India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: బాసర IIITలో ప్రవేశాల దరఖాస్తు గడువు ఈనెల 22 సాయంత్రం గం.5తో ముగియనుంది. ప్రత్యేక కేటగిరీ అభ్యర్థులు 29వ తేదీ లోపు సర్టిఫికెట్ల హార్డ్ కాపీలు పంపాల్సి ఉంటుందని VC వెంకటరమణ తెలిపారు. ఎంపికైన వారి లిస్ట్ జూలై 3న విడుదల చేసి 8-10 తేదీల్లో బాసరలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందని వెల్లడించారు. సందేహాల నివృత్తి కోసం అధికారిక సైట్‌లోని హెల్ప్ లైన్ నంబర్‌ను సంప్రదించాలని ఆయన సూచించారు.
TG: విద్యుత్ కొనుగోలు వ్యవహారంపై విచారణకు చట్టబద్ధంగా ఏర్పాటు చేసిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌ను KCR తప్పుబడతారా? అని కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. ‘తెలంగాణ ఉద్యమంలో జస్టిస్ నర్సింహారెడ్డి నిజాయతీ, ధైర్యసాహసాలను ప్రశంసించారు. మీ తప్పిదాలను ఈఆర్సీపై నెట్టేసి తప్పించుకోవాలనుకుంటున్నారా? విద్యుత్ కొనుగోళ్లు, కాళేశ్వరంపై విచారణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం జాప్యం చేస్తోంది’ అని మండిపడ్డారు.
AP: పౌరసరఫరాల శాఖలో ప్రక్షాళన మొదలైందని ఆ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. గత ప్రభుత్వంలో ఈ శాఖలో భారీగా అవినీతి జరిగిందని ఆరోపించారు. గత పాలకులు స్వార్థం కోసం స్కామ్‌లు చేశారని, అవకతవకలపై విచారణ జరిపిస్తామని తెలిపారు. వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య బౌలింగ్ ఫామ్‌లో ఉండటం జట్టు విజయానికి కీలకమని మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డారు. అతడి బౌలింగ్ సరిగ్గా ఉంటే కుల్‌దీప్‌ను ఆడించేందుకు వీలు ఉంటుందని వివరించారు. ‘హార్దిక్ వేసే లెంగ్త్ బాల్స్ వెస్టిండీస్ డ్రై పిచ్‌లకు సరిగ్గా సరిపోతాయి. తను బౌన్సర్స్, కటర్స్ వేస్తే ప్రత్యర్థి బ్యాటర్లకు చాలా కష్టం. ఇక తన బ్యాటింగ్ ఎలాగూ ఉండనే ఉంది’ అని పేర్కొన్నారు.
ప్రముఖ ఐటీ సంస్థ టీసీఎస్‌కు అమెరికా కోర్టు షాక్ ఇచ్చింది. తమ వ్యాపార రహస్యాలను టీసీఎస్ బయటపెట్టిందని ఆరోపిస్తూ DXC టెక్నాలజీ కంపెనీ కేసు వేసింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం టీసీఎస్‌కు ప్రతికూలంగా తీర్పునిచ్చింది. రూ.1600 కోట్ల పెనాల్టీ చెల్లించాలని ఆదేశించింది. కాగా ఈ తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయాలని TCS నిర్ణయించింది. కోర్టు ఆదేశాలు తమ ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావం చూపవని పేర్కొంది.
AP: విశాఖను IT, తిరుపతిని ఎలక్ట్రానిక్స్ హబ్స్‌గా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను మంత్రి లోకేశ్ ఆదేశించారు. IT, ఎలక్ట్రానిక్స్ శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. APకి కంపెనీలను రప్పించడానికి ఎలాంటి ప్రోత్సాహకాలివ్వాలనే దానిపై చర్చించారు. త్వరలో ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ పాలసీ తెస్తామని లోకేశ్ చెప్పారు. పెద్ద కంపెనీలు పెట్టుబడులు పెట్టేలా ప్రత్యేకంగా ఆహ్వానించాలని సూచించారు.
TG: వర్షాకాలంలో అత్యవసర పరిస్థితుల్లో స్పందించేలా చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. పలువురు మంత్రులతో కలిసి కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను CM సందర్శించారు. ‘ORR లోపల ఉన్న సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు లింక్ చేయాలి. ట్రాఫిక్ అలర్ట్స్‌ను నిత్యం ప్రజలకు అందించాలి. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా, వేగంగా పరిష్కరించేలా హోంగార్డుల నియామకం చేపట్టాలి’ అని ఆదేశించారు.
నీట్ పేపర్ లీకేజీ ఆరోపణలపై బిహార్ GOVT ఏర్పాటు చేసిన సిట్ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ‘మే 4న మాకు ప్రశ్నపత్రం అందింది. పేపర్ లీక్ చేసినందుకు అభ్యర్థుల నుంచి రూ.30లక్షల చొప్పున వసూలు చేశాం’ అని ఇద్దరు నిందితులు చెప్పినట్లు జాతీయ మీడియా పేర్కొంది. దీనిపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇంకా స్పందించలేదు. ఇందులో 13 మంది నీట్ అభ్యర్థులు భాగస్వామ్యం కాగా ఇప్పటికే నలుగుర్ని అరెస్ట్ చేశారు.
వెస్టిండీస్ వేదికగా జరగబోయే సూపర్-8 ఫైట్‌లో భారత్ మూడు జట్లతో తలపడనుంది. వీటిలో కనీసం రెండు మ్యాచుల్లో గెలుపొందినా సెమీస్ బెర్తు దక్కనుంది. సూపర్-8లో భాగంగా భారత్ తొలి మ్యాచ్‌ను ఈ నెల 20న అఫ్గాన్‌తో ఆడనుంది. ఆ తర్వాత జూన్ 22న బంగ్లాదేశ్ లేదా నెదర్లాండ్స్‌తో తలపడుతుంది. సూపర్-8లో చివరగా జూన్ 24న ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్‌లు బార్బొడోస్, ఆంటిగ్వా, సెయింట్ లూసియాలో జరగనున్నాయి.
AP: సీఎం చంద్రబాబు ఈ నెల 17న పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ప్రాజెక్టు ఎంతవరకు పూర్తైంది? గత ఐదేళ్లలో నిర్మాణం జరిగిన తీరు సహా పలు అంశాలను పరిశీలించనున్నారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించి, ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయడానికి చేపట్టాల్సిన చర్యలపై ఆయన చర్చిస్తారు.
Sorry, no posts matched your criteria.