News September 6, 2024

కూతురు అంటూనే ఏడాది పాటు అత్యాచారం: నటి

image

కూతురని పిలుస్తూనే ఓ తమిళ డైరెక్టర్ తనపై ఏడాది పాటు అత్యాచారం చేసినట్టు ఓ కేరళ నటి బయటపెట్టారు. తమిళంలో తొలి సినిమా చేస్తున్నప్పుడే తనపై లైంగిక దాడి జరిగిందన్నారు. ‘ఫస్టియర్ చదువుతుండగా ఆ దర్శకుడు పరిచయమయ్యాడు. మంచి ఆహారం పెడుతూ మచ్చిక చేసుకున్నాడు. కూతురు అని పిలిచే ఆయనే భార్య లేనప్పుడు ముద్దు పెట్టాడు. బలవంతంగా నన్ను వాడుకున్నాడు. భయంతో ఎవరికీ చెప్పకోలేకపోయా’ అని అన్నారు.

News September 6, 2024

ప్రకృతితో పెట్టుకోవద్దు..!

image

పట్టణీకరణ విస్తృతమవుతోంది. భూముల రేట్లు విపరీతంగా పెరగడంతో కబ్జాదారులు నాయకుల అండతో ప్రభుత్వ భూములను, వాగులను ఆక్రమించి వెంచర్లు వేస్తున్నారు. వీటికి అధికారులు కూడా పర్మిషన్లు ఇవ్వడంతో కష్టార్జితంతో ఇల్లు కట్టుకున్న ప్రజలు వరదలకు బలవుతున్నారు. నది లేదా వాగు దాని ప్రవాహ మార్గాన్ని మర్చిపోదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దాని మార్గంలో నిర్మాణాలు చేపడితే ఎప్పటికైనా నీళ్లపాలు కావాల్సిందే.

News September 6, 2024

బాలకృష్ణ వారసుడొచ్చేశాడు.. మూవీ పోస్టర్ రిలీజ్

image

నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ తేజ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ‘హనుమాన్’ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించనున్న మైథలాజికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో మోక్షజ్ఞ నటిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఆయన బర్త్ డే సందర్భంగా సినిమాలోని లుక్‌ను రివీల్ చేశారు. సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా త్వరలోనే టైటిల్, అప్డేట్స్ వెల్లడిస్తామన్నారు. మోక్షజ్ఞ లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి.

News September 6, 2024

రాయనపాడులో పెరిగిన బుడమేరు ఉద్ధృతి

image

AP: విజయవాడలో విలయం సృష్టించిన బుడమేరు ఉద్ధృతి నిన్న కాస్త తగ్గగా, ఇవాళ మళ్లీ పెరిగింది. రాయనపాడులో రాత్రి 10 గంటల నుంచి క్రమంగా నీటి మట్టం అధికమవుతోంది. ఇళ్లలోకి నీరు చేరుతుండటంతో గ్రామస్థులు భయాందోళనలకు గురవుతున్నారు. మరోవైపు రాయనపాడు రైల్వే స్టేషన్, ట్రాక్‌లపై వరద ప్రవహిస్తోంది.

News September 6, 2024

ఏపీ వరదలను జాతీయ విపత్తుగా పరిగణించాలి: సురేశ్ ప్రభు

image

వరదల కారణంగా ఆంధ్రప్రదేశ్‌ అతలాకుతలమైందని, ఈ ప్రకృతి వైపరీత్యాన్ని జాతీయ విపత్తుగా పరిగణించాలని కేంద్ర మాజీ మంత్రి సురేశ్ ప్రభు అన్నారు. ఏపీ ఇప్పటికే భారీ అప్పులు, ఆర్థిక సవాళ్లతో కొట్టుమిట్టాడుతోంది. లక్షలాది మంది వరద బాధిత ప్రజలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ, కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ వేగంగా స్పందించడం అభినందనీయం. వరద బాధితులకు అందరూ సహకరించాలి’ అని ట్వీట్ చేశారు.

News September 6, 2024

వినాయక పూజలో ఇవి మరిచిపోవద్దు!

image

వినాయక చవితి రోజున ప్రత్యేకమైన దీపాన్ని వెలిగిస్తే మంచిదని పురోహితులు చెబుతున్నారు. ప్రమిదలో కొబ్బరినూనె పోసి 5 జిల్లేడు ఒత్తులు విడిగా వేసి దీపం వెలిగిస్తే గణనాథుడి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. 21 పత్రాలతో పూజించడం వీలుకాని వారు గరిక పోచల జంటను వినాయకుడికి సమర్పించినా అంతే ఫలితం కలుగుతుంది. అలాగే, పండగ నాడు ఎరుపు/ నీలం రంగు వస్త్రాలు ధరిస్తే మంచి ఫలితాలు కలుగుతాయని అంటున్నారు.

News September 6, 2024

ఘోరం: ఒలింపిక్ అథ్లెట్‌ను చంపేసిన మాజీ ప్రియుడు

image

పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న ఉగాండా మారథాన్ రన్నర్ రెబక్కా చెప్టెగీ(33)ను మాజీ బాయ్‌ఫ్రెండ్ చంపేశాడు. ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించడంతో 75 శాతానికిపైగా శరీరం కాలిపోయింది. ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రెబక్కా తుదిశ్వాస విడిచారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని, గొప్ప అథ్లెట్‌ను కోల్పోయామని ఆ దేశ ఒలింపిక్ కమిటీ చీఫ్ డొనాల్డ్ రుకారే చెప్పారు. నిందితుడిని శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

News September 6, 2024

టీడీపీ ఎమ్మెల్యే వైరల్ వీడియో.. మహిళ భర్తకు హీరోయిన్ అభినందనలు

image

AP: చిత్తూరు(D) సత్యవేడు TDP MLA కోనేటి ఆదిమూలం అశ్లీల <<14026398>>వీడియోల<<>> వ్యవహారంపై హీరోయిన్ పూనమ్ కౌర్ స్పందించారు. ‘పవర్ రేపిస్ట్‌ గురించి బయట పెట్టాలని మహిళను ప్రోత్సహించిన భర్తను అభినందిస్తున్నా. అతను అలా చేయకపోతే ఆ ఎమ్మెల్యే టీడీపీ నుంచి సస్పెండ్ అయ్యేవారు కాదు. ఇది ఆ మహిళకు ఓ నమ్మకాన్ని ఇస్తుంది’ అని ట్వీట్ చేశారు.

News September 6, 2024

దెబ్బతిన్న పంటలను పరిశీలించిన కేంద్ర మంత్రి

image

AP: కృష్ణా జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటిస్తున్నారు. కేసరపల్లిలో దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించారు. నష్ట తీవ్రతను రైతులను అడిగి తెలుసుకున్నారు. అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి తదితరులు ఉన్నారు.

News September 6, 2024

అదనపు భద్రతకు జగన్ అనర్హుడు: నచికేత్

image

AP: మాజీ సీఎం జగన్‌కు జెడ్‌ప్లస్ కేటగిరీ భద్రత కల్పిస్తున్నామని స్టేట్ లెవెల్ భద్రత రివ్యూ కమిటీ సభ్యుడు, IPS ఆఫీసర్ షెల్కే నచికేత్ విశ్వనాథ్ హైకోర్టుకు తెలిపారు. ప్రస్తుతం 58మంది ఆయనకు భద్రత కల్పిస్తున్నారని, AP స్పెషల్‌ సెక్యూరిటీ గ్రూప్‌ చట్టం-2023 ప్రకారం అదనపు భద్రతకు జగన్ అనర్హుడని ఆయన పేర్కొన్నారు. కాగా తనకు భద్రత కుదింపుపై జగన్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ప్రస్తుతం దీనిపై విచారణ సాగుతోంది.