India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ (272)కు బీజేపీ 32 సీట్ల దూరంలో ఉండటంతో కాషాయ పార్టీకి తలనొప్పి మొదలైంది. కచ్చితంగా ఎన్డీయే కూటమిలోని పార్టీలు బీజేపీకి సపోర్ట్ చేస్తేనే ప్రభుత్వ ఏర్పాటు సాధ్యం. ప్రభుత్వ ఏర్పాటు తర్వాత అది ఎన్డీయే సర్కారుగా అవతరించనుంది. కానీ గత రెండు ఎన్నికల్లో బీజేపీకి భారీ మెజారిటీ రావడంతో బీజేపీ/మోదీ సర్కారు అని సంబోధించేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు.
TG: పార్లమెంటు ఎన్నికల్లో BRS.. BJPకి మద్దతు ఇచ్చిందని MIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. అందుకే MP ఎన్నికల్లో BRS దారుణంగా ఓడిపోయిందని విమర్శించారు. ‘BRS 8 స్థానాల్లో డిపాజిట్ కోల్పోవడానికి క్రాస్ ఓటింగే కారణం. ఆ పార్టీ ఇలా ఎందుకు చేసిందో నాకైతే అర్థం కావడం లేదు. కొన్ని చోట్ల ఆ పార్టీ నేతలు బహిరంగంగానే BJPకి మద్దతు పలికారు. ఇదొక తప్పుడు వ్యూహం’ అని ఒవైసీ పేర్కొన్నారు.
TG: రాముడి పేరు మీద ఓట్లు యాచించిన బీజేపీని రాముడు కూడా క్షమించలేదని సీఎం రేవంత్ అన్నారు. అందుకే అయోధ్య రామమందిరం ఉన్న ఫైజాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో ఆ పార్టీ ఓడిపోయిందని గుర్తుచేశారు. ‘రాముడి తలంబ్రాల పేరు మీద ఓట్లు కొల్లగొట్టాలనుకున్న బీజేపీని ప్రజలు ఓడగొట్టారు. ఆ పార్టీ నేతలకు రాముడు గుణపాఠం చెప్పాడు. దేవుడి పేరు మీద రాజకీయాలు చేయొద్దు’ అని మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు.
మొత్తం లోక్‌సభ స్థానాలు 543. మేజిక్ ఫిగర్ 272. BJP నేతృత్వంలోని NDAకు 292 సీట్లతో స్పష్టమైన మెజార్టీ ఉంది. కాంగ్రెస్ నేతృత్వంలోని INDIAకు 234 సీట్లున్నాయి. ఇతరులు 17చోట్ల గెలిచారు. కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే NDA కూటమిలోని TDP(16), JDU(12) ఇటువైపు రావాలి. అప్పుడు INDIA మెజార్టీ 262కు పెరుగుతుంది. ఇతరుల్లోని YCP-4, MIM-1తో పాటు మరో ఐదుగురు స్వతంత్రులు మద్దతిస్తే INC అధికారం చేపట్టే అవకాశం ఉంది.
ఏపీ ఎన్నికల్లో అఖండ విజయాన్ని పొందిన జనసేనాని పవన్ కళ్యాణ్‌కి విక్టరీ వెంకటేశ్ అభినందనలు తెలిపారు. ‘చరిత్రాత్మక విజయాన్ని పొందిన ప్రియమైన పవన్‌కి అభినందనలు. ఈ విజయానికి నువ్వు అర్హుడివి మిత్రమా. నువ్వు మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలి. ప్రజలకు సేవ చేయాలనే నీ కృషి, అంకితభావాన్ని కొనసాగించండి. పిఠాపురం ఎమ్మెల్యే గారికి శుభాకాంక్షలు’ అని Xలో పోస్ట్ చేశారు.
NDA నేతలు ఈరోజే రాష్ట్రపతి ముర్మును కలవనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని వారు రాష్ట్రపతిని కోరనున్నారట. మోదీ, నడ్డా, రాజ్‌నాథ్, నితీశ్ కుమార్, చంద్రబాబు, చిరాగ్ పాస్వాన్, మాంఝీ తదితరులు కలవనున్నట్లు సమాచారం.
ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ సాధించిన బీజేపీ అక్కడ ప్రభుత్వ ఏర్పాటుపై కసరత్తు వేగవంతం చేసింది. ఒకటి రెండు రోజుల్లో ఆ పార్టీ సీఎం అభ్యర్థిపై స్పష్టత రానుంది. సీఎం రేసులో జుయల్ ఓరం, ధర్మేంద్ర ప్రదాన్, సంబిత్ పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం 147 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఒడిశాలో BJP 78, BJD 51, కాంగ్రెస్ 14, ఇతరులు 4 చోట్ల గెలిచారు. 21 లోక్‌సభ స్థానాలకు BJP 20, కాంగ్రెస్ ఒకచోట గెలిచాయి.
TG: ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఉత్సవం నిర్వహించనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. వీటిని సచివాలయం, ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్వహిస్తామని వివరించారు. సెక్రటేరియట్‌లో డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు సోనియాగాంధీని ఆహ్వానించనున్నట్లు తెలిపారు.
ఏపీ అసెంబ్లీని గవర్నర్ అబ్దుల్ నజీర్ రద్దు చేశారు. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేశారు. సీఎం జగన్ రాజీనామాకు గవర్నర్ ఆమోదం తెలపడంతో 15వ అసెంబ్లీ రద్దయినట్లు అయింది.
స్టాక్‌మార్కెట్లో నేడు రిలీఫ్ ర్యాలీ జరిగింది. బెంచ్‌మార్క్ సూచీలు భారీగా లాభపడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 2303 పాయింట్లు పెరిగి 74,384 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 735 పాయింట్లు ఎగిసి 22,620 వద్ద క్లోజైంది. దీంతో నేడు మదుపరులు రూ.11 లక్షల కోట్ల సంపద పోగేశారు. నిఫ్టీ50లో 48 కంపెనీలు లాభపడగా 2 నష్టపోయాయి. అదానీ పోర్ట్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, హిందాల్కో, టాటా స్టీల్, ఎం అండ్ ఎం టాప్ గెయినర్స్.
Sorry, no posts matched your criteria.