్ అనే పురాతన మానవ జాతిని గుర్తించారు. పెద్ద పుర్రె ఆధారంగా వీరి తలలు పెద్దగా ఉంటాయని తెలిపారు.

యూపీలోని సంభల్‌కు వెళ్తున్న రాహుల్ గాంధీని పోలీసులు <<14786784>>అడ్డుకోవడాన్ని<<>> కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇదే అంశాన్ని ఆ పార్టీ ఎంపీ మహ్మద్ జావెద్ లోక్‌సభలో లేవనెత్తారు. ప్రతిపక్ష నేతను అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన ప్యానెల్ స్పీకర్ జగదాంబికా పాల్ ‘ఇక్కడ పార్లమెంట్ సెషన్ నడుస్తుంటే రాహుల్ బయటేం చేస్తున్నారు? ఆయన సమావేశాలకు హాజరవ్వాలి కదా?’ అని కౌంటర్ ఇచ్చారు.

TG: KCRపై కోపంతో CM రేవంత్ తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చుతున్నారని KTR అన్నారు. ‘మూర్తీభవించిన స్త్రీగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని KCR ఏర్పాటు చేయించారు. దానిని మార్చవద్దని CMకి చెబుతున్నా. ఇందిరా గాంధీ పెట్టిన భరత మాత విగ్రహాన్ని వాజపేయీ మార్చలేదు. రేవంత్ ఆటలు ఎల్లకాలం సాగవు. రాజీవ్ విగ్రహం ఉన్న చోటే భవిష్యత్తులో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం’ అని ప్రెస్ మీట్‌లో వ్యాఖ్యానించారు.

తన కుమార్తె సారా టెండూల్కర్ సచిన్ ఫౌండేషన్‌కు డైరెక్టర్‌గా నియమితులైనట్లు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెలిపారు. ‘ఆమె లండన్ యూనివర్సిటీ నుంచి క్లినికల్ & పబ్లిక్ హెల్త్ న్యూట్రిషన్‌లో మాస్టర్స్ డిగ్రీని పొందింది. క్రీడలు, ఆరోగ్య సంరక్షణ & విద్య ద్వారా భారతదేశాన్ని మరింత శక్తిమంతం చేయడానికి ఆమె ప్రయత్నిస్తోంది’ అని ఆయన తెలిపారు. నిరుపేద పిల్లలతో ఆమె ఉన్న ఫొటోలను ఆయన పంచుకున్నారు.
Sorry, no posts matched your criteria.