India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం ఇళ్లు ఇచ్చింది ఎన్టీఆరేనని సీఎం చంద్రబాబు తెలిపారు. ఎస్సీలను అన్నివిధాల ఆదుకుంది టీడీపీనేనని అసెంబ్లీలో పేర్కొన్నారు.. ‘దళితులైన బాలయోగిని లోక్‌సభ స్పీకర్, ప్రతిభాభారతిని అసెంబ్లీ స్పీకర్, కాకి మాధవరావును సీఎస్ చేశాం. ఎస్సీల కోసం రూ.8,400 కోట్లతో పథకాలు తీసుకొచ్చాం. ఉగాది నుంచి పీ4 ప్రారంభిస్తాం. వర్గీకరణకు సహకరించిన BJPకి, పవన్ కళ్యాణ్‌కు ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.

TG: హైదరాబాద్ వేదికగా మే 7 నుంచి 31 వరకు 72వ మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించనున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. 140 దేశాల అతిథులకు తెలంగాణ సంస్కృతిని పరిచయం చేసేందుకు ఇదొక గొప్ప అవకాశమన్నారు. అలాగే రాష్ట్రానికి ఆర్థికంగానూ లబ్ధి చేకూరుతుందని చెప్పారు. స్క్విడ్ గేమ్, BTS బ్యాండ్ లాంటివి సౌత్ కొరియా అభివృద్ధికి ఉపయోగపడ్డాయని తెలిపారు. మిస్ వరల్డ్ ఈవెంట్‌ను రాజకీయ కోణంలో చూడొద్దని కోరారు.

భార్య పోర్న్ చూస్తోందనో లేక స్వయంతృప్తిని పొందుతోందనో భర్త విడాకులు ఇవ్వడం కుదరదని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. తనతో పాటు కలిసి చూడాలంటూ భర్తను ఆమె బలవంతపెట్టనంత వరకూ అది వైవాహిక క్రూరత్వం కిందకు రాదని తేల్చిచెప్పింది. భార్య పోర్న్ చూస్తూ స్వయంతృప్తిని పొందుతోందని, ఆమె నుంచి తనకు విడాకులిప్పించాలని కోరుతూ ఓ భర్త వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ తీర్పు చెప్పింది.

AP: రాష్ట్ర శాసనసభను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. మొత్తం 15 రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. గత నెల 24 నుంచి నేటి వరకు సమావేశాలు కొనసాగాయి. 85 గంటల 55 నిమిషాల పాటు సభ కొనసాగింది. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులకు కూటమి సర్కార్ ఆమోదం పలికింది. అలాగే 9 బిల్లులకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, మారుతి కాంబోలో తెరకెక్కుతోన్న ‘ది రాజాసాబ్’ సినిమా టీజర్‌పై నెట్టింట చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఈ చిత్ర విడుదలను వాయిదా వేస్తున్నట్లు వార్తలు రాగా, టీజర్‌తో దీనిపై క్లారిటీ ఇచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఏప్రిల్ తొలివారంలోనే టీజర్ విడుదల చేయాలని భావిస్తున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. కాగా, ‘ది రాజాసాబ్’ చిత్రీకరణ ఇంకా పూర్తికాలేదని వెల్లడించాయి.

AP: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బుడగజంగం కులాన్ని ఎస్సీల్లో చేర్చాలంటూ శాసనసభలో తీర్మానం చేసింది. దీనికి సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. అసెంబ్లీ తీర్మానాన్ని ప్రభుత్వం త్వరలోనే కేంద్రానికి పంపనుంది.

మరో రెండ్రోజుల్లో IPL మొదలు కానుండటంతో అన్ని జట్లు సమరానికి సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాయి. అయితే పంజాబ్ కింగ్స్ జట్టు ఈసారి కప్ తమకే రావాలంటూ ప్రత్యేక పూజలు నిర్వహించింది. టీమ్ కోచ్ రికీ పాంటింగ్, కోచింగ్ సిబ్బంది, ప్లేయర్లంతా కలిసి పూజలో పాల్గొన్నారు. 2008 నుంచి ఆడుతున్నప్పటికీ పంజాబ్ ఒక్కసారి కూడా ట్రోఫీ అందుకోలేదు. మరి పూజతోనైనా జట్టు తలరాత మారుతుందో చూడాలి.

TG: రేవంత్ రెడ్డి జాక్ పాట్ సీఎం అని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు వేశారు. ‘ఆయనకు అదృష్టం బాగుంది.. పర్సనాలిటీ పెంచుకుంటారనుకున్నా. అయితే పర్సెంటేజీలపైనే రేవంత్‌కు ఆసక్తి ఉంది. ఢిల్లీకి మూటలు పంపి పదవి కాపాడుకోవడంపై దృష్టి పెట్టారు’ అని విమర్శించారు. సూర్యాపేట సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ కార్యకర్తలు ఫీనిక్స్ పక్షిలా పోరాటం చేస్తున్నారని KTR ప్రశంసించారు.

వచ్చే ఏడాది మార్చి నెలాఖరుకల్లా భారత్ మావోయిస్టురహిత దేశంగా నిలుస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. ‘ఈరోజు ఛత్తీస్‌గఢ్‌లో 22మంది నక్సల్స్‌ని మన సైనికులు అంతం చేశారు. ఈ క్రమంలో ‘నక్సల్ రహిత భారత్’ దిశగా మరో విజయాన్ని సాధించారు. ప్రభుత్వం ఎన్ని అవకాశాలిచ్చినా లొంగిపోని నక్సలైట్లపై జాలి చూపే ప్రసక్తే లేదు. మా ప్రభుత్వం వారిపై అత్యంత కఠిన వైఖరిని అవలంబిస్తోంది’ అని పేర్కొన్నారు.

APలో 16,862 కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని హోం మంత్రి అనిత అసెంబ్లీలో వెల్లడించారు. త్వరలో 6,100 ఉద్యోగాల నియామకం పూర్తవుతుందని చెప్పారు. మిగిలిన 10,762 పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు. అనుమతి రాగానే రిక్రూట్‌మెంట్ ప్రక్రియ మొదలవుతుందని పేర్కొన్నారు. పోలీసులు ప్రమాదవశాత్తు చనిపోతే రూ.10-15 లక్షలు కుటుంబానికి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
Sorry, no posts matched your criteria.