India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఢిల్లీతో మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ 185/5 రన్స్ చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన RR 36 రన్స్‌కే 3 వికెట్లు కోల్పోయింది. రియాన్ పరాగ్ ఆ జట్టును ఆదుకున్నారు. 45 బంతుల్లో 84 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచారు. అతడి ఇన్నింగ్సులో 6 సిక్సర్లు, 7 ఫోర్లున్నాయి. 20వ ఓవర్లో పరాగ్ ఏకంగా 25(4,4,6,4,6,1) రన్స్ రాబట్టారు. అశ్విన్ 29, జురెల్ 20 రన్స్ చేశారు.
TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరొకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు ప్రణీత్ రావుతో కలిసి హవాలా వ్యాపారులను బెదిరించినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. రేపు ఆయన్ను కోర్టులో హాజరుపరచనున్నారు. కాగా ప్రణీత్ అరెస్ట్ కాగానే రాధాకిషన్ అమెరికా వెళ్లిపోయారు. దీంతో పోలీసులు లుకౌట్ నోటీసు జారీ చేయడంతో ఆయన్ను హైదరాబాద్ తిరిగి పంపారు.
బెంగళూరు రామేశ్వరం కేఫ్ బాంబు పేలుళ్ల కేసులో కీలక నిందితుడిని NIA అరెస్ట్ చేసింది. ముజమిల్ షరీఫ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుంది. అతడి నుంచి నగదు, పలు డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకుంది. మరో ఇద్దరు నిందితులు సాజిబ్, అబ్దుల్ కోసం NIA తీవ్రంగా గాలిస్తోంది. కాగా మార్చి 1న రామేశ్వరం కేఫ్‌లో జరిగిన బాంబు పేలుళ్లలో నలుగురు గాయపడ్డారు.
AP: సీఎం జగన్ రాష్ట్రంలో ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదని టీడీపీ చీఫ్ చంద్రబాబు అన్నారు. ‘రాయలసీమ కోసం వైసీపీ చేసిందేమీ లేదు. 142 ప్రాజెక్టులను రద్దు చేశారు. టీడీపీ హయాంలో రాయలసీమలో సాగు నీటి కోసం రూ.12 వేల కోట్లు ఖర్చు చేశాం. కానీ జగన్ మాత్రం రూ.2 వేల కోట్లే ఖర్చు చేశారు. రాష్ట్రాన్ని జగన్ సర్వనాశనం చేశారు. రాష్ట్రాన్ని కాపాడడానికే టీడీపీ, బీజేపీ, జనసేన కలిశాయి’ అని ఆయన పేర్కొన్నారు.
బ్రెజిల్‌కు చెందిన నల్లజాతి బానిస పటా సెకా 200 మంది పిల్లలకు తండ్రయ్యాడు. ఏడడుగులు, కండలు తిరిగిన దేహంతో ఆజానుబాహుడిగా ఉండేవాడు. 19వ శతాబ్దంలో బానిసల యజమానులు అతడిని బానిసగా మార్చి నల్లజాతి యువతులు, మహిళలతో సంపర్కం చేయించేవారు. అలా పలువురు యువతులు, మహిళలకు 200 మందికిపైగా పిల్లలు పుట్టారు. అతడి వల్ల జన్మించే బిడ్డలను 11 ఏళ్లకే కష్టమైన పనులకు ఉపయోగించుకునేవారు. సెకా 130 ఏళ్లు బతికినట్లు సమాచారం.
IPL-2024 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ ఫ్లాప్ షో కొనసాగుతోంది. తొలి మ్యాచులో LSGపై 11 రన్స్‌కే ఔటైన అతడు.. ఇవాళ ఢిల్లీ మ్యాచులోనూ 11 పరుగులకే వెనుదిరిగాడు. గత సీజన్ చివరి 3 మ్యాచుల్లోనూ బట్లర్ డకౌట్ కావడం గమనార్హం. IPLలో గత 5 మ్యాచుల్లో అతడు చేసిన స్కోర్ 22 మాత్రమే. మంచి హిట్టర్‌గా పేరున్న బట్లర్ ఫామ్ RR అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేస్తోంది.
తీహార్ జైలులో ఉన్న MLC కవిత రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. ‘ఇంటి భోజనం, పరుపులు, చెప్పులు, దుస్తులు, బెడ్‌షీట్స్, బుక్స్ అనుమతించడం లేదు. పెన్ను, పేపర్లు.. కనీసం కళ్లజోడు కూడా ఇవ్వడంలేదు. జైలు అధికారులపై తగిన చర్యలు తీసుకోండి. నాకు అవసరమైన వస్తువులు సమకూర్చుకునేలా జైలు సూపరింటెండెంట్‌ను ఆదేశించండి’ అని కోరారు. కాగా ఆమె వినతిని ఎల్లుండి విచారిస్తామని కోర్టు తెలిపింది.
TG: బీజేపీతో కలుస్తున్నామని కేటీఆర్ అన్నందుకే తాను కాంగ్రెస్‌లో చేరానని ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ ఈ మాట తనతో అనలేదని ప్రమాణం చేస్తారా? అని సవాల్ చేశారు. తామంతా BRS సెక్యులర్ పార్టీ అనుకున్నామని, అక్కడ నేతలకు ఆత్మగౌరవం ఉండదని దానం పేర్కొన్నారు.
IPLలో వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిపోయిన ముంబై ఇండియన్స్ జట్టుకు బ్యాడ్ న్యూస్. ఆ జట్టు స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ మరికొన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు సమాచారం. స్పోర్ట్స్ హెర్నియాతో ఇబ్బంది పడుతున్న అతడు జనవరిలో సర్జరీ చేయించుకున్నారు. ప్రస్తుతం NCA వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్న మిస్టర్ 360 ఇంకా పూర్తిగా కోలుకోలేదు. త్వరలో టీ20 వరల్డ్ కప్ ఉండటంతో సూర్యపై బీసీసీఐ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది.
TG: పార్టీ మార్పు, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌తో భేటీపై సీనియర్ నేత కె.కేశవరావు స్పందించారు. ‘కేసీఆర్ నాకు చాలా గౌరవం ఇచ్చారు. నాకు కూడా కేసీఆర్‌పై గౌరవం ఉంది. అయినా కాంగ్రెస్‌లోకి వెళ్లాలనే నిర్ణయించుకున్నా. అదే విషయం కేసీఆర్‌కు చెప్పా. కవిత అరెస్టుపై కూడా చర్చించాం’ అని ఆయన వివరించారు. కాగా కేకే ఎల్లుండి కాంగ్రెస్‌లో చేరనున్నారు.
Sorry, no posts matched your criteria.