India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మహారాష్ట్రలో EVMల ట్యాంపరింగ్ జరిగిందని ఆరోపిస్తూ MVA MLAలు నేటి ప్రమాణ స్వీకారోత్సవాన్ని బహిష్కరించారు. ‘గెలుపొందిన మా MLAలు నేడు ప్రమాణం చేయరు. మాకు EVMలపై అనుమానాలు ఉన్నాయి. ప్రజాస్వామ్యం కూనీ అయింది’ అని శివసేన UBT అధినేత ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. ‘ఫలితాలపై సందేహాలొస్తున్నాయి. మొత్తం ప్రక్రియ కళంకితమైంది. ఏదో తప్పు జరిగినట్టు ప్రజలు చాలా అసంతృప్తితో ఉన్నారు’ అని కాంగ్రెస్ MLA విజయ్ తెలిపారు.

తెలియని ప్రదేశానికి వెళ్లేటప్పుడు చాలామంది అనుసరిస్తున్నది గూగుల్ మ్యాప్స్‌నే. ఇది రెండువైపులా పదునైన కత్తి. ఎంతగా ఉపయోగపడుతుందో గుడ్డిగా నమ్మితే నట్టేట ముంచడమూ ఖాయమే. మ్యాప్స్ పెట్టుకొని వెళ్లి అడవుల్లో తేలడం, నదిలో మునగడం, వంతెనలపై నుంచి పడిపోవడం తెలిసిందే. ఇలాంటప్పుడు సొంత మెదడు వాడాలని నిపుణులు చెప్తున్నారు. ఆ రోడ్లపై రాకపోకలు లేకున్నా, వాహనాలు, మనుషులు ఎదురవ్వకున్నా అనుమానించాలని అంటున్నారు.

ఇద్దరు భారత సంతతి వ్యక్తులకు ఇచ్చిన గౌరవాలను బ్రిటిష్ రాజు ఛార్ల్స్ వెనక్కి తీసుకున్నారు. రమీ రేంజర్ అనే వ్యక్తికి కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్, అనిల్ భానోత్ అనే వ్యక్తికి ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ అనే బిరుదుల్ని గతంలో ఇచ్చారు. బంగ్లాలో హిందువులపై జరుగుతున్న దాడిని వారు ఖండించారు. అది ఆ గౌరవాలకు భంగం కలిగించిందని బ్రిటిష్ రాజ్యం భావించినట్లు సమాచారం.

అడిలైడ్ టెస్టులో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. అశ్విన్ బౌలింగ్‌లో మార్ష్ డిఫెండ్ చేసేందుకు యత్నించగా బంతి బ్యాట్‌ను తాకుతున్నట్లుగా వెళ్లి పంత్ చేతిలో పడింది. భారత్ అప్పీల్ చేయగా అంపైర్ అవుట్ ఇచ్చేశారు. మార్ష్ కూడా సైలెంట్‌గా పెవిలియన్‌కు వెళ్లిపోయారు. తీరా రీప్లేలో చూస్తే బంతి బ్యాట్‌కు తగలనేలేదని తేలింది. బ్యాట్ తన ప్యాడ్‌కు తాకగా బంతికి తాకినట్లు మార్ష్ భావించి వెళ్లిపోయారు.

AP: శ్రీకాకుళంలో ఉద్దానం సమస్యను తానే బయటకు తీసుకొచ్చినట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆనాటి సీఎం చంద్రబాబు రూ.61 కోట్లతో ఉద్దానం ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లారన్నారు. కడపలో ఇంత నీటి సమస్య ఉందనుకోలేదని తెలిపారు. ఈ ప్రాంతం నుంచి ఇద్దరు సీఎంలు అయినందున సమస్యలు తీరిపోయి ఉంటాయనుకున్నానని పేర్కొన్నారు. తాగు నీటి కోసం ఎక్కడా ఇబ్బంది రాకూడదనేదే కూటమి ప్రభుత్వం లక్ష్యమని వెల్లడించారు.

TG: మహబూబ్ నగర్ జిల్లాలో మరోసారి భూప్రకంపనలు కలకలం రేపాయి. పలు ప్రాంతాల్లో 3.0 తీవ్రతతో భూమి కంపించింది. కౌకుంట్ల మండలం దాసరపల్లి సమీపంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇటీవల గోదావరి బెల్ట్ మొత్తం భూమి కంపించిన విషయం తెలిసిందే. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రత నమోదైంది.

TG: తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సచివాలయంలో విగ్రహ ప్రతిష్ఠను నిలిపివేయాలని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ ఛైర్మన్ జూలూరి గౌరీ శంకర్ కోరారు. త్వరలోనే ఈ పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ చేయనుంది. ఈ విగ్రహంపై బీఆర్ఎస్ విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.

AP: అత్యధికంగా లైబ్రరీలు ఉన్న ప్రాంతం రాయలసీమ అని, ఇదొక చదువుల నేల అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. అన్నమయ్య, వేమన, పుట్టపర్తి నారాయణాచార్యులు, కేవీ రెడ్డి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, గాడిచర్ల సర్వోత్తమరావు లాంటి మహానుభావులు ఇక్కడే పుట్టారన్నారు. రాయలసీమ అంటే అభివృద్ధిలో వెనుకబాటు కాదని, అవకాశాల కోసం ముందుండి నడిచే ప్రాంతం కావాలని ఆకాంక్షించారు.

AP: కడప మున్సిపల్ హైస్కూలులో నిర్వహించిన మెగా పేరెంట్స్& టీచర్స్ మీటింగ్‌లో Dy.CM పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. స్కూల్ ప్రాంగణంలో తల్లిదండ్రులు, విద్యార్థులతో మాట్లాడారు. మంత్రి లోకేశ్ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమం జరగడం అభినందనీయమన్నారు. అంతకుముందు మాదకద్రవ్యాల వల్ల కలిగే నష్టాలను ప్రతిబింబిస్తూ ‘డ్రగ్స్ వద్దు బ్రో’ క్యాంపెయిన్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.

AP: ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు కేంద్రం తరహాలో 730 రోజులు చైల్డ్ కేర్ లీవులను మంజూరు చేయాలని APJAC అమరావతి డిమాండ్ చేసింది. ప్రస్తుతం 180 రోజులే ఇస్తున్నారని తెలిపింది. పెన్షనర్ చనిపోతే భాగస్వామికి, ఇరువురూ మరణిస్తే వితంతు, విడాకులు తీసుకున్న కుమార్తెలకు పెన్షన్ ఇవ్వాలని కోరింది. 3 నెలలకోసారి ఉద్యోగులతో సమావేశమై సమస్యలను పరిష్కరించాలంది. ఈ మేరకు సీఎంవో ముఖ్యకార్యదర్శికి వినతిపత్రం సమర్పించింది.
Sorry, no posts matched your criteria.